ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోల్‌కతాలోని రాజరత్‌లో కొత్తగా నిర్మించిన క్యాంపస్‌లో ఓపీడీ సేవలు ప్రారంభించిన 'చిత్తరంజన్‌ నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌'

Posted On: 20 AUG 2020 5:52PM by PIB Hyderabad

కోల్‌కతాలోని రాజరత్‌లో కొత్తగా నిర్మించిన క్యాంపస్‌లో, ఓపీడీ సేవలను ఈనెల 19వ తేదీ నుంచి 'చిత్తరంజన్‌ నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌' ప్రారంభించింది. ఈ సేవలను ఆంకాలజీ రోగుల కోసం కేటాయించారు. త్వరలోనే ప్రాథమిక వ్యాధి నిర్ధరణ సౌకర్యాలను, ఆ తర్వాత కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తెస్తారు.

    కోల్‌కతాలోని ఎస్‌.పి.ముఖర్జీ రహదారిలో ఉన్న క్యాంపస్‌ నుంచి 'చిత్తరంజన్‌ నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌' ప్రస్తుతం పనిచేస్తోంది. 1950 నుంచి దేశానికి సేవలు అందిస్తోంది. దేశ తూర్పు ప్రాంతంలో కేన్సర్‌ చికిత్సకు, పరిశోధనకు ఇది ప్రధాన కేంద్రం. ప్రజలు భరించగలిగిన స్థాయిలోనే నాణ్యమైన చికిత్స అందించేందుకు, రాజరత్‌ వద్ద అతిపెద్ద రెండో క్యాంపస్‌ నిర్మాణానికి నిర్ణయించింది. ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే, 460 పడకలతో, భరించగలిగిన ఖర్చులోనే అత్యుత్తమ నాణ్యతతో రోగులకు వివిధ రకాల కేన్సర్‌ చికిత్సలు అందుతాయి. 

    సీఎన్‌సీఐ రెండో క్యాంపస్‌ నిర్మాణానికి 75:25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాయి. ఇక్కడ ఓపీడీ సేవల ప్రారంభంతో, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే రోగులకు చికిత్సలు అందించేందుకు వీలయింది.

***
 



(Release ID: 1647431) Visitor Counter : 157