ఆర్థిక మంత్రిత్వ శాఖ

భారతదేశంలో వ్యాపార స్నేహపూర్వక వాతావరణం కోసం "ఇన్ బాండ్ తయారీ మరియు ఇతర కార్యకలాపాలు" అనే అంశంపై సి.బి.ఐ.సి. నిర్వహించిన వెబ్ చర్చలో పాల్గొన్న - ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్.

Posted On: 07 AUG 2020 6:45PM by PIB Hyderabad

“ఇన్ బాండ్ తయారీ మరియు ఇతర కార్యకలాపాలు” అనే అంశంపై సి.బి.ఐ.సి. ఈ రోజు ఇక్కడ నిర్వహించిన వెబ్ ఎక్స్ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహించారు.  అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యు.ఎస్.‌ఐ.ఎస్.‌పి.ఎఫ్) మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం కోసం తయారీదారుల సంఘం (ఎం.ఐ.ఐ.టి) సహకారంతో పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ కేంద్ర మండలి (సి.బి.ఐ.సి) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

శ్రీ ఠాకూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” మరియు “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యత గురించి ఈ చర్చలో పాల్గొన్న వారికి వివరించారు.   కస్టమ్స్ యొక్క సెక్షన్ 65 స్కీమ్ (బాండ్ తయారీ మరియు ఇతర కార్యకలాపాలలో) స్థితిస్థాపక సరఫరా వ్యవస్థను నిర్మించి, నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వ్యాపారులకు ఇది చాలా మంచి ఎంపిక అని ఆయన తెలియజేశారు. 

సవరించిన ఈ కొత్త పథకం గత సంవత్సరం మొదలైందనీ, ప్రారంభంలో వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు చూపించిన ఆసక్తి ప్రోత్సాహకరంగా ఉందనీ మంత్రి పేర్కొన్నారు.  భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించే వివిధ పథకాలకు, సులభతరం వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికీ, ఇది ప్రారంభ సూచిక వంటిదని ఆయన అభివర్ణించారు.  ఎలక్ట్రానిక్సు, రసాయనాలు, ఔషధాలు, మరమ్మత్తులు, పునరుద్ధరణ వంటి సహాయక చర్యలతో సహా, అనేక రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చడానికి ఇది సమర్థవంతంగా సహాయపడుతుంది.  ఇది భారతదేశాన్ని అంతర్జాతీయ ఈ-కామర్సు హబ్ ‌గా కూడా మార్చగలదు.

అర్హత ఉన్న అన్ని యూనిట్లు ఈ పధకాన్ని వినియోగించుకోవాలనీ, దీనిని మరింత మెరుగుపరచడానికి తగిన సూచనలు అందజేయాలనీ, శ్రీ ఠాకూర్ ఆహ్వానం పలికారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ "ఆత్మ నిర్భర్ భారత్" యొక్క కళను సాకారం చేయడానికి సమిష్టిగా మరియు నిశ్చయంగా కృషి చేస్తామని ప్రభుత్వ పరంగా  శ్రీ ఠాకూర్  హామీ ఇస్తూ,  ఇది భిన్న దేశాల మధ్య సమరస్యాన్నీ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఆక్రమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు పరీక్షా సమయాలుగా నిలిచి, ఆర్థిక వ్యవస్థను చాలావరకు ప్రభావితం చేశాయని మంత్రి పేర్కొన్నారు.  భారతీయ వ్యాపారాలు అన్ని అంచనాలను అధిగమించి, బ్రహ్మాడమైన స్థితిస్థాపకతను ప్రదర్శించాయి.  దేశీయ ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి, "మేక్ ఇన్ ఇండియా చొరవ" ద్వారా భారతదేశాన్ని ప్రపంచం ఇష్టపడే ఉత్పాదక గమ్యస్థానంగా మార్చడానికి గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఇది నిదర్శనం.  బల్క్ డ్రగ్సు, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు, వైద్య పరికరాలకు ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు ప్రకటించడం అటువంటి ఒక లక్ష్య పథకం, ఇక్కడ మనం స్వయం సమృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నించాము. 

కస్టమ్స్ తరఫున ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మార్పుల గురించి సి.బి.ఐ.సి. చైర్మన్ శ్రీ ఎం.అజిత్ కుమార్, వివరించారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను ప్రధానంగా పరిష్కరించడానికి సి.బి.ఐ.సి. యొక్క సంసిద్ధమైన సంకల్పం మరియు నిబద్ధతను ఆయన వివరించారు.  సి.బి.ఐ.సి.  స్వయం చాలక యంత్రాలు,  కాగితం లేకుండా పని, మనిషి ప్రమేయం లేకుండా క్లియరెన్స్ ఎకోసిస్టమ్ వంటి వాటి వైపు పయనిస్తున్నామని శ్రీ కుమార్ చెప్పారు.  ఫలితాలు స్పష్టంగా ఇక్కడే కనిపిస్తున్నాయి. మన ఎగ్జిమ్ క్లియరెన్సు యొక్క సామర్థ్యం మెరుగుపడింది  మరియు ప్రపంచ సూచికలలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది.  "ఆత్మ నిర్భర్ భారత్" మరియు "మేక్ ఇన్ ఇండియా" లకు ప్రోత్సాహాన్నిచ్చే విధంగా సులభతర వ్యాపారం పట్ల సి.బి.ఐ.సి. యొక్క నిబద్ధతను శ్రీ కుమార్ నొక్కిచెప్పారు.

“ఇన్ బాండ్ మాన్యుఫ్యాక్చరింగ్” క్రింద ఉన్న పథకం కాపిటల్ వస్తువులు, ముడి పదార్థాలు లేదా బాండెడ్ తయారీలో ఉపయోగించే ఇన్‌పుట్‌లపై దిగుమతి సుంకాన్ని వాయిదా వేస్తుంది.  తయారైన వస్తువులను ఎగుమతి చేస్తే దిగుమతి సుంకం తిరిగి చెల్లించబడుతుంది.  ఒకవేళ, తయారైన వస్తువులను  దేశీయ మార్కెట్లో విక్రయిస్తే, ఆ వస్తువుల తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాలపై దిగుమతి సుంకం చెల్లించవలసివస్తుంది. అయితే, వడ్డీ భారం ఉండదు.  ఎక్కువగా ఎగుమతి కేంద్రీకృతమై ఉన్న ఎస్.ఈ.జెడ్ మరియు ఈ.ఓ.యూ. వంటి ఇతర పథకాల మాదిరిగా కాకుండా, ప్రస్తుత పథకం సమర్థవంతమైన సామర్థ్య వినియోగాన్ని అందించమే లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ పథకం అధికారులతో కనీస భౌతిక లావాదేవీలు కలిగి ఉంటుంది. ఈ పథకం కింద యూనిట్ల పర్యవేక్షణ పూర్తిగా రికార్డుల ఆధారంగా, కొన్ని ఇబ్బందుల ఆధారంగా ఉంటుంది. అందువల్ల చొరబడనిదిగా ఉంటుంది. 

సి.బి.ఐ.సి. సభ్యుడు శ్రీ వివేక్ జోహ్రీ;  ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, బెంగళూరు, శ్రీ డి.పి. నాగేంద్ర కుమార్;  సి.బి.ఐ.సి. కస్టమ్స్ కమీషనర్,  శ్రీ విమల్ శ్రీవాస్తవ; డి.జి.టి.ఎస్. సి.బి.ఐ.సి. అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ అమితేష్ భరత్ సింగ్ ప్యానెల్ చర్చల్లో ప్రభుత్వ పక్షాన ప్రాతినిధ్యం వహించారు.  పరిశ్రమ తరఫున ప్రాతినిధ్యం వహించిన  ప్యానెల్ సభ్యుల్లో,  ఆపిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విరాట్ భాటియా;  హ్యూలెట్ ప్యాకర్డ్ సంస్థ, కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ శ్రీ అంబరీష్ బకాయ;  ఎమ్.ఎ.ఐ.టి, అధ్యక్షుడు శ్రీ నితిన్ కుంకోలియెంకర్; జి.ఎస్.కె. ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. సి.ఎఫ్.ఓ. మరియు  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీమతి పూజా ఠాకూర్. ఉన్నారు. 

విశ్వవ్యాప్తంగా అన్ని రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సాగిన ఈ పరస్పర చర్చా కార్యక్రమానికి వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన 850 మంది సీనియర్ సభ్యులు హాజరయ్యారు.

*****


(Release ID: 1644312) Visitor Counter : 171