సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

లింగమార్పిడి వ్యక్తుల కోసం 'జాతీయ మండలి'ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 24 AUG 2020 5:23PM by PIB Hyderabad

లింగమార్పిడి చేయించుకున్నవారి (హక్కుల పరిరక్షణ) చట్టం-2019లోని సెక్షన్ 16 ద్వారా, 'జాతీయ మండలి' ఏర్పాటు చేస్తూ ఈనెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి అధ్యక్షుడిగా (ఎక్స్‌ అఫిషియో), సహాయ మంత్రి ఉపాధ్యక్షుడిగా (ఎక్స్‌ అఫిషియో) వ్యవహరిస్తారు.

జాతీయ మండలి ఈ క్రింది విధులు నిర్వర్తిస్తుంది: 
(ఎ) లింగమార్పిడి వ్యక్తులకు సంబంధించిన విధానాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.
(బి) లింగమార్పిడి వ్యక్తులకు సమానత్వం, సంపూర్ణ భాగస్వామ్యం కోసం రూపొందించిన విధానాలు, కార్యక్రమాల ప్రభావాన్ని పర్యవేక్షిస్తుంది, అంచనా వేస్తుంది.
(సి) లింగమార్పిడి వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలు, సంస్థల కార్యకలాపాలను సమీక్షిస్తుంది, సహకరిస్తుంది.
(డి) లింగమార్పిడి వ్యక్తుల సమస్యలు పరిష్కరిస్తుంది.
(ఇ) కేంద్ర ప్రభుత్వం సూచించిన ఇతర కార్యక్రమాలను అమలు చేస్తుంది.

    వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ప్రతినిధులు, ఐదుగురు లింగమార్పిడి వ్యక్తులు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎన్‌జీవోల ప్రతినిధులు జాతీయ మండలిలో సభ్యులుగా ఉంటారు.

    ఎక్స్‌ అఫిషియో సభ్యులు కాకుండా ఇతర సభ్యులు, తమ నియామకం జరిగిన నాటి నుంచి మూడేళ్ల వరకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
               
సవివర నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 


(Release ID: 1648253) Visitor Counter : 436