సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్‌ఎంఈ కోసం కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉపశమన చర్యలు ఆర్థిక చక్రాన్ని పరుగులు తీయిస్తాయి: శ్రీ నితిన్ గడ్కరీ
ఎంఎస్‌ఎంఈల బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యమిచ్చేలా సంబంధిత శాఖలు, విభాగాలను నిర్దేశించాలని ముఖ్యమంత్రులకు గడ్కరీ విజ్ఞప్తి
Posted On:
10 AUG 2020 3:24PM by PIB Hyderabad
ఎంఎస్‌ఎంఈల అర్ధాన్ని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు (నిధుల సృష్టి కోసం నిధుల వెచ్చింపు పథకం, విజేతల పోర్టల్, ఎంఎస్‌ఎంఈలకు రుణాలు పెంపు వంటివి), లాక్‌డౌన్ కారణంగా మందగించిన ఆర్థిక చక్రాన్ని పరుగులు పెట్టిస్తాయని 'కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ' మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. ఫిక్కి కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన వర్చువల్ ఎంఎస్‌ఎంఈ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామిక వర్గాలు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, భారత్‌ను తిరుగులేని ఆర్థిక శక్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని అభయం ఇచ్చారు.
కేంద్రం ప్రకటించిన మూడు లక్షల కోట్ల రూపాయల ఎంఎస్‌ఎంఈ ఉపశమన ప్యాకేజీలో, ఇప్పటివరకు 1.20 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు.
ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపుల్లో జాప్యంపై మాట్లాడుతూ, 45 రోజుల్లోగా పెండింగ్ బిల్లులన్నీ పరిష్కరించాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలకు సూచనలిచ్చామన్నారు. ఎంఎస్‌ఎంఈల బకాయిల చెల్లింపులకు
ప్రాధాన్యమిచ్చి పనిచేసేలా సంబంధిత శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలను నిర్దేశించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గడ్కరీ విజ్ఞప్తి చేశారు. 'సమాధాన్' పోర్టల్‌కు అందుతున్న ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
చిన్న దుకాణాలు, వ్యాపారాలు నడుపుకునేవారి కోసం 'భూమి బ్యాంక్', 'సామాజిక సూక్ష్మ రుణాలు' ఆలోచన చేస్తున్నట్లు వెబినార్‌లో పాల్గొన్నవారికి గడ్కరీ వివరించారు. ఆత్మనిర్భర్ భారత్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.., 115 జిల్లాల్లో చేనేత, హస్తకళలు, ఖాదీ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు. భారీ స్థాయిలో ఉద్యోగితను సృష్టించగల వ్యవసాయ, గ్రామీణ, గిరిజన రంగాల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
కర్ణాటక మంత్రి శ్రీ జగదీష్ షెట్టర్, ఎస్‌బీఐ ఛైర్మన్, ఫిక్కి ప్రతినిధులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.
***
(Release ID: 1644853)
Visitor Counter : 252