గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

"గిరిజనుల సాధికారత - భారత్ పరివర్తన" ఆన్ లైన్ డాష్ బోర్డ్ ఆవిష్కరించిన గిరిజన మంత్రిత్వశాఖ

Posted On: 13 AUG 2020 1:03PM by PIB Hyderabad

 

గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రూపొందించిన "గిరిజనుల సాధికారత - భారత్ పరివర్తన" అనే ఆన్ లైన్ డాష్ బోర్డ్ ను నీతి ఆయోగ్ సీ ఈ వో శ్రీ అమితాబ్ కాంత్, సభ్యుడు శ్రీ రమేశ్ చంద్ ఈ నెల 10న ఆవిష్కరించారు. జాతీయాభివృద్ధి ఎజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, నవ భారత వ్యూహాలు తదితర విధానాల అమలులో సి ఎస్ ఎస్. సి ఎస్ పథకాల పురోగతిని సమీక్షించేందుకు నీతి ఆయోగ్ జరిపిన సమావేశాల సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. 

 

"మన ప్రపంచంలో పరివర్తన: సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండా" అనే తీర్మానంలో భాగంగా 2015 సెప్టెంబర్ లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్ణయించుకున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావించటం  సమంజసం. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దేశవ్యాప్తంగా  17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలును పర్యవేక్షించే బాధ్యతను నీతి ఆయోగ్ కి అప్పగించారు.  గడిచిన ఏడాదికి కాలంలో చేపట్టిన డిజిటల్ కార్యకలాపాలను ఈ సందర్భంగా శ్రీ దీపక్ ఖండేకర్ సారథ్యంలోని అధికారుల బృందం వివరించింది.

వివిధ పథకాలను డిజిటైజ్ చేసినందుకు, వాటిని "గిరిజనుల సాధికారత - భారత్ పరివర్తన" పెర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్ తో అనుసంధానం చేసినందుకు శ్రీ అమితాబ్ కాంత్ మంత్రిత్వశాఖ అధికారులను అభినందించారు. నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేశ్ చంద్ కూడా నీతి ఆయోగ్ రూపొందించిన లక్ష్యాలను సాధించి ఫలితాలు చూపించినందుకు మంత్రిత్వశాఖను ప్రశంసించారు.

ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించటంలో మంత్రిత్వశాఖ వారి 11 పథకాల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్ లో ఎక్కించటానికి వీలుగా ఈ ఆన్ లైన్ వేదిక ఉపయోగపడుతోంది. ఇది ఐదు రకాల మంత్రిత్వశాఖ ఉపకార వేతనాల వివరాలను కూడా చూపిస్తుంది. దాదాపు 30 లక్షలమంది షెడ్యూల్డ్ తెగల లబ్ధి దారులు ఈ ఉపకారవేతనాల పథకం కింద రూ.2500 కోట్ల మేరకు లబ్ధిపొందుతున్నారు. 
డిబిటి మిషన్ కింద ఐటి ఆధారిత ఉపకార వేతనాల పథకం ద్వారా గిరిజనుల సాధికారత పెంపొందించినందుకు మంత్రిత్వశాఖకు 66వ స్కోచ్ స్వర్ణ పురస్కారం లభించినట్టు కూడా ఈ సందర్భంగా నీతి అయోగ్ కు మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేశారు.   నీతి ఆయోగ్ నిబంధనల మేరకు కేంద్ర ప్రాయోజిత పథకాల మందింపు చేపడుతూ, గిరిజన వ్యవహారాల శాఖ వారి ప్రత్యక్ష లబ్ధి బదలాయింపు ( డిబిటి) పోర్టల్ ను ఉత్తమ ఈ-గవర్నెన్స్ ఆచరణగా కెపిఎంజి సంస్థ గుర్తించింది. దీనివలన పారదర్శకత,  జవాబుదారీతనం, షెడ్యూల్డ్ తరగతుల విద్యార్థులకు సేవలందించటంలో విప్లవాత్మమైన మార్పు సాధించగలిగినట్టు కెపిఎంజి పేర్కొంది. 
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( ఇ ఎం ఆర్ ఎస్) పథకం కింద పనిచేస్తున్న పాఠశాలల వివరాలను కూడా డాష్ బోర్డ్ ప్రతిబింబించింది. నిర్మాణంలో ఉన్న పాఠశాలలు, వివిధ ఇ ఎం ఆర్ ఎస్  పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల  వివరాలు ఇందులో పొందుపరచారు. విద్య, వైద్య రంగాలలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలకు మంత్రిత్వశాఖ అందజేస్తున్న నిధుల  వివరాలను, వాటి లబ్ధిదారులను కూడా ఇందులో చేర్చారు. అన్ని పథకాలకూ సంబంధించిన సమాచారాన్ని జిల్లా స్థాయి వరకూ ఇందులో అందుబాటులో ఉంచుతున్నారు. 


మెట్రిక్ ముందు, మెట్రిక్ అనంతర ఉపకార వేతనాల లాంటి కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రాల కూడా గిరిజన వ్యవహారాలమంత్రిత్వశాఖకు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందిస్తున్నాయి. దీనివలన షెడ్యూల్డ్ తెగల వాటా వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. మొత్తం 41 మంత్రిత్వశాఖలు నిర్దిష్టంగా షెడ్యూల్డ్ తెగలకు ఖర్చు చేస్తున్న  తమ వాటా వ్యయాన్ని వెల్లడించే వీలుంటుంది. 2019-20లో 275 పథకాలలో 41 మంత్రిత్వశాఖలు షెడ్యూల్డ్ తెగలకోసం రూ. 51,000 కోట్ల బడ్జెట్ కేటాయించాయి.

ఈ మంత్రిత్వశాఖలన్నిటి పనితీరును వివిధ అంశాల కింద ఈ డాష్ బోర్డ్ లో చూడవచ్చు. మంత్రిత్వశాఖ చేపట్టిన అనేల డిజిటల్ కార్యకలాపాలకు సంబంధించిన ఈ-లింక్స్ కూడా డాష్ బోర్డ్ లో ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగల సాధికారత దిశలో భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియాలో ఒదొక భాగం. దీనివలన ఈ వ్యవస్థలో సమర్థత, పారదర్శకత బాగా పెరుగుతాయి. ఈ డాష్ బోర్డ్ ను  నేషనల్  ఇన్ఫర్మేటక్స్ సెంటర్ ఆద్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్  (సీడా) రూపొందించింది. దీన్ని  http://dashboard.tribal.gov.in లో చూడవచ్చు. 

*****

 



(Release ID: 1645521) Visitor Counter : 196