ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీ ఎయిమ్స్ లో స్వచ్ఛంద రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ హార్ష వర్ధన్

మానవాళి కి సేవ చేయడానికి అత్యంత గొప్ప మార్గం స్వచ్ఛంద రక్త దానం : డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 14 AUG 2020 1:43PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఈ రోజు స్వచ్ఛంద రక్తదాన ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ నిర్వహించిన ఈ శిబిరం దేశాన్ని, పౌరుల రక్షణగా ప్రాణాలు కోల్పోయిన సైనికులతో పాటు కోవిడ్ యోధులకు కూడా అంకితం చేశారు. గౌరవ అతిథులుగా రెండు కుటుంబాలను ఆహ్వానించారు - ఒకరు, అమరవీరుడు సైనికుడి కుటుంబం, మరొకరు ప్రాణాలు వీడిన ఎయిమ్స్ కి చెందిన కోవిడ్ యోధుడి కుటుంబం.

డాక్టర్ హర్ష్ వర్ధన్ రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కత్తిరించి, దీపం వెలిగించి ప్రారంభించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాతో పాటు ఇతర సీనియర్ వైద్యులు కూడా ఈ సందర్బంగా హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రి రక్తదాతలతో సంభాషించారు, రక్తదాన కార్యక్రమానికి సహకరించినందుకు వారికి ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్తం దానం చేయడానికి, రోగుల ప్రాణాలను కాపాడటానికి వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని ఆయన ప్రోత్సహించారు. ఫేస్ షీల్డ్, మాస్క్‌లు, గ్లోవ్స్ మొదలైన వాటితో సహా అన్ని జాగ్రత్తలు శిబిరంలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో డాక్టర్ హర్ష్ వర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎయిమ్స్ చేపట్టిన చొరవను ప్రశంసించిన డాక్టర్ హర్ష్ వర్ధన్, “ 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ప్రాణాలర్పించిన కోవిడ్ వైట్ కోట్ యోధులకు, కార్గిల్ అమరవీరులకు నివాళి అర్పిస్తున్నాను. మహమ్మారిలో ప్రజల ప్రాణాలను రక్షించేటప్పుడు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో సహా  కోవిడ్ యోధులు చేసిన అంతిమ త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి ” అని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా, ఎయిమ్స్‌లో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్‌గా పనిచేసిన కోవిడ్ యోధుడు  దివంగత  హిరలాల్,  కార్గిల్ అమరవీరుడు లాన్స్ నాయక్ రాజ్‌బీర్ సింగ్ కుటుంబ సభ్యులను వారి త్యాగాన్ని స్మరించి  సత్కరించారు.

స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యతను డాక్టర్ హర్ష్ వర్ధన్  ప్రస్తావిస్తూ, “కోవిడ్-19 మహమ్మారి, లాక్-డౌన్ కారణంగా ఆంక్షలు, స్వచ్ఛంద విరాళాలు, రక్తదాన శిబిరాల సంఖ్య గణనీయంగా క్షీణించింది. అత్యవసర శస్త్రచికిత్సలు, తలసేమియా వంటి రక్త రుగ్మతలు, రక్త క్యాన్సర్లు, రోడ్ ప్రమాదాలు,  గాయం కేసులకు రక్తం అవసరం. అందువల్ల మానవాళికి సేవ చేయడానికి ఉత్తమ మార్గం స్వచ్ఛంద రక్తదానం ”. అని అన్నారు. ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి మన దైనందిన జీవితంలో ఏదో ఒక విధంగా సేవ చేయడం ద్వారా భారతీయులందరూ మన యోధుల త్యాగాలను గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ -19 కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో, పెరుగుతున్న రికవరీ రేటు, క్రమంగా పడిపోతున్న కేసు మరణాల రేటు నియంత్రణ వ్యూహం విజయాన్ని రుజువు చేశాయని అన్నారు.  ఈ వ్యూహాన్ని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 1450 కి పైగా టెస్టింగ్ ల్యాబ్‌లతో ఈ రోజు 8.4 లక్షలకు పైగా మైలురాయిని దాటిన  పరీక్ష సామర్థ్యాన్ని విజయవంతంగా పెంచామని ఆయన చెప్పారు.  కోవిడ్ -19 చికిత్స టీకాల రంగంలో జరుగుతున్న శాస్త్రీయ పరిణామాలపై నాకు నమ్మకం ఉంది త్వరలో కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం మరింత విజయాన్ని సాధిస్తుంది అని కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

****


(Release ID: 1645853) Visitor Counter : 247