కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
'ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా' (లిక్విడేషన్ ప్రక్రియ) నిబంధనలు-2016 కు ఐబీబీఐ సవరణ
प्रविष्टि तिथि:
06 AUG 2020 6:59PM by PIB Hyderabad
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిక్విడేషన్ ప్రక్రియ) (మూడో సవరణ) నిబంధనలు-2020ను "ది ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రుప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా" (ఐబీబీఐ) నోటిఫై చేసింది.
లిక్విడేటర్‌కు చెల్లించాల్సిన ఫీజును రుణదాతల కమిటీ నిర్ణయించాలని నిబంధనల్లో ఉంది. రుణదాతల కమిటీ ఆ ఫీజును నిర్ణయించని పక్షంలో.., గుర్తించిన మొత్తం, లిక్విడేటర్ పంపిణీ చేసిన మొత్తంలో కొంత శాతాన్ని ఫీజుగా నిబంధనలు అందిస్తాయి. ఒక లిక్విడేటర్ కొంత మొత్తాన్ని గుర్తిస్తే, అదే మొత్తాన్ని మరొక లిక్విడేటర్ పంపిణీ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఒక లిక్విడేటర్ కొంత మొత్తాన్ని గుర్తించి పంపిణీ చేయకపోయినా, ఆ మొత్తానికి సంబంధించి అతను ఫీజు పొందగలడని నిబంధనలకు చేసిన కొత్త సవరణ స్పష్టం చేస్తోంది. అదే విధంగా, ఒక లిక్విడేటర్ తాను గుర్తించని మొత్తాన్ని పంపిణీ చేసివుంటే, ఆ మొత్తానికి అతను కూడా ఫీజు పొందగలడు.
సవరించిన నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. వాటిని, www.mca.gov.in, www.ibbi.gov.in లో అందుబాటులో చూడవచ్చు.
***
(रिलीज़ आईडी: 1643960)
आगंतुक पटल : 205