సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2020 కి సంబంధించి ప్రధానమంత్రి ఎక్స్ లెన్స్ అవార్డులు

702 జిల్లాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2020 కోసం ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డులకి నమోదు అయి పాల్గొన్నారు. వీరు మొత్తం 95% మంది ఉంటారు

Posted On: 25 AUG 2020 2:59PM by PIB Hyderabad

వివిధ జిల్లాలు / కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిథిలో ఉన్న సంస్థలు చేసిన అసాధారణమైన, వినూత్నమైన పనిని గుర్తించడం, రివార్డ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2006 లో “పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డులు” అనే పథకాన్ని ఏర్పాటు చేసింది. ప్రాధాన్యత కార్యక్రమాలు, ఆవిష్కరణలు, ఆకాంక్ష జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల పనితీరును గుర్తించడం కోసం ఈ పథకాన్ని 2014 లో పునర్నిర్మించారు. జిల్లా ఆర్థికాభివృద్ధికి జిల్లా కలెక్టర్ల పనితీరును గుర్తించడానికి ఈ పథకం 2020 లో మళ్లీ పునర్వ్యవస్థీకరించారు. ఈ పథకం కింద ప్రజా పరిపాలనలో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డులను గౌరవ ప్రధానమంత్రి రాష్ట్రీయ ఏక్తా దివాస్ - అక్టోబర్ 31, 2020 న గుజరాత్ లోని కెవాడియాలోని స్టాట్యూ అఫ్ యూనిటీ విగ్రహం వద్ద ప్రదానం చేస్తారు.

2020 సంవత్సరానికి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డుల పథకం పునర్వ్యవస్థీకరించారు. ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యాన్ని గుర్తించి ఈ కింది వ్యవస్థలు బలోపేతం చేయ సంకల్పించారు. 

ప్రాధాన్యత రంగానికి  క్రెడిట్ ఫ్లో ద్వారా సమ్మిళిత అభివృద్ధి, 

జిల్లాల్లో స్వచ్ఛ్ భారత్ మిషన్ కి ప్రజల ఉద్యమంగా  ప్రోత్సహించడం, 

ప్రజా సమస్యల పరిష్కారానికి జన్ భాగీదారి సేవలను ప్రోత్సహించడం  

సృజనాత్మక కేటగిరీకే నిత్యం ఎక్కువ సంఖ్యలో నామినేషన్స్ దాఖలవుతూ వస్తున్నాయి

పీఎం అవార్డుల పోర్టల్ ని కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జులై 17న ప్రారంభించారు. 

 

 <><><><><>


(Release ID: 1648702) Visitor Counter : 239