రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్' (ఎన్‌ఐఐవో)ను ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌

Posted On: 13 AUG 2020 6:30PM by PIB Hyderabad

రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, 'నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్' (ఎన్‌ఐఐవో)ను వెబినార్‌ ద్వారా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

    'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా, రక్షణ రంగంలో స్వావలంబన కోసం వేగవంతమైన ఆవిష్కరణలు, స్వదేశీకరణను ఎన్‌ఐఐవో ప్రోత్సహిస్తుంది. ఈ దిశగా విద్య, పరిశ్రమల రంగాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

    ఎఐఐవో మూడు అంచెల వ్యవస్థ. నావల్‌ టెక్నాలజీ ఆక్సిలరేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌-టాక్‌).., ఆవిష్కరణ, స్వదేశీకరణను కలిపి, అత్యున్నత స్థాయి సూచనలు అందజేస్తుంది. ఎన్‌-టాక్‌ ఆధ్వర్యంలో పనిచేసే కార్యాచరణ బృందం ప్రాజెక్టులను అమలు చేస్తుంది. మారుతున్న కాలంతోపాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరాయ సాంకేతిక పరిజ్ఞానాల కోసం 'టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఆక్సిలరేషన్‌ సెల్‌' (టీడీఏసీ)ను కూడా ఏర్పాటు చేశారు.

    ఇప్పటికే ఉన్న వనరులతో 'ఇన్నోవేషన్&ఇండిజినైజేషన్' సంస్థను స్థాపించడానికి 'సర్వీస్‌ హెడ్‌క్వార్టర్స్‌'కు 'డ్రాఫ్ట్‌ డిఫెన్స్‌ అక్విజిషన్‌ పాలసీ-2020' (డీఏపీ-20) సూచించింది. నౌకాదళంలో, ఇప్పటికే పనిచేస్తున్న 'డైరెక్టరేట్ ఆఫ్ ఇండిజినైజేషన్' ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న స్వదేశీకరణ కార్యక్రమాలపై కొత్త సంస్థలు ఆధారపడడంతోపాటు, ఆవిష్కరణలపై దృష్టి పెడతాయి.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో, ఈ క్రింది సంస్థలతో నౌకాదళం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది:

ఉత్తరప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (యూపీఈఐడీఏ)
రక్ష శక్తి యూనివర్శిటీ (ఆర్‌ఎస్‌యూ), గుజరాత్‌
మేకర్‌ విలేజ్‌, కోచి
సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ (ఎస్‌ఐడీఎం)

    రక్షణ పరిశ్రమ, విద్యాసంస్థలను ఈ కార్యక్రమంలో నిమగ్నం చేసేలా, ఆర్‌ఎస్‌యూ భాగస్వామ్యంతో ఆన్‌లైన్ చర్చా వేదికను ఈ వెబినార్‌లో సృష్టించి, ప్రారంభించారు.

    నౌకాదళ స్వదేశీకరణ ప్రణాళికలను కలిపి రూపొందించిన 'స్వావలంబన్‌'ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

***
 



(Release ID: 1645614) Visitor Counter : 196