సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌తో నాగాలాండ్ గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి సమావేశం

Posted On: 24 AUG 2020 6:24PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ (స్వతంత్ర బాధ్యత)తో నాగాలాండ్ గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

    దేశంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమాన స్థాయికి ఈశాన్య ప్రాంతాన్ని చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని, 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే చెప్పామని డా.జితేంద్ర సింగ్‌ పునరుద్ఘాటించారు. అభివృద్ధి అంతరాలు గత ఆరేళ్లలో విజయవంతంగా సమసిపోవడమేగాక, ఈశాన్య ప్రాంతం ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రోది చేసుకుందన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నడవడానికి సమాజంలోని అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయని 
కేంద్రమంత్రి డా.జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

 

<><><><><>


(Release ID: 1648307) Visitor Counter : 171