హోం మంత్రిత్వ శాఖ
నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎ) ఏర్పాటును ఆమోదించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా .
“ భారత యువతకు ఇది చరిత్రాత్మక దినం”
“ ఉద్యోగ నియామక ప్రక్రియను సులభతరం చేసి, పారదర్శకత కల్పించడం ద్వారా ఉద్యోగార్ధులకు తగిన హక్కును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల్పించారు.”
“ ఎన్.ఆర్.ఎ ఏర్పాటుకు నిర్ణయం, శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న అపూర్వమైన చర్య.ఇది ఉమ్మడి పరివర్తనాత్మక రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు వీలు కల్పిస్తుంది.”
“ ఈ పరివర్తనాత్మక సంస్కరణ, ఉమ్మడి అర్హత పరీక్ష (సిఇటి) ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పలు పరీక్షలురాసే ఇబ్బందులు తొలగిస్తుంది.”
“ ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు, పలు భాషలలో పరీక్షల నిర్వహణ, మూడు సంవత్సరాలపాటు సెట్ స్కోరు చెల్లుబాటువంటి వాటివల్ల ,సమాజంలోని అన్ని వర్గాల వారికి ఎన్.ఆర్.ఎ సమాన అవకాశాలు కల్పిస్తుంది.”
“ ఒకే పరీక్ష వల్ల ఆర్ధిక భారం తగ్గుతుంది. ఇది అభ్యర్ధులకు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తుంది.”
Posted On:
19 AUG 2020 8:49PM by PIB Hyderabad
కేంద్రకేబినెట్ ఈరోజు నిర్వహించిన సమావేశంలో ,నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎ) ఏర్పాటును ఆమోదించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతీయ యువతకు చరిత్రాత్మక దినమని అంటూ శ్రీ అమిత్ షా, “ ఈ పరివర్తనాత్మక సంస్కరణ, ఉమ్మడి అర్హత పరీక్ష (సిఇటి) ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పలు పరీక్షలురాసే ఇబ్బందులు తొలగిస్తుంది” అని అన్నారు.
“ ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు, పలు భాషలలో పరీక్షల నిర్వహణ, మూడు సంవత్సరాలపాటు సెట్ స్కోరు చెల్లుబాటువంటి వాటివల్ల , సమాజంలోని అన్ని వర్గాల వారికి ఎన్.ఆర్.ఎ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఒకే పరీక్ష వల్ల ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఇది అభ్యర్ధులకు ఎంతగానో ప్రయోజనకరం” అని శ్రీ అమిత్ షా అన్నారు.
“ నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటు శ్రీ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అపూర్వమైన చర్య.ఇది ఉమ్మడి పరివర్తనాత్మక రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు వీలు కల్పిస్తుంది. ఉద్యోగ నియామక ప్రక్రియను సులభతరం చేసి, పారదర్శకత కల్పించడం ద్వారా దేశ ఉద్యోగార్ధులకు తగిన హక్కును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల్పించారు.” అని అమిత్ షా పేర్కొన్నారు.
***
(Release ID: 1647147)
Visitor Counter : 116