నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్ సంబంధిత ఆవిష్కరణలకు సంబంధించి 3 పేటెంట్లు దాఖలు చేసిన బెరహంపూర్ సాంకేతిక శిక్షణ సంస్థ(ఐటిఐ)
ఆత్మనిర్భర్ భారత్‌కు సాంకేతిక పరిజ్ఞాన తోడ్పాటు
Posted On:
21 AUG 2020 4:12PM by PIB Hyderabad
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో తమ సాంకేతిక నైపుణ్యాన్నిఉపయోగించి సహాయపడేందుకు బెరహంపూర్ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటిఐ), సాగిస్తున్న కృషిలో భాగంగా, కోవిడ్ పై పోరాటానికి అభివృద్ధి చేసిన నూతన ఆవిష్కరణలకు సంబంధించి మూడు వినూత్న ఉత్పత్తులను పేటెంట్ జర్నల్ లో రిజిస్టర్ చేయించింది. దీనితో ఈ సంస్థ ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తనకు సత్తా ఉన్నదని రుజువుచేసుకున్నది.
ఇది ఈ ఆవిష్కరణలపై ఇన్‌స్టిట్యూట్‌కు ప్రాధాన్యతా హక్కును కల్పిస్తుంది. ఐఐటిలు, ఎన్.ఐటిల బాటలో ఐటిఐ బెరహంపూర్ దేశ పేటెంట్ ఇన్‌స్టిట్యూట్ క్లబ్లో చేరింది. రాగల రోజులలో ఇది మరిన్ని ఐటిఐలు ఇలా తమ ఆవిష్కరణలకు పేటెంట్‌ల నమోదుకు ప్రయత్నించే అవకాశంఉంది.ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన ఆత్మనిర్భర్ భారత్‌కు దోహదపడుతుంది.
బెరహంపూర్ ఐటిఐ కృషిని అభినందిస్తూ, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్‌పాండే ,“ నేలను ఇన్‌ఫెక్షన్ రహితం చేసే యువిసి రోబో వారియర్, లేదా మొబైల్‌స్వాబ్ కలక్షన్ కియోస్కు, ఇలా ఏదైనా కానివ్వండి పారిశ్రామిక శిక్షణా సంస్థలు కోవిడ్ -19పై పోరాటంలో ముందున్నాయి. ఇలాంటి ఆవిష్కరణలు స్వావలంబన సాధించి, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు వీలు కల్పించడమే కాక, మరిన్ని ఐటిఐలు కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వినూత్న పరిష్కారాలతో ముందుకు రాగలవని భావిస్తున్నాను. ఐటిఐ బెరహంపూర్ దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఐటిఐలకు ఆదర్శంగా నిలిచినందుకు, కొవిడ్ పై ప్రభుత్వం సాగిస్తున్న కృషికి మద్దతుగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.” అని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆత్మ నిర్భర్ భారత్ , అత్యున్నత ప్రతిభను వెలికితీసేందుకు హామీ ఇచ్చింది. ఐఐటి , బెరహంపూర్ స్వావలంబన కృషికి నాయకత్వం వహించడంలో కీలక స్థానంలో ఉంటుంది. అని ఆయన అన్నారు.
ఈ సంస్థకు చెందిన మూడు ఆవిష్కరణలు ఇలా ఉన్నాయి.
మొబైల్ స్వాబ్ కలక్షన్ కియోస్కు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం కోవిడ్ -19 వైరస్ ఏరోసోల్ గాలిద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఏరోసోల్స్ ఎక్కువ కాలం గాలిలో ఉండే అవకాశం ఉంది. అందువల్ల స్వాబ్ కలెక్షన్ లకోసం మొబైల్ కియోస్కులు లేదా ఆస్పత్రుల వద్ద పేషెంట్లు వెలుపల ఉంటుంటారు. హెల్త్ టెక్నీషియన్ కియోస్కులో ఉంటారు. అలాంటపుడు శాంపిళ్ళు సేకరించిన ప్రాంతంలో ఏరోసోల్ కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇది కోవిడ్ వైరస్ ఆ ప్రాంతం నుంచి వ్యాపించే అవకాశం ఉండవచ్చు. ఐటిఐ బెరహంపూర్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనింది. అనుమానిత పేషెంట్‌ను క్యాబిన్‌లో ఉంచి, టెక్నీషియన్‌ను కియోస్కు వెలుపల ఉండేలా చేసింది. నెగటివ్ ప్రెషర్ టెక్నాలజీ ని ఉపయోగించి హెచ్.ఇ.పి.ఎ ఫిల్టర్లు ఎరోసోల్‌ను ఫిల్టర్ చేస్తాయి. దీనితో ఆ ప్రాంతాన్ని కోవిడ్ వైరస్ రహిత ప్రాంతంగా మార్చడానికి వీలు కలుగుతుంది.
యువిసి శానిటైజర్:
ఇది షూ సోల్ శానిటైజింగ్‌కు ఉపయోగించే పరికరం. దీనికి పోర్టబుల్ ప్లాట్‌ఫాం ఉంటుంది. యువిసి కాంతి, సెన్సర్లతో ఇది పనిచేస్తుంది. యువిసి ఐలైట్ కిరణాలను ప్రసరింప చేసి ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్‌ను చంపివేస్తుంది. ఇందుకు సంబంధించి డిజిటల్ కౌంటర్ యంత్రాన్ని 8 సెకండ్లకు సెట్ చేస్తారు. 8 సెకండ్ల తర్వాత యువిసి లైట్లు వాటంతట అవే ఆరిపోతాయి. 80 శాతం వైరస్‌లు షూ సోల్ నుంచి వ్యాప్తిచెందుతాయి. కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ కేసులు సమాజంలో పెరుగుతున్నందువల్ల షూ ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవడం అవసరం.పబ్లిక్ ప్రదేశాలలో, ఆస్పత్రులలో, ఆఫీసులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, హోటల్, ఇన్‌స్టిట్యూట్ వంటి వాటిలో షూ సోల్‌ను ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా చేయడానికి ఇది ఉపకరిస్తుంది. పోర్టబుల్ చిన్న సోల్ యంత్రం ఇంటిదగ్గర కూడా వాడుకోవచ్చు.
యువిసి రోబో వారియర్
యువిసి రోబో వారియర్ యంత్రం యువిసి లైట్ డిస్ ఇన్‌ఫెక్షన్ పరికరంగా పనిచేస్తుంది. ఇది ప్రజారవాణా వ్యవస్థలో , కోవిడ్ 19 పేషెంట్లు ఉండే ఐసోలేషన్ రూములలో వివిధ ఉపరితల ప్రదేశాలను ఇన్‌ఫెక్షన్ రహితం చేయడానికి ఉపకరిస్తుంది. ఆయా ప్రాంతాలపై యువిసి లైట్ ద్వారా యువి కిరణాలను ప్రసరింప చేయడం ద్వారా బ్యాక్టీరియా , వైరస్‌లను నిర్మూలిస్తుంది. వైరస్, బాక్టీరియాల డిఎన్ె, ఆర్ఎన్ఎ నిర్మాణాలను ధ్వంసం చేస్తుంది.
ఈ రోబోను ఇన్‌ఫెక్షన్ రహితం చేయాలనుకునే ప్రాంతానికి తీసుకువెళ్లవచ్చు. దీనిని ఆండ్రాయిడ్ మోబైల్‌ఫోనులేదా బ్లూటూత్ తో నియంత్రించవచ్చు. రూము బయట దూరంగాఉండి కూడా రోబో చర్యలను నియంత్రించడానికి వీలు కలుగుతుంది. రోబో కళ్లకు ఏర్పాటు చేసిన కెమరా రోబో కదలికలకు సంబంధించిన మెరైగన సమాచారాన్ని అందిస్తుంది. రోబో శరీరానికి అమర్చిన సెన్సర్లు రోబో గోడకు లేదా మరి దేనికైనా తగిలి ముందుకు పోకుండా ఆగిపోకుండా చూస్తుంది.ఈ రోబోను ప్లైవుడ్ తో తయారుచేశారు. తేలికగా ఉండే దీనిని ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. ఖర్చుకూడా తక్కువ. చార్జి చేయడానికి వీలు కల్పించే బ్యాటరీలతో ఇది లభిస్తుంది.
***
(Release ID: 1647760)
Visitor Counter : 197