రక్షణ మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్ లోని 20 గ్రామాలను అనుసంధానించే 180 అడుగుల బెయిలీ వంతెనను 3 వారాల్లో నిర్మించిన - బి.ఆర్.ఓ.
Posted On:
17 AUG 2020 11:56AM by PIB Hyderabad
ఉత్తరాఖండ్, పిథోరాగఢ్ జిల్లా, జౌల్ జీబీ సెక్టార్ లో, తరచుగా కొండచరియలు విరిగి పడుతూ, భారీ వర్షాలు కురిసినప్పటికీ, సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఓ.), 180 అడుగుల బెయిలీ వంతెనను మూడు వారాలలోపు నిర్మించింది. 2020 జూలై, 27వ తేదీన ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు. 50 మీటర్ల పొడవైన పొడవైన కాంక్రీట్ వంతెన పూర్తిగా కొట్టుకుపోవడంతో, నల్లాలు, నదులు పొంగి పొర్లాయి. ఇది విపరీతమైన వేగంతో బురద ప్రవాహానికి కారణమైంది. కొండచరియలు విరిగిపడటం వల్ల కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బి.ఆర్.ఓ. వెంటనే వంతెన నిర్మాణానికి అవసరమైన వనరులను, వంతెన నిర్మాణ వ్యవస్థను అక్కడికి తరలించింది. తరచుగా కొండచరియలు విరిగి పడటం మరియు భారీ వర్షాల కారణంగా పిథోరాగఢ్ నుండి నిర్మాణ సామాగ్రిని అక్కడికి రవాణా చేయడం అతి పెద్ద సవాలుగా మారింది. ఈ వంతెన 2020 ఆగష్టు 16వ తేదీన విజయవంతంగా పూర్తయింది. ఈ వంతెన ద్వారా జౌల్ జీబీ, మున్సియారీ తో అనుసంధానం కావడంతో, వరద ప్రభావిత గ్రామాలను చేరుకోడానికి అవకాశం కలిగింది.
20 గ్రామాల్లోని 15 వేల మందికి ఈ వంతెన ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో జౌల్ జీబి నుండి మున్సియారీ వరకు 66 కిలోల మీటర్ల రహదారి పై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. జౌల్ జీబీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో గరిష్ట మరణాలు సంభవించిన లుమ్టి మరియు మోరి గ్రామాల గురించి స్థానిక పార్లమెంటు సభ్యుడు శ్రీ అజయ్ తమ్తా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల పునరావాసం కోసం అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
*****
(Release ID: 1646407)
Visitor Counter : 236