వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వలసకూలీల కోసం ఆత్మనిర్భర భారత్ పథకం- ఓ సంపూర్ణ విశ్లేషణ

Posted On: 18 AUG 2020 8:34PM by PIB Hyderabad

  కోవిడ్- 19 అనే కొత్త కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలకోసం  “ఆత్మ నిర్భర భారత్ పథకంపేరిట అనేక ఆర్థిక కార్యక్రమాలను భారత ప్రభుత్వం 2020 సంవత్సరం మే నెల మధ్యకాలంలో చేపట్టింది. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాదాపు 8లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కేటాయించింది. 2020 సంవత్సరం మే  15 విషయాన్ని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల ఆహార భద్రతా అవసరాలను తీర్చేందుకు చర్య తీసుకున్నారుజాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి గానీ, ఇతర ప్రజాపంపిణీ పథకాల పరిధిలోకి గానీ రాని వారికి కోవిడ్-19 సంక్షోభ సమయంలో పంపిణీ చేసేందుకు ఆహార ధాన్యాలను కేటాయించారు.

   వివిధ రాష్ట్రాల మధ్య వలసపోయిన కూలీల సంఖ్యకు సంబంధించి సరైన లెక్కలు ఎక్కడా

అందుబాటులో లేవు. అయితే, ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు, వలస కూలీలపై సమాచార సాధనాల్లో వచ్చిన వార్తలను ప్రాతిపదికగా చేసుకుని దేశవ్యాప్తంగా దాదాపు 8కోట్ల మంది వలస కూలీలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్టు అంచనా వేశారు. వలస  కూలీల వాస్తవ సంఖ్య కేంద్ర ప్రభుత్వం వద్దగానీ, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద గానీ అందుబాటులోలేదన్న అంశం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ఎలాంటి కొరత లేకుండా వలస కూలీలకు ఆహార ధాన్యాల పంపిణీ కోసమే ఆత్మనిర్భర భారత్ పథకాన్ని చేపట్టారు. వలస కూలీల సమస్య తీవ్రతపై పత్రికలు, ఇతర సమాచార సాధనాల్లో ప్రధానంగా వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారిపట్ల ఉదారంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే పథకాన్ని ప్రవేశపెట్టారు.

  దేశవ్యాప్తంగా గరిష్టస్థాయిలో వలస కూలీలకు అందేలా చూసేందుకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఎంతో ఉదారంగా ఆహార ధాన్యాలను కేటాయించింది. దేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే జనాభాలో 81శాతం మందిని సగటుగా లెక్కలోకి తీసుకుని ఆమేరకు ప్రతి రాష్ట్రానికి మేరకు అదనపు ఆహార ధాన్యాలను కేటాయించిందిఅంటే ప్రతి రాష్ట్రానికి సమానంగా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండేలా చర్య తీసుకున్నారు. నెలకు 4లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున రెండు నెలలకు (2020 మే, జూన్ నెలలకు) 8లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఆహార, ప్రజాపంపిణీ శాఖ కేటాయించింది. వలస కూలీల వాస్తవ సంఖ్య 8కోట్లే కాబట్టి,వారికి పంపిణీ చేయడానికి  కేటాయింపు సరిపోయింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో అదనపు రేషన్ పంపిణీకోసం రేషన్ కార్డులు లేనివారిని, ఆహార ధాన్యాలు అందుబాటులో లేని వారిని గుర్తించే ప్రక్రియలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పూర్తి స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఇచ్చారు. ఆహార ధాన్యాల పంపిణీ లబ్ధిదారులను గుర్తించేందుకు తగిన యంత్రాగాన్ని రూపొందించుకోవాలని, తర్వాత ఆహార ధాన్యాలను వారికి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది. విషయంలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది.

    ఆత్మనిర్భర భారత పథకం అమలు సందర్భంగా,..ఇతర ప్రాంతాల్లో అంటే.. దారిలో, క్వారంటైన్ కేంద్రాల్లో, కార్మిక శిబిరాల్లో, నిర్మాణ స్థలాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను గుర్తించేందుకు వివిధ రాష్ట్రాల ఆహార, ప్రజాపంపిణీ శాఖలు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాయి. ప్రక్రియలో కార్మిక శాఖ సిబ్బంది, జిల్లాల పరిపాలనా యంత్రాగాల సిబ్బంది, సామాజిక సంఘాలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహాయాన్ని తీసుకున్నారు. గుర్తింపు ప్రక్రియలో, సర్వేల్లో తేలిన లెక్క ప్రకారం 2.8కోట్ల మంది వలస కూలీలకు, చిక్కుకుపోయిన వారికి ఆత్మ నిర్భర భారత్ కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం అదనపు వనరులను యుద్ధ ప్రాతిపదికన సమీకరించారువారికి  రేషన్ షాపుల ద్వారానేకాక,..ప్రధాన రహదారుల్లో, క్వారంటైన్ సెంటర్లలో, కార్మిక శిబిరాల్లో, శరణాలయాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా కూడా ఆహార ధాన్యాల ఉచిత పంపిణీకి ఏర్పాట్లు చేశారు. బాధితులు ఎక్కడ ఉన్నా పంపిణీ సక్రమంగా గరిష్టస్థాయిలో జరిగేలా చూసేందుకు సంచార వ్యాన్లను వినియోగించారు.

   ఆత్మ నిర్భర పథకాన్ని 2020 సంవత్సరం మే నెల మధ్యకాలంలో ప్రకటించారు. పథకం కింద పంపిణీకి లబ్ధిదారులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తించిన తర్వాత, తమతమ ప్రాంతాల్లో పంపిణీీకోసం మొత్తం 6.38 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. ప్రక్రియ కొనసాగుతుండగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరో సమాచారాన్ని కేంద్రానికి తెలియజేశాయి. తమ వద్ద ఉండే వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారని, సొంత ఊళ్లలో వారికి జాతీయ ఆహార భద్రతా చట్టం లేదా ప్రజా పంపిణీ పథకం వర్తించే అవకాశం ఉందని, అందువల్ల పంపిణీకోసం తాము తీసుకున్న 6.38లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను సంపూర్ణంగా వినియోగించలేకపోయామని పేర్కొన్నాయి. ఫలితంగా,..2020  సంవత్సరం జూన్ నెలాఖరు నాటికి 2.3 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే అవి పంపిణీ చేయగలిగాయి. అయితే, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు,..ఆహార ధాన్యాల పంపిణీ గడువును మరో రెండు నెలలు , అంటే ఆగస్టు నెలాఖరు వరకూ పొడిగించారు. గరిష్ట స్థాయిలో వలస కూలీలకు ఆహార ధాన్యాల పంపిణీ వర్తించేలా అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించారు.

  2020 సంవత్సరం ఆగస్టు 17వరకూ అందిన సమాచారం ప్రకారం,..మొత్తం 6.38లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల్లో 2.49 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 39శాతం ఆహార ధాన్యాలను మాత్రమే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వలస కూలీలకు పంపిణీ చేశాయి. పంపిణీ 2020 ఆగస్టు 31వరకూ కొనసాగనున్నందున, అప్పటికల్లా మరింత మంది వలస కూలీలకు ఆత్మ నిర్భర భారత్ పథకం కింద ప్రయోజనం అందవచ్చని భావిస్తున్నారు. కూలీలు తమ సొంత రాష్ట్రాలకు చేరుకుని, ఇప్పటికే జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్రాల రేషన్ కార్డుల పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉంటే వలస కూలీల సంఖ్య అంచనాలకంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆత్మనిర్భర పథకం కింద ఇప్పటికే కేటాయించిన ఆహార ధాన్యాలు తక్కువ స్థాయిలో వినియోగం జరిగితే ఇదే అంశం మరింతగా నిర్ధారితమవుతుంది.

   ఆత్మనిర్భర భారత పథకం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయడంతోపాటుగా, ఉత్తరప్రదేశ్, బీహార్, త్రిపుర, మణిపూర్, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు 2020 సంవత్సరం మార్చి నెల తర్వాత కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులను మంజూరు చేశాయి. ఉత్తరప్రదేశ్ 45లక్షల రేషన్ కార్డులుబీహార్ 15 లక్షలు, త్రిపుర 25,000, మణిపూర్ 10,000, జమ్ము కాశ్మీర్ 35,000 కార్డులను మంజూరు చేశాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రధానమంత్రి గ్రామ కల్యాణ యోజన పథకాల ద్వారా సబ్సిడీ కోటా ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు కార్డులను మంజూరు చేశారు. అంటే, ఇదివరకు  పంపిణీ జరగని దాదాపు 60.70లక్షలమందికి అదనంగా ఆహార ధాన్యాల పంపిణీ వర్తింపజేశారువీరు ఇదివరకు ఇతర రాష్ట్రాల్లో ఉండి, తిరిగి వచ్చిన తర్వాత వారికి కొత్త రేషన్ కార్డలు మంజూరు చేశారు. అంటే, ఆత్మనిర్భర భారత్ పథకం వర్తింప జేసిన 2.51కోట్ల మంది వలస కూలీలను కూడా చేర్చుకుంటే, నెలవారీ వాస్తవ లబ్ధిదారుల సంఖ్య 3.81కోట్ల మందికి చేరుకుంటుంది. ఇది కాక, పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఓపెన్ మార్కెట్ సేల్స్ పథకం (.ఎం.ఎస్.ఎస్.) కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను తీసుకుని, వాటిని వివిధ పౌర సంఘాలకు, ఎన్జీవోలకు, జిల్లా పరిపాలనా యంత్రాగాలకు అందజేశాయి. చాలా మంది వలస కూలీలకు దారిలో ఆహారం కిట్లుగా, భోజనం ప్యాకెట్లుగా పంపిణీ చేసేందుకు వీటిని కేటాయించారు. రాష్ట్రాల ప్రకృతి వైపరీత్య ప్రతిస్పందనా నిధి (ఎస్.డి.ఆర్.ఎఫ్.)కి సంబంధించిన వనరులను కూడా వలస కూలీలకోసం కొన్ని రాష్ట్రాలు ప్రారంభంలో వినియోగించుకున్నాయి.

    జాతీయ ఆహార భద్రతా చట్టం దాదాపు 81 కోట్ల మందికి వర్తిస్తోంది. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సొంత పథకాల ద్వారా అదనంగా 20కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. అంటే, మొత్తంగా వందకోట్ల మందికిపైగా లబ్ధిదారులకు వివిధ ప్రజాపంపిణీ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నా, అదనంగా 8కోట్ల మందికి లబ్ధిని చేకూర్చడం మాత్రం ఉదారంగానే జరిగింది. వారికి కేటాయించిన ఆహార ధాన్యాల వినియోగం కూడా ఒక మోస్తరుగా మాత్రమే జరిగిందంటే, వలస కూలీల వాస్తవ సంఖ్య అంచనా కంటే బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే, అవసరానికంటే ఎక్కువ స్థాయిలోనే ఆహార ధాన్యాలు అందాయని, వలస కూలీలకు ఎక్కడా కొరత రాలేదని ఇది సూచిస్తోంది. 8కోట్ల మంది వలస కూలీలు ఉన్నారనేది వాస్తవం కాకపోవచ్చని తెలుస్తోంది. సంఖ్య 2.33కోట్లుగా మేలో లెక్కతేలగా, 2.37కోట్లుగా జూన్ లో లెక్కించారు. అయితే, 2020 సంవత్సరం మే నెలాఖరు నాటికి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అంచనా ప్రకారం వలస కూలీల లెక్క 2.80 కోట్లుగా సూచన ప్రాయంగా తెలుస్తోంది. దీనికి తోడు 2020 మార్చి తర్వాత 60.70లక్షల మంది అదనపు జనాభా తమతమ రాష్ట్రాలకు తిరిగి వచ్చిన తర్వాత వారికి వివిధ పథకాల కింద రేషన్ అందుతూవస్తోందిఅందువల్ల 8కోట్ల మంది అన్న లెక్కను వాస్తవమైన వలసకూలీల సంఖ్యగా, ఆత్మ నిర్భర పథకం లక్ష్యంగా భావించడానికి వీల్లేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే తీసుకున్న ఆహార ధాన్యాల పంపిణీకి గడువును పెంచినప్పటికీ జూలై నాటికి 21లక్షల మందికి, ఆగస్టు నాటికి 6లక్షల మందికి పంపిణీని వర్తింపజేయగలిగారు. అంటే, ఆత్మనిర్భర భారత పథకం కింద వలస కూలీలకు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి అందరికీ ప్రయోజనం చేకూరినట్టుగా సూచన ప్రాయంగా తెలుస్తోంది. అంటే, సకాలంలో ప్రవేశ పెట్టిన పథకం చక్కని విజయం సాధించినట్టుగానే భావించాల్సి ఉంది.

****

 

 

 

 (Release ID: 1647201) Visitor Counter : 193