గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన ఆరోగ్య పోషకాహార పోర్టల్ 'స్వాస్థ్య' ఆవిష్కరణ - జాతీయ విదేశీ పోర్టల్, జాతీయ గిరిజన ఫెలోషిప్ పోర్టల్ ప్రారంభం

Posted On: 17 AUG 2020 4:25PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను ఈ  రోజు ప్రకటించింది. వీటిలో, ఆరోగ్య పోషకాహార పోర్టల్ 'స్వాస్థ్య', ఈ-న్యూస్ లెటర్ 'ఆలేఖ',  జాతీయ విదేశీ పోర్టల్, జాతీయ గిరిజన ఫెలోషిప్ పోర్టల్ ఉన్నాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా, సహాయ మంత్రి శ్రీమతి రేణుక సింగ్ సరుతా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కాబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శి (సమన్వయం) శ్రీ వి.పి.జాయ్, గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దీపక్ ఖండేకర్ పాల్గొన్నారు. సంయుక్త కార్యదర్శి శ్రీ నావల్జిత్ కపూర్ 11 పథకాల వివరాలను ప్రెజెంటేషన్ ఇచ్చారు.  

శ్రీ అర్జున్ ముండా గిరిజన ఆరోగ్యం, పోషణపై ఈ-పోర్టల్ ను ప్రారంభించారు, ఈ రకమైన మొదటి ఇ-పోర్టల్, భారతదేశ గిరిజన జనాభాకు సంబంధించిన అన్ని ఆరోగ్య, పోషకాహార సంబంధిత సమాచారం ఒకే వేదిక ద్వారా అందుబాటులో ఉంటుంది. సాక్ష్యాలు, నైపుణ్యం, అనుభవాల మార్పిడిని సులభతరం చేయడానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన వినూత్న పద్ధతులు, పరిశోధనా సంక్షిప్తాలు, కేస్ స్టడీస్,  ఉత్తమ పద్ధతులను స్వాస్థ్య పోర్టల్ సమన్వయము చేస్తూ వివరాలు అందజేస్తుంది. ఆరోగ్యం, పోషకాహారం కోసం పిరమల్ స్వాస్థ్యను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ (కెఇఎమ్ ఫర్ కెఎమ్) గా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. సిఓఈ నిరంతరం మంత్రిత్వ శాఖతో సంప్రదిస్తూ, దేశ గిరిజన జనాభా ఆరోగ్యం, పోషణకు సంబంధించిన ఆధారాలతో సహా విధానం, నిర్ణయాలు వీలుగా తగు వివరాలను (ఇన్ ఫుట్) అందిస్తుంది. ఈ పోర్టల్: http://swasthya.tribal.gov.in ఎన్ఐసి క్లౌడ్ లో ఉంచారు.   

ఈ సందర్భంగా శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ, “అందరికీ ఆరోగ్య సంరక్షణ లభ్యత మన ప్రధానమంత్రి ప్రధానమైన ప్రాధాన్యతలలో ఒకటి. కాలక్రమేణా ప్రజారోగ్య ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ, గిరిజన, గిరిజనేతర జనాభా మధ్య తేడాలు అలాగే ఉన్నాయి. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ అంతరాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉంది. ‘స్వాస్థ్య’ పోర్టల్ చాలా బాగా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. పోర్టల్ ప్రారంభించడం మన దేశంలోని గిరిజన జనాభాకు సేవ చేయాలనే పెద్ద లక్ష్యం వైపు మొదటి అడుగు. అన్ని వాటాదారుల మద్దతుతో, మన ప్రధానమంత్రి ‘హెల్తీ ఇండియా’ దార్శనికతను నెరవేర్చే దిశగా మరింత బలంగా ఎదగాలని, మంచిగా పనిచేయాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. 

ఫేస్‌బుక్ భాగస్వామ్యంతో ‘గోయింగ్ ఆన్‌లైన్ లీడర్స్ (గోల్)’ కార్యక్రమం ద్వారా మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయన మరింత సమాచారం ఇచ్చారు. గోల్ ప్రోగ్రాం ద్వారా, భారతదేశం అంతటా 5000 మంది గిరిజన యువతకు మార్గదర్శకత్వం ఇవ్వడం, వారి వర్గాలకు గ్రామ స్థాయి డిజిటల్ యువ నాయకులుగా ఎదగడానికి మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. "ఈ కార్యక్రమాన్ని పెద్ద విజయవంతం చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము, ఈ చొరవ దాని లక్ష్యాలను గ్రహించి, గిరిజన యువతను వారి ప్రభావ ప్రాంతంలో ప్రముఖ వనరులుగా మార్చడానికి, గిరిజన యువతకు సహాయం చేయడానికి, వారిని ,సంసిద్ధులు చెయ్యడానికి తగు మార్గం ఇది. నాయకత్వ నైపుణ్యాలను పొందడం, సమాజంలో సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను కనుగొనడం, సమాజంలోని సామాజిక-ఆర్థిక స్థితి కోసం వారి జ్ఞానాన్ని ఉపయోగించడం ముఖ్యం” అని అన్నారు. గోల్ కార్యక్రమానికి అన్ని వాటాదారుల నుండి భారీ స్పందన లభించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2020 సెప్టెంబర్ 5 న మొబైల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సహా ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్ కూడా ప్రకటించారు.

డిబిటి పోర్టల్ గురించి శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ డిబిటి మిషన్ మార్గదర్శకత్వంలో “ఐటి ఎనేబుల్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ల ద్వారా గిరిజనుల సాధికారత” కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 66 వ స్కోచ్ బంగారు పురస్కారం లభించిందని పేర్కొన్నారు. ఇది జాతీయ మూల్యాంకనం సమాచారంలో సామాజిక చేరికపై కేంద్రీకృత ప్రాయోజిత పథకాలు ఇ-గవర్నెన్స్‌లో ఉత్తమ అభ్యాసంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పోర్టల్‌ను కెపిఎంజి ప్రత్యేకంగా గుర్తించింది. 

డాష్‌బోర్డ్‌ను (http://dashboard.tribal.gov.in) డొమైన్ పేరుతో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) కింద ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ (సిడిఎ) అభివృద్ధి చేసింది. 

*****


(Release ID: 1646542) Visitor Counter : 414