కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ 2020-జూలైలో ఈపీఎఫ్ఓ తన చందాదారుల కేవైసిని నవీకరించడంలో విశేషమైన పురోగతి సాధించింది.

2.39 లక్షల ఆధార్ సంఖ్యలు, 4.28 లక్షల మొబైల్ నంబర్లు, 5.26 లక్షల బ్యాంక్ ఖాతా దాని చందాదారుల యుఎఎన్‌లో ఉన్నవి అప్ డేట్ అయ్యాయి.

Posted On: 22 AUG 2020 4:41PM by PIB Hyderabad

జూలై 2020 నెలలో, 2.39 లక్షల ఆధార్, 4.28 లక్షల మొబైల్ నంబర్లు మరియు 5.26 లక్షల బ్యాంక్ ఖాతాలను ఇపిఎఫ్ఓ తన చందాదారుల యుఎన్ లో నవీకరించడంలో విజయవంతమైంది. కోవిడ్-19 మహమ్మారి నుండి పెద్ద సవాలును దేశం ఎదుర్కొంటున్నందున, సామాజిక దూరం అనే భావన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశంలోని ప్రధాన సామాజిక భద్రతా సంస్థగా ఈపీఎఫ్ఓ, తన చందాదారులకు డిజిటల్ మోడ్ ద్వారా అతి తక్కువ సంపర్కంతో ఆటంకం లేని సేవలను అందించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంస్థ, దాని ఆన్‌లైన్ సేవల లభ్యత, విస్తరణను పెంచే ప్రయత్నంలో, ఆన్‌లైన్ మోడ్ ద్వారా తన సేవలను పొందడంలో చందాదారులను ఎనేబుల్ చెయ్యడానికి కస్టమర్ డేటాను ముందుగానే అప్‌డేట్ చేస్తోంది. కేవైసి నవీకరణ అనేది తన వివరాలతో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఏఎన్) ను లింక్ చేయడం ద్వారా దాని చందాదారుల గుర్తింపు ధృవీకరణకు సహాయపడే ఏక కాల ప్రక్రియ. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత, డే  వివరాలను సీడ్ చేసిన తర్వాత, ఈపీఎఫ్ చందాదారుడు డిజిటల్ మోడ్ ద్వారా ఆ సేవలను పొందటానికి అధికారం పొందుతాడు. దాని చందాదారులను, దాని ఉద్యోగులను కాపాడటానికి, సంస్థ తన చందాదారుల కేవిసి నవీకరణపై చురుకుగా దృష్టి పెట్టడానికి ఒక వ్యూహాన్ని అవలంబించింది, ఈ కీలకమైన పనిపై తన ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివిటీగా నియమించడం ద్వారా పెద్ద సంఖ్యలో ఈపీఎఫ్ సిబ్బందికి కేవైసి ని అప్‌డేట్ చేసే పనిని ప్రత్యేకంగా అప్పగిస్తారు, ఇది చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చింది. 

******


(Release ID: 1648007) Visitor Counter : 152