ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రెడ్ క్రాస్ కార్యాలయంలో తలసీమియా పరీక్షా కేంద్రం ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 18 AUG 2020 5:58PM by PIB Hyderabad

భారత రెడ్ క్రాస్ సొసైటీ కేంద్ర కార్యాలయంలో  తలసీమియా పరీక్షలు, కౌన్సిలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి దాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభించటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సేవలను అభినందించారు. ఇలాంటి చొరవ తీసుకోవటం ద్వారా సామాన్య ప్రజలకు ఈ వ్యాధి నివారణ పట్ల అవగాహన కల్పించటం సాధ్యమవుతుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మంది తలసీమియా బాధితులున్నారని మంత్రి గుర్తు చేశారు. ప్రపంచంలో భారతీయ బాలలే అత్యధికంగా తలసీమియాతో బాధపడుతున్న విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో లక్ష నుంచి లక్షన్నర మంది ఈ వ్యాధితో ఉండగా ఏటా 10,000 -15,000 మంది తలసీమియాతోనే పుడుతున్నారన్నారు. ఎముక మూలుగ మార్పిడి మాత్రమే దానికి అందుబాటులో ఉన్న చికిత్స  అని డాక్టర్ హర్ష వర్ధన్ గుర్తు చేశారు. అయితే, అది చాలా కష్టమైన వ్యవహారమని, బాధితుల తల్లిదండ్రులందరికీ అందుబాటులో ఉండే వ్యవహారం కాదని కూడా అన్నారు. అందుకే అదే పనిగా రక్తమార్పిడి చేస్తూ ఉండాల్సిన అవసరం ఉందని, ఆ తరువాత అదనపు ఐరన్ ను తొలగించాల్సి ఉంటుందని అన్నారు.

ఐ ఆర్ సి ఎస్ తీసుకుంటున్న తాజా చర్యల వలన తలసీమియా బాధితులకు మెరుగైన చికిత్స  అందుబాటులోకి వచ్చిందని, ఈ సువర్ణావకాశం వల్ల పిల్లలజీవితం మెరుగవుతోందని చెప్పారు. పరీక్షలు, కౌన్సిలింగ్, ప్రసవానికి ముందే జరిపే వ్యాధి నిర్థారణ పరీక్షల వలన పిల్లలు హీమోగ్లోబినీపతీ తో పుట్టకుండా నివారించే అవకాశం కలుగుతోంందన్నారు. అదే సమయంలో జన్యుపరమైన లోపాలతో పుట్టి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీసే పరిస్థితిని ఇది నివారిస్తుందని చెప్పారు. ఇలాంటి పురోగామి చర్యలతో 2022 నాటికి మనం ప్రధాన మంత్రి ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

తలసీమియా, సికిల్ సెల్ వ్యాధి లాంటి హీమోగ్లోబినోపతీలు ఎర్ర రక్త కణాల ద్వారా అనువంశికమ్గా వచ్చే సమస్యలే గనుక వాటిని నివారించటానికి వీలుందన్నారు. ఇవి దీర్ఘ కాల వ్యాధులని, జీవితాన్ని నిర్వీర్యం చేస్తాయని, కొన్ని సందర్భాలలో ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదముందని అన్నారు.  వీతి వలన కుటుంబాలలో మానసిక ఉద్వేగపరమైన సమస్యలతోబాటు ఆర్థిక భారం ఏర్పడే సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. భారత్ లో తలసీమియా మేజర్, దాని తీవ్ర రూపమైన తలసీమియా ఇంటర్మీడియా ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. జీవితకాలంపాటు రక్తమార్పిడి చేస్తూ ఉండటం ద్వారా వీటి తీవ్రత తగ్గిస్తూ ఉండవచ్చునని తల్లిదండ్రుల జన్యువుల నుంచే ఈ వ్యాధి సంక్రమిస్తుందని అన్నారు. 


ఐ ఆర్ సి ఎస్ సెక్రెటరీ జనరల్ శ్రీ ఆర్ కె జైన్, ఐ ఆర్ సి ఎస్, తలసీమిక్స్ ఇండియా, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులుకూడా ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***(Release ID: 1646823) Visitor Counter : 190