కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8 లక్షలకు పైగా చేరిన పిఎఫ్ చందారులు

Posted On: 20 AUG 2020 6:45PM by PIB Hyderabad

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ( ఇ పి ఎఫ్ ఓ ) తాజాగా ఈ నెల 20న ప్రచురించిన సభ్యుల సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.47  లక్షల చందాదారులు పెరిగారు. నిజానికి కోవిడ్ సంక్షోభం కారణంగా కొత్తగా ఉద్యోగాలలో చేరేవారి సంఖ్య ఏప్రిల్, మే నెలల్లో బాగా తగ్గిపోయింది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ, ఏప్రిల్ లో 0.20 లక్షలమంది, మే నెలలో 1.72 లక్షల మంది కొత్త చందాదారులు ఈ సామాజిక భద్రతా పథకంలో చేరారు. అయితే, జూన్ లో మాత్రం బాగా కోలుకోవటం కనిపించింది. 6.55 లక్షలమంది సభ్యులు చేరటాన్ని బట్టి చూస్తే అంతకు ముందు కంటే 280% అధికంగా నమోదు చేసుకుంటూ వేగంగా కోలుకోవటాన్ని రుజువు చేసింది. ఈ సమాచారం ఆ నెల చందాలు పూర్తిగా చెల్లించినవారి సంఖ్య ఆధారంగా రూపొందించినది.


చందాదారుల సంఖ్య పెరగటానికి ప్రధాన కారణం కొత్త చందాదారులు చేరటమే. పైగా బైటికి వెళ్ళినవారి సంఖ్య బాగా తక్కువగా ఉండటం కూడా మరో కారణం. కొత్త సభ్యుల చేరిక మేనెలలో 3.03 లక్షలుండగా అది 64 % పెరిగి జూన్ నెలలో4.98 లక్షలు అయింది. భవిష్యనిధి చందాదారుల జాబితా నుంచి తొలగినవారు మే నెలలో 4.45 లక్షలుండగా అది 33% తగ్గి జూన్ లో 2.96 కు చేరింది.
బైటికి వెళ్ళిపోయినవారు, మళ్ళీ తిరిగి చేరినవారి సంఖ్య చూస్తే ఆ చందాదారులు ఉద్యోగాలి మారటం వలన ఒక యజమాని ఖాతా నుంచి ఇంకో యజమాని ఖాతాకు మారటం వల్ల జరిగిందేనని అర్థమవుతోంది. ఇది కూడా మే నెల కంటే జూన్ లో సుమారు 44% అధికం. చాలామంది సభ్యులు ఖాతాలు మార్చి సభ్యత్వాన్ని నిలుపుకున్నారే తప్ప సెటిల్మెంట్ కోసం మొగ్గు చూపలేదు.
లింగభేదం ఆధారంగా విశ్లేషించినప్పుడు కొత్తగా వచ్చిన చందాదారులలో మహీలల సంఖ్య మెరుగుపడింది. ఏప్రిల్ లో 37085 మంది ఉందగా, జూన్ నాటికి అది 106059 కు చేరింది. అయితే, మొత్తంగా చూసినప్పుడు కార్మికుల సంఖ్యలో పెద్దగా తేడాలేదు.
విభాగాల వారీగా చూసినప్పుడు నిపుణుల సేవలు అనే విభాగం కింద 2018-19 లో 46%  ఉండగా 2019-20 లో అది 45%  అయింది. 2020-21 మొదటి త్రైమాసికంలో 52.7%  కావటం చూసినప్పుడు చాలా పరిశ్రమలు ఇంకా కోలుకోలేదని అర్థమవుతోంది. అయితే నిపుణుల సేవల విభాగం మాత్రం మంచి పురోగతి చూపిస్తోంది. జూన్ లో నిపుణుల సేవల విభాగంలో చేరినవారు 3.45  లక్షలమంది ఉండగా  నిరుడు ఇదే సమయంలో ఉన్న వారి సగటు సంఖ్య 3 లక్షలమంది. ఈ విభాగంలో ప్రధానంగా మాన్ పవర్ సర్వీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. 


తొలి ఇసిఆర్ చెల్లించిన కొత్త సంస్థల సంఖ్య ఏప్రిల్ లో కనిష్ఠంగా 820  ఉండగా అది మే నెలకల్లా 1802 కి పెరిగింది. జూన్ నెలకు వచ్చే సరికి ఆ సంఖ్య మరింతగా పెరుగుతూ వచ్చి 2390 సంస్థలు తమ ఇసిఆర్ నమోదు చేసుకునే స్థితి వచ్చింది. అంటే, అంతకుముందు నెలకంటే  32% పెరుగుదల నమోదైంది. భారతదేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ  వ్యవస్థీకృత, పాక్షిక వ్యవస్థీకృత రంగాల కార్మికుల సామాజిక భద్రతా నిధులను నిర్వహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 6 కోట్లమంది సభ్యులు చురుగ్గా తమ ఖాతాలు కొనసాగిస్తున్నారు. 

***



(Release ID: 1647433) Visitor Counter : 143