రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 సంబంధిత స‌వాళ్లు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ గ‌త ఏడాదికంటే ఎక్కువ స‌ర‌కు రవాణాను మిష‌న్ మోడ్ లో చేప‌ట్టిన రైల్వే

2020 ఆగ‌స్టు 19 నాటికి స‌ర‌కు లోడింగ్ 3.11 మిలియ‌న్ ట‌న్నులు. ఇది గ‌త ఏడాది ఇదే తేదీ నాటి కంటే ఎక్కువ‌.
2020 ఆగ‌స్టు 19 నాటికి భార‌తీయ రైల్వే 306.1 కోట్ల రూపాయ‌ల‌ను స‌ర‌కు లోడింగ్ ద్వారా ఆర్జించింది. ఇది గ‌త ఏడాది ఇదే రోజు నాటి కంటే 5.26 కోట్ల రూపాయ‌లు ఎక్కువ‌.

2020 ఆగ‌స్టు నెలలో 19 వ‌తేదీ వ‌ర‌కు మొత్తం స‌ర‌కు లోడింగ్ 57.47 మిలియ‌న్ ట‌న్నులు. ఇది గ‌త ఏడాది ఇదే స‌మ‌యం కంటే ఎక్కువ‌.

2020 ఆగ‌స్టు నెల‌లో 2020 ఆగ‌స్టు 19 వ‌ర‌కు భార‌తీయ రైల్వేలు 5461.21 కోట్ల రూపాయ‌ల‌ను స‌ర‌కు లోడింగ్ ద్వారా రాబ‌డి ఆర్జించింది. ఇది గ‌త ఏడాది ఇదే స‌మ‌యం కంటే ఇది 25.9 కోట్ల రూపాయ‌లు అధికం

Posted On: 20 AUG 2020 5:50PM by PIB Hyderabad

 

కోవిడ్ -19 స‌వాళ్లు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ భార‌తీయ రైల్వేలు స‌ర‌కు ర‌వాణాకు సంబంధించి గ‌త ఏడాది కంటే మిన్న‌గా చెప్పుకోద‌గిన ల‌క్ష్యాన్ని సాధించింది.

 2020 ఆగ‌స్టు 19 నాటికి స‌ర‌కు ర‌వాణా 3.11 మిలియ‌న్ ట‌న్నులు . ఇది గ‌త ఏడాది ఇదే తేదీ క‌న్న 2.97 మిలియ‌న్ ట‌న్నులు ఎక్కువ‌. 2020 ఆగ‌స్టు 10న భార‌తీయ రైల్వేలు స‌ర‌కు లోడింగ్ ద్వారా 306.1 కోట్ల రూపాయ‌లు ఆర్జించింది. ఇది గ‌త ఏడాది ఇదే తేదీనాటికి ఆర్జించిన దాని క‌న్నా(300.82 కోట్ల‌రూపాయ‌ల‌) 5.28 కోట్ల రూపాయ‌లు ఎక్కువ‌
2020 ఆగ‌స్టు నెల‌లో 19 వ తేదీ నాటికి మొత్తం స‌ర‌కు లోడింగ్ 57.47 మిలియ‌న్ ట‌న్నులు కాగా అది గ‌త ఏడాది ఇదే స‌మ‌యం కంటే (53.65 మిలియ‌న్ ట‌న్నులు) ఎక్కువ‌. 2020 ఆగ‌స్టు నెల‌లో 19 వ తేదీనాటికి భార‌తీయ రైల్వేలు 5461.21 కోట్ల రూపాయ‌లు స‌ర‌కు లోడింగ్ నుంచి ఆర్జించ‌గా  గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి ఆర్జించిన (5435.31 కోట్ల రూ.)దాని కంటే 25.9 కోట్ల రూపాయ‌లు ఎక్కువ‌.
 
దేశంలో ర‌వాణా స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చాల‌న్న గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి పిలుపుమేర‌కు , భార‌తీయ రైల్వేలు స‌ర‌కు ర‌వాణా ప‌రిమాణం, స‌ర‌కు ర‌వాణా వేగాన్ని పెంచ‌డంలో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి సాధిస్తొంది. భార‌తీయ రైల్వే రైల్వే స‌ర‌కు ర‌వాణా సేవ‌ల‌ను ప్రోత్స‌హించ‌నుంది. దీనివ‌ల్ల ట్రేడ‌ర్లు, వ్యాపారులు, స‌ర‌ఫ‌రాదారులు, భార‌తీయ రైల్వే ద్వారా స‌ర‌కు ర‌వాణా వ‌ల్ల జ‌రిగే ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకోగ‌లుగుతారు.
● రైల్వే స‌ర‌కు ర‌వాణా ద్వారా గ‌ల ప్ర‌యోజ‌నాల‌లో కొన్ని:

○  స‌బ్సిడీ అందిస్తున్న కార‌ణంగా స‌ర‌కు ర‌వాణా చౌక‌

○ స‌కాలంలో, స‌మ‌ర్ధ‌వంతంగా గ‌మ్య‌స్థానానికి స‌ర‌కు ర‌వాణా

○ భ‌ద్ర‌మైన ర‌వాణా, ఎలాంటి న‌ష్టం వాటిల్ల కుండా గ‌మ్య‌స్థానానికి స‌ర‌కు ర‌వాణా

○ ప‌ర్యావ‌ర‌ణ హితక‌ర స‌ర‌కు ర‌వాణా- కార్బ‌న్ ఉద్గారాల‌ను త‌గ్గిస్తుంది.

○ కిసాన్ రైలు వంటి ప్ర‌త్యేక రైలు ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా  రైతుల‌కు అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు, త్వ‌ర‌గా పాడైపోయే వాటిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు

○ ఈ ప్రోత్సాహాన్ని ప‌రిశ్ర‌మ అసోసియేష‌న్ల స‌హ‌కారంతో క‌లిపి చేప‌ట్ట‌వ‌చ్చు.

○  దీపావ‌ళి కి స‌కాలంలో స్టాక్ వ‌చ్చే విధంగా త‌యారీదారులు, టోకు వ్యాపారులు ప్రయోజ‌నం క‌లిగించే విధంగా ప్ర‌త్యేక దృష్టి

○స‌ర‌కు ర‌వాణాకు ట్రేడ‌ర్లు సంప్ర‌దించ‌డానికి వీలుగా డైర్ క్ట్ కాంటాక్టు నెంబ‌ర్ల వివ‌రాలకు విస్తృత ప్ర‌చారం.దీనితో సుల‌భ‌త‌ర కార్య‌క‌లాపాల‌కు వీలు.

○భార‌తీయ రైల్వేలు మాన‌వీయ క‌థ‌నాల‌ను ప్ర‌జ‌ల‌తో పంచుకోవ‌చ్చు. సామాన్యులు త‌మ రోజువారి అవ‌స‌రాల‌కు స‌ర‌కును సుల‌భంగా ఎలా అందుకో గ‌లుగుతున్నారో, భార‌తీయ రైల్వే స‌మ‌ర్ధ సేవ‌లు వారికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయో తెలియ‌జేయ‌వ‌చ్చు.
 
భార‌తీయ రైల్వే స‌ర‌కుర‌వాణాకు చేప‌ట్టిన కొన్నిప్ర‌ధాన వినూత్న చ‌ర్య‌లు ఇలా ఉన్నాయి.:

 ◆  డివిజ‌న్‌, జోన్‌లు, రైల్వే బోర్డుల స్థాయిలో  వ్యాపార అభివృద్ధి యూనిట్‌ల ఏర్పాటు

 ◆ స‌ర‌కు ర‌వానా రైళ్ల వేగాన్ని గంట‌కు23 కిలోమీట‌ర్ల వేగం నుంచి 46 గంట‌కు 46 కిలోమీట‌ర్ల వేగానికి పెంచ‌డం జ‌రిగింది.

 ◆ 2020 మార్చి 30 నుంచి -20 జ‌త‌ల టైమ్ టేబుల్డ్ పార్స‌ల్ రైళ్ళు ప్రారంభం
 
 ◆ బంగ్లాదేశ్‌కు పార్స‌ల్‌,కంటైన‌ర్ల ఎగుమ‌తి ట్రాఫిక్ ప్రారంభం- 10 జులై 2020
           
 ◆ బంగ్లాదేశ్‌కు ఆటోమొబైల్స్ కోసం ఎగుమ‌తుల ట్రాఫిక్ ప్రారంభం-12 ఆగ‌స్టు 2020
           
  ◆ దేవ‌లాలి (నాసిక్‌0 నుంచి దానాపూర్ (పాట్నా)కు కిసాన్ రైలు ప్రారంభం. ప‌లు చోట్ల ఆగే ఏర్పాటు. ప‌లు స‌ర‌కులు, ప‌లు పార్టీలు-  2020 ఆగ‌స్టు 7, 14 తేదీల‌లో ఇప్ప‌టికే 2 ట్రిప్పులు న‌డ‌ప‌డం జ‌రిగింది.
           
 ◆  స‌ర‌కు ర‌వాణా ఎక్స్‌ప్రెస్ రైళ్లు- వ్యాపార్ మాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లు

 ◆    రైలు రవాణా మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉండేందుకు టారిఫ్‌, నాన్ టారిఫ్ చొర‌వ‌లు

  ◆       మిష‌న్ మోడ్‌లో గూడ్సు షెడ్‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం- 405 గుర్తింపు

  ◆      క‌స్ట‌మ‌ర్ల ఇంటి వ‌ద్ద‌కు సేవ‌లు అందించేందుకు  త‌పాలాశాఖ‌తో క‌ల‌సి పైల‌ట్ ప్రాజెక్టు ప్రారంభం.

***


(Release ID: 1647447) Visitor Counter : 156