శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఘజియాబాద్, ఎన్.డి.ఆర్.ఎఫ్ 8 వ బెటాలియన్ సెంటర్లో 10 పడకల తాత్కాలిక ఆస్పత్రిని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
ఈ ఆస్పత్రిని ఎన్.డి.ఆర్.ఎఫ్ సహకారంతో సిఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రూర్కీ ఏర్పాటు చేసింది.
“ ఆధునికమైన, త్వరగా ఏర్పాటు చేయగల, సురక్షితమైన, అన్ని వాతావరణాలకు సరిపోయే సత్వరం ఉపయోగించగల సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర పరిస్థితులకు, దీర్ఘకాలిక మహమ్మారి పరిస్థితులకు ఇది ఎంతో ఉపయోగం” : డాక్టర్ హర్షవర్ధన్
“దేశం ప్రస్తుతం రోజుకు పది లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం కలిగి ఉంది. ”-డాక్టర్ హర్షవర్ధన్
“మూడు కోవిడ్ -19 వాక్సిన్ కాండిడేట్లు వివిధ దశల ప్రయోగాలలో ముందస్తు దశలలో ఉన్నాయి”- డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
22 AUG 2020 8:20PM by PIB Hyderabad
ఆధునిక, సత్వరం ఏర్పాటు చేయడానికి వీలు కలిగించే, ఒక చోటనుంచి మరోక చోటికి తీసుకెళ్లడానికి వీలు కల్పించే 10 పడకల తాత్కాలిక ఆస్పత్రిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఘజియాబాద్ ఎన్.డి.ఆర్.ఎఫ్ 8 వ బెటాలియన్ సెంటర్ వద్ద ఆవిష్కరించారు. ఈ తాత్కాలిక ఆస్పత్రిని సిఎస్ఐఆర్ అనుబంధ లేబరెటరీ అయిన రూర్కీ సిఎస్ఐఆర్ -సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్, హోంమంత్రిత్వశాఖకు చెందిన జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్ ఎఫ్) ప్రదర్శన ప్రయోజనం, ఎన్.డి.ఆర్.ఎఫ్ వాడకం కోసం ఏర్పాటు చేశాయి. ఇది అత్యవసర పరిస్ధితులలో, దీర్ఘకాలిక మహమ్మారి పరిస్థితులలో వాడకానికి పనికివస్తుంది. సిఎస్ఐఆర్ డిజి, డాక్టర్ శేఖర్ మందే, డిజి, ఎన్‌డిఆర్ఎప్ శ్రీఎస్.ఎన్ ప్రధాన్, డైరక్టర్ సిఎస్ఐఆర్-సిబిఆర్ఐ డాక్టర్ గోపాల కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాక్టర్ హర్షవర్ధన్, తాత్కాలిక ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని, విపత్తుల సమయంలో కూలిన నిర్మాణాలలో గాలింపు సహాయ కార్యక్రమాల తీరుకు సంబంధించిన ప్రదర్శనను చూశారు. అనంతరం ఆయన అక్కడ ఒక మొక్కను నాటారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్ధన్,.“ తాత్కాలిక ఆస్పత్రి సదుపాయాలు ప్రాథమిక ఆరోగ్య సదుపాయం కల్పించేందుకు నిర్దేశించినవి. ఇది భద్రత, సౌకర్యంతో కూడుకున్నది. 20 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. “ ఇది ఆధునిక , త్వరగా ఏర్పాటు చేయడానికి వీలున్న, సురక్షితమైన , అన్ని ప్రాంతాలకు, అన్ని వాతావరణ కాలాలకూ అనువైనది.ఇది విపత్తుల సమయంలో, దీర్ఘకాలిక మహమ్మారుల సమయంలో అత్యవసర పరిస్థితులలో ఏర్పాటు చేసుకునేందుకు పనికివస్తుంది ” అని ఆయన అన్నారు.
దేశంలో ప్రస్తుతం రోజుకు 10 లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. 1500 లేబరెటరీల ద్వారా వీటిని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. మూడు వాక్సిన్‌లకు సంబంధించిన పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయని, అవి పురోగతి దశలో ఉన్నాయని ఆయన అన్నారు.వీటిలో ఒకటి మూడోదశ ప్రయోగంలో ఉందని చెప్పారు. వివిధ దశలలో ప్రయోగాలు పూర్తి అయిన తర్వాత మనదేశంలో వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు
సి.ఎస్.ఐ.ఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మందే మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి అనంతరం , సిఎస్ఐఆర్ అనుబంధ లేబరెటరీలైన సిఎస్ఐఆర్-సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ (సిఎస్ఐఆర్-సిబిఆర్ఐ)రూర్కీ, సిఎస్ఐఆర్-స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (సిఎస్ఐఆర్-ఎస్.ఇ.ఆర్.సి)లు సంయుక్తంగా తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుపై కృషిచేశాయని, ప్రకృతి విపత్తుల అనంతరం ఏర్పాటు చేసే షెల్టర్‌కు తగిన మార్పులు చేసి దీనిని రూపొందించారని ఆయన తెలిపారు.
మడత పెట్టేందుకు వీలైన, ఫ్రేమ్ కలిగిన స్టీల్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారని, ఒక వ్యక్తి తన భుజంపై కొన్ని ఫ్రేములు మోసుకు వెళ్లి నిర్దేశిత ప్రాంతానికి చేర్చి వాటిని అత్యంత తక్కువ సమయంలో తిరిగి అమర్చడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. సిఎస్ఐఆర్-సిబిఆర్ఐ ఈ తరహా తాత్కాలిక ఆస్పత్రులను ప్రదర్శన నిమిత్తం ఘజియాబాద్‌లోని ఎన్‌డిఆర్ఎఫ్ 8 వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసినట్టు ఆయనతెలిపారు
ఎన్.డి.ఆర్.ఎఫ్ డైరక్టర్ జనరల్ శ్రీ ఎస్.ఎన్. ప్రధాన్ మాట్లాడుతూ, సిఎస్ఐఆర్-సిబిఆర్ఐ, ఎన్.డి.ఆర్.ఎప్ లు సమన్వయం తో పనిచేసి మూడు రోజులలో దీనిని నిర్మించినట్టు తెలిపారు.
దీనికి కరుణ భవన్ అనిపేరు పెట్టారు. అనంతరం ఎన్.డి.ఆర్.ఎప్ ఇందులో ఆస్పత్రికి అవసరమైన ఫర్నిచర్‌ను, వెలుపలి ఆకృతులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్) మల్టీ డిసిప్లినరీ , అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తగిన శిక్షణ పొందిన నిపుణులు గల సంస్థ అని శ్రీ ప్రధాన్ చెప్పారు. విపత్తుల స్పందనలో తన కృషిని , దేశంలో విపత్తు రిస్కు తగ్గించడంలో తన ప ట్టుదలను రుజువుచేసుకున్నదని ఆయన అన్నారు. 2020 జనవరి నుంచి కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణకు ఎన్.డి.ఆర్.ఎఫ్ తనవంతు కృషి కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాలలో, నౌకాశ్రయాలలో, భద్రతా సిబ్బంది, ఎయిర్‌లైన్సు, కార్గొ , ఇమిగ్రేషన్ కార్యకలాపాలలో పాల్గొనే వారికి శిక్షణ ఇచ్చేందుకు 473 ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు.
ఈ సంస్థ కోవిడ్ -19 పై కమ్యూనిటీ అవగాహనకు సంబంధించి అన్ని రాష్ట్రాలలో కార్యక్రమాలు నిర్వహించింది. ఇది కోట్లాది మందికి ప్రయోజనం కలిగించింది. శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు తోడు ఎన్.డి.ఆర్.ఎఫ్ , కోవిడ్ మహమ్మారి నియంత్రణలో రాష్ట్రప్రభుత్వాలకు సహాయపడుతున్నది.
ఘజియాబాద్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రి వ్యవస్థలొ సత్వర నిర్మాణం, మడతపెట్టడానికి వీలైన ఫ్రేమ్‌లు, తేలికపాటి పరికరాలు, భద్రత, సౌకర్యవంతం, తక్కువ ఖర్చు, పునర్ నిర్మాణానికి వీలు , తగినంత థర్మల్ ఇన్సులేషన్ , నీటికి తడవకుండా వాటర్ ప్రూఫింగ్, వంటివి ఉన్నాయి. ఇవన్నీ స్థానికంగా అందుబాటులో ఉన్న నైపుణ్యాలతోనే ఏర్పాటు చేశారు. దీనికితోడు అల్ట్రావైలట్ కిరణాల రక్షణ, స్థలాన్ని బహుళ ప్రయోజనకరంగా వినియోగించుకునేందుకు అవకాశం, పునర్‌వినియోగానికి అవకాశం, బాక్టీరియా నిరోధక మెటీరియల్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
విపత్తుల నిర్వహణ సంస్థలు ఇలాంటి ఫ్రేమ్ షెల్టర్లను దగ్గర ఉంచుకుని వివిధ రాష్ట్రాలలో అవసరం ఉన్న చోటికి వీటిని తరలించవచ్చు. వీటిని వైద్య బృందాలకు, గోడ్‌న్ సదుపాయాలకు, పాఠశాలలకు, విశ్రాంతి గృహాల నిర్మాణానికి ఉపయోగించవచ్చు. మామూలు సందర్భాలలో వీటిని పర్యాటకులకు సదుపాయాలు కల్పించడానికి వాడవచ్చు.
తాత్కాలిక ఆస్పత్రిలో గల సదుపాయాలు కిందివిధంగా ఉంటాయి.:
1) పది పడకల ఎయిర్‌కండిషన్డ్ వార్డు, అవసరమైతే దీనిని 20 పడకలకు పెంచుకోవచ్చు.
2) ప్రతి బెడ్‌కు సెంట్రల్ పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా . ఇది 21 ఆక్సిజన్ సరఫరా పాయింట్లను అనుసంధానం చేస్తుంది. కోవిడ్ పేషెంట్లు పెరిగినా వీటిని వాడుకోవచ్చు.
3) వ్యాధి తీవ్రత ఎక్కువ గా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ స్థాయిలతో సహా ఇతర ప్రమాణాలను పరిశీలించేందుకు ఏర్పాట్లు
4) గుండెపోటు పేషెంట్లకు వాడే ఎఇడి, డెఫిబ్రిలియేటర్లు,
5) ఇసిజి సదుపాయం
6) ఒక డ్రెస్సింగ్‌రూము, మైనర్ సర్జికల్ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వసతి
7) మామూలు వైద్య పరమైన పరీక్షలకు చిన్న ల్యాబ్ సదుపాయం
8).రిసిప్షన్, వెయిటింగ్ ఏరియా, చేతుల తో తాకకుండా శానిటైజేషన్ చేసుకునే సదుపాయం.
వాష్‌రూమ్‌లు, చేతితో తాకనవసరం లేకుండా సెన్సర్ ద్వారా పనిచేసే కుళాయిలు, వాష్‌బేసిన్
9) డాక్టర్ ఛాంబర్లు
10) రికార్డు రూము
11) మందులు నిల్వచేసే గది, తగిన మందులతో డిస్పెన్సరీ
12) మందులు ,ఇంజక్షన్లు నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్ సదుపాయం
13) కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు చికిత్సలో పాల్గోనే వైద్యసిబ్బంది వైద్యసంబంధ రక్షణ కవచాలను వేసుకోవడానికి, మార్చుకోవడానికి వీలు కల్పించే ప్రత్యేక ప్రదేశం ఏర్పాటు
14) అంబులెన్సులు, అత్యవసర వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం
*****
(Release ID: 1648032)
Visitor Counter : 176