యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
షట్లర్ ఎన్.సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్ జార్జ్‌కు కరోనా
Posted On:
13 AUG 2020 9:08PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహిస్తున్న నేషనల్ బ్యాడ్మింటన్ క్యాంప్‌నకు వచ్చి షట్లర్ సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్ జార్జ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. క్యాంప్‌నకు వచ్చి ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది మొత్తానికి సాయ్ నిర్దేశానుసారం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాల్లో సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్ పాజిటివ్‌లుగా తేలారు.
ఆ ఇద్దరిలోనూ లక్షణాలేవీ కనిపించలేదు. ఇద్దరూ హైదరాబాద్ వాసులే. ఇంటి నుంచే క్యాంప్‌నకు వచ్చి వెళ్తున్నారు. పాజిటివ్ వార్త వినగానే అకాడమీని మూసివేసి శానిటైజ్ చేశారు. సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్ ప్రైమరీ కాంట్రాక్టులను గుర్తించారు. ఆ ఇద్దరి నమూనాలను మరోమారు ఆర్‌టీ-పీసీఆర్‌కు పంపారు.
నేషనల్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, "క్యాంప్‌నకు వచ్చి ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది, పాలనాధికారులందిరికీ సాయ్ నిర్దేశానుసారం కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. ఇద్దరికి పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రొటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆటగాళ్ళు సురక్షితంగా, వీలైనంత త్వరగా శిక్షణ కోసం తిరిగి రావచ్చు". అని చెప్పారు.
***
(Release ID: 1645636)
Visitor Counter : 224