ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 11 AUG 2020 5:40PM by PIB Hyderabad

ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు తన సందేశంలో ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపారు.
 
    "పవిత్రమైన ఈ రోజున దేశ ప్రజలకు నా హార్థిక శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడిని పూజిస్తూ జన్మాష్టమి జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు వెన్న దొంగిలించడం, స్నేహితులతో ఆడుకోవడం, గోకుల ప్రజలను ఆటపట్టించడం, ధీరోదాత్తంగా జడివాన నుంచి గోకులాన్ని కాపాడటం, కాళీయమర్ధనం వంటివి ప్రాచీన కాలం నుంచి మన మనస్సులను కట్టిపడేశాయి. ఫలితాన్ని ఆశించకుండా కష్టపడి పని చేయాలంటూ శ్రీకృష్టుడు చెప్పిన 'భగవద్గీత' సమస్త మానవాళికి స్ఫూర్తి మంత్రం."

    "కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది పండుగలన్నీ ఇళ్లలోనే జరుపుకోవాల్సి వచ్చింది. ఏటా ఎల్లలు లేని ఉత్సాహంతో దేశవ్యాప్తంగా జరిగే ఈ వేడుకను ఈసారి నిరాడంబరంగా, మాస్కులు ధరించి, సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ జరుపుకోవాలి."

    "మన విధులను సక్రమంగా నిర్వర్తిద్దామని, ధర్మమార్గాన్ని పాటిద్దామని ఈ పండుగ సందర్భంగా అంతా సంకల్పిద్దాం. ఈ పండుగ మన దేశానికి శాంతి, స్నేహం, సామరస్యం, శ్రేయస్సును తేవాలని ఆకాంక్షిస్తున్నా."


(रिलीज़ आईडी: 1645193) आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Manipuri , Punjabi , Tamil