రక్షణ మంత్రిత్వ శాఖ
లద్దాఖ్‌లోని ఫార్వర్డ్ బేస్‌క్యాంపుల్లో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ పర్యటన
प्रविष्टि तिथि:
07 AUG 2020 9:28PM by PIB Hyderabad
వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ మార్షల్ హర్జీత్ సింగ్ అరోరా, లద్దాఖ్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ఎయిర్ బేస్‌క్యాంపుల్లో పర్యటించారు.
ఈ బేస్‌క్యాంపుల్లో కార్యాచరణ సంసిద్ధతపై అరోరా సమీక్షించారు. ఆ ప్రాంతాల్లో మోహరించిన కంబాట్ యూనిట్ల వైమానిక దళ యోధులతో మాట్లాడారు. వైమానిక దళ కార్యాచరణ సంసిద్ధతపై ఆయనకు అధికారులు వివరించారు. అత్యంత చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, సదా పోరాట సన్నద్ధంగా ఉండాలని వైమానిక దళ సభ్యులకు ఎయిర్ మార్షల్ సూచించారు. పర్యటనలో భాగంగా.., చినూక్, తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌లో ఆయన ప్రయాణించారు.
RCW0.jpeg)
***
(रिलीज़ आईडी: 1644265)
आगंतुक पटल : 134