శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 ఇబ్బందుల నుంచి పుట్టుకొచ్చిన డిజిటల్‌ సాంకేతికత అవకాశాల గురించి వివరించిన డీఎస్‌టీ కార్యదర్శి

Posted On: 11 AUG 2020 2:30PM by PIB Hyderabad

భవిష్యత్‌ మొత్తం సరికొత్త డిజిటల్ సాంకేతికతలమయంగా ఉంటుందని, కొత్తదనాన్ని చూసి భయపడటం కన్నా మార్పులో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని కొవిడ్‌-19 మన దేశానికి ఇచ్చిందని 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ' (డీఎస్‌టీ) కార్యదర్శి ప్రొ.అశుతోష్‌ శర్మ చెప్పారు. 'డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఇన్‌ కొవిడ్‌-19' అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. 'స్టాండింగ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌' (స్కోప్‌) ఈ వెబినార్‌ నిర్వహించింది.

    "డిజిటల్‌ సాంకేతికతలు, యంత్రాలు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళతాయి. ప్రధాని మోదీ కల అయిన 'ఆత్మనిర్భర్‌ భారత్‌'ను సాకారం చేస్తాయి. సమాచారమే సరికొత్త మంత్రం. మన ప్రగతిలో ఉపయోగించుకోవడానికి సమాచారానికి విలువనివ్వాలి. కొవిడ్‌-19 కంటే ముందే భవిష్యత్‌ వేగంగా మనకు చేరువైంది. అయితే వైరస్‌ దానిని పూర్తిగా మార్చేసింది. ఊహకందని విధంగా ప్రతి రంగాన్నీ, ప్రతి జీవితాన్ని అది చిదిమేసింది. మనం ఎక్కడున్నాం, మనం ఏం కావాలనుకుంటున్నామో తేల్చుకోవడానికి ఇదే మంచి తరుణం."

    "డిజిటల్‌, సైబర్‌ డిజిటల్‌ రంగాల్లో చాలా అవకాశాలు మన ముందున్నాయి. మనకున్న యువశక్తితో వ్యాపార అవకాశాలను విస్తృతం చేయడానికి, మరింతమందికి చేరువకావడానికి ఇది గొప్ప అవకాశం. కొవిడ్ మహమ్మారి వ్యాపార రంగంపై ఒత్తిడి పెంచింది. సాంకేతికత, డిజిటలీకరణకు మారడాన్ని తప్పనిసరి చేసింది. వ్యాపార అవసరాలకు తగినట్లు సంస్థలన్నీ డిజిటల్‌ సాంకేతికతల్లో పెట్టుబడులు పెంచుతున్నాయి" అని ప్రొ.అశుతోష్‌ శర్మ వివరించారు. 

    "కొవిడ్‌ సమయంలో డిజిటల్‌ ఆర్థిక రంగం", "కీలక రంగాల్లో డిజిటల్‌ ఇబ్బందులు&ప్రభావం", "కొవిడ్‌-19 నేపథ్యంలో పుట్టుకొచ్చిన డిజిటల్‌ అంశాలు"పైనా ఈ వెబినార్‌లో చర్చ జరిగింది. 

    ఐవోసీ ఛైర్మన్‌ ఎస్‌ఎం వైద్య, స్కోప్‌ సీఎండీ రాకేష్‌ కుమార్‌ సహా వివిధ వర్గాల ప్రముఖులు వెబినార్‌లో పాల్గొని మాట్లాడారు.

 

 

*****

 



(Release ID: 1645057) Visitor Counter : 242