భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

సానుకూల మానసిక ఆరోగ్యం పెంచుకోవడానికి, 'ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌' భాగస్వామ్యంతో మార్గదర్శక వీడియో విడుదల చేసిన 'ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కార్యాలయం',

"తొమ్మిది సులభ పద్ధతులతో సానుకూల ఆరోగ్య వృద్ధి: ఆరోగ్యకర జీవనానికి ప్రభావవంత అలవాట్లు" పేరిట విడుదల

Posted On: 11 AUG 2020 7:49PM by PIB Hyderabad

సానుకూల ఆరోగ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో సూచిస్తూ, భారత ప్రభుత్వ 'ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కార్యాలయం' మార్గదర్శక వీడియో విడుదల చేసింది. "తొమ్మిది సులభ పద్ధతులతో సానుకూల ఆరోగ్య వృద్ధి: ఆరోగ్యకర జీవనానికి ప్రభావవంత అలవాట్లు" పేరిట 'ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌' భాగస్వామ్యంతో వీడియోను విడుదల చేసింది. జీవనశైలి విధానాలు, సానుకూల మానసిక ఆరోగ్యం మధ్య సంబంధాన్ని ప్రజలు సులభంగా అర్ధం చేసుకునేలా దీనిని రూపొందించారు. నగర ప్రజలను ప్రాథమిక లక్ష్యంగా చేసుకుని హిందీ, ఇంగ్లిష్‌, ప్రాంతీయ భాషల్లో వీడియోను విడుదల చేశారు.

    అంతర్గత, భావోద్వేగ, సామాజిక, శారీరక పనితీరుపై మానసిక ఆరోగ్యం ప్రభావం ఉంటుంది. మానసికంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలే సొంతంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మానసిక అనారోగ్య సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, సమస్యలు గుర్తించినప్పుడు తగిన సాయం పొందడానికి ప్రజలను ఈ వీడియో ప్రోత్సహిస్తుంది.  

    తమకు తెలియకుండానే మానసిక అనారోగ్యంతో ప్రజలు బాధపడడానికి, అవసమైన సమయంలో సాయం కోరకపోవడానికి సామాజిక-సాంస్కృతిక భావాలు ఒక కీలకాంశం. ప్రజల్లో మానసిక అనారోగ్య సమస్యలు సర్వసాధారణమని ఈ మార్గద్శక వీడియో స్పష్టం చేస్తోంది. మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి, శాస్త్రీయంగా రూపొందించిన సులభ పద్ధతులను పాటించేలా ఈ వీడియో గైడ్‌ ప్రజలకు సమాచారమివ్వడంతోపాటు, ప్రోత్సహిస్తుంది.

(Pl see attachments AFMC_MentalHealthGuide-English)

(Pl see attachmentsऐ ऍफ़ एम् सी_मानसिक स्वास्थ्य मार्गदर्शिका_Hindi)


(Release ID: 1645204) Visitor Counter : 220