కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2017-18 ఆర్థిక సంవత్సరానికి, 'ఐఎల్&ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్' చట్టబద్ధ మదింపునకు సంబంధించి 'ఆడిట్ క్వాలిటీ రివ్యూ రిపోర్ట్'ను జారీ చేసిన 'ఎన్ఎఫ్ఆర్ఏ'
Posted On:
17 AUG 2020 2:50PM by PIB Hyderabad
నేషనల్ ఫైనాన్సింగ్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ), 2017-18 ఆర్థిక సంవత్సరానికి, 'ఐఎల్&ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్' (ఐఎఫ్‌ఐఎన్) చట్టబద్ధ మదింపునకు సంబంధించి 'ఆడిట్ క్వాలిటీ రివ్యూ రిపోర్ట్' (ఏక్యూఆర్‌ఆర్)ను జారీ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన చట్టబద్ధ మదింపుదారు బీఎస్‌ఆర్&అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీ (బీఎస్‌ఆర్).
కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 132(2)(బి), ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ రూల్స్-2018కి అనుగుణంగా ఏక్యూఆర్ నిర్వహించారు. అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసేలా సంస్థలను పర్యవేక్షించడానికి ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏకు ఇది అవసరం.
ఐఎఫ్‌ఐఎన్ చట్టబద్ధ ఆడిటర్‌గా బీఎస్‌ఆర్ నియామకం చట్టవిరుద్ధమని ఏక్యూఆర్‌ఆర్‌లో ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ వెల్లడించింది. బీఎస్‌ఆర్ చేపట్టిన 'స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్' (ఎస్‌ఏలు) అవసరాలకు అనుగుణంగా ఉన్న 'విఫల సందర్భాలు' ముఖ్యమైనవి. ఎస్‌ఏలకు అనుగుణంగా ఆడిట్ జరిగిందని ఆడిట్ నివేదిక ఇవ్వడానికి బీఎస్‌ఆర్‌కు అర్హత లేదు. తప్పుడు ప్రకటనలు, పాలన సంగతులు చూసేవారితో తగిన సంప్రదింపులు లేకపోవడం, సంబంధంలేని కారకాల ఆధారంగా మెటీరియాలిటీని నిర్ణయించడం వంటివి 'వైఫల్యాలకు' సంబంధించినవి. దీంతోపాటు, బీఎస్ఆర్ ఉపయోగించిన ఐటీ వేదికలో సంస్థాగత, నిర్మాణాత్మక లోపాలున్నాయని ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ నిర్ధరించింది.
ఏక్యూఆర్‌ఆర్‌కు సంబంధించి, కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 132(4) కింద క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందా అని ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ పరిశీలిస్తుంది.
https://nfra.gov.in లో 'ఏక్యూఆర్‌ఆర్'ను చూడవచ్చు
(Release ID: 1646476)
Visitor Counter : 175