ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరక్టర్, ఆగ్నేయాసియా ప్రాంత ఆరోగ్య మంత్రులతో సమావేశమైన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
“ కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని నియంత్రిస్తూనే, ముఖ్యమైన ఆరోగ్య సేవల అందుబాటుకు ఇండియా ప్రాధాన్యత నిస్తోంది”
Posted On:
06 AUG 2020 3:37PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరక్టర్ , డాక్టర్ పూనమ్ క్షేత్రపాల్ సింగ్, ఈ ప్రాంత సభ్యదేశాల ఆరోగ్య మంత్రులతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్య కార్యక్రమాలు , అత్యావశ్యక ఆరోగ్య సేవల నిర్వహణపై ఈ సమావేశంలో దృష్టిపెట్టారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన రొడెరికో ఆఫ్రిన్ , కోవిడ్ -19 సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన లాజిస్టిక్ మద్దతును మంత్రులకు వివరించారు. వాక్సిన్ అభివృద్ధి గురించి పాలసీ కేటాయింపుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శ్రీ సునీల్ బహల్ వివరించారు.
కోవిడ్ -19ను ఇండియా ఎలా ఎదుర్కొంటున్నదీ డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. చైనా , జనవరి 7న ప్రపంచ ఆరోగ్య సంస్థకు కోవిడ్ మహమ్మారి గురించి తెలిపిన వెంటనే ఇండియా దానిని ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యల గురించి ఆయన వివరించారు. గతంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా, హెచ్1 ఎన్ 1 పిడిఎం 09 ఇన్‌ఫ్లూయంజా, జికా, నిఫాల అనుభవాలు, మొత్తంగా ప్రభుత్వ విధానాన్ని ఉపయోగించి వైరస్ నియంత్రణ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని రూపొందించేందుకు ఉపయోగపడ్డాయన్నారు. ఇండియా సానుకూల దృష్టితో కోవిడ్ మహమ్మారిపై బహుళ స్థాయి సంస్థాగత స్పందన చేపట్టడంవల్ల ప్రతి మిలియన్ కు అతి తక్కువ కేసులు, ప్రతి మిలియన్ జనాభాకు తక్కువ మరణాలు నమోదు కావడానికి సాధ్యపడిందని చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, జిడిపి లో తక్కువ ఖర్చు, ,తలసరి వైద్యులు, ఆస్పత్రి బెడ్ల అందుబాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ కొవిడ్ కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు ఆయన చెప్పారు.
లాక్‌డౌన్ వల్ల ఉపయోగం గురించి ప్రస్తావిస్తూ, డాక్టర్ హర్షవర్ధన్, లాక్‌డౌన్ వల్ల కేసుల పెరుగుదల రేటు తగ్గడానికి అది ఎలా ఉపయోగపడిందీ తెలిపారు .లాక్‌డౌన్‌లొ ఆరోగ్య , మౌలిక సదుపాయాలను , పరీక్షా సదుపాయాలను పెంచుకోవడానికి దోహదపడిందని వివరించారు. జనవరిలో దేశంలో ఒకే ఒక పరీక్షా కేంద్రం ఉండగా ,ఇవాళ దేశవ్యాప్తంగా 1370 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పట్టుమని 3 గంటల వ్యవధిలో ఎక్కడ ఉన్న భారతీయుడైనా సరే లేబరెటరీ సదుపాయాన్ని పొందగలరని ఆయన చెప్పారు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 33 ప్రపంచ ఆరోగ్య సంస్థ పరీక్షా ప్రమాణాలను మించి ఉన్నాయని, ఇవి రోజుకు ఒక మిలియన్‌కు 140 పరీక్షలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. వైరస్‌ను నియంత్రించే వ్యూహం విజయవంతమైందని, 50 శాతం కేసులు మూడు రాష్ట్రాల నుంచే ఉన్నాయని, మిగిలిన దానిలో 32 శాతం కేసులు ఏడు రాష్ట్రాలనుంచి ఉన్నాయని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్టు డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
డి.ఆర్.డి.ఒ తాత్కాలిక ఆస్పత్రిసదుపాయాన్ని నిర్మించిందని, ఇది వెయ్యి మంది పేషెంట్లకు సదుపాయం కల్పిస్తున్నదని, అదనంగా 100 ఐసియు బెడ్లను రికార్డు స్థాయిలో పది రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసిందని తెలిపారు. దీనికితోడు జాతీయ స్థాయిలో శిక్షకులకు శిక్షణ ఇవ్వడం, రాష్ట్రాలు, జిల్లా, ఫెసిలిటీ స్థాయి శిక్షణ, వెంటిలేటర్ల నిర్వహణపై న్యూఢిల్లీ ఎఐఐఎం ఎస్ వెబ్ ఆధారిత శిక్షణ నివ్వడం, దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో కరోనా సన్నద్ధపై మాక్ డ్రిల్ నిర్వహించడం, ఢిల్లీ ఎయిమ్సులో టెలిమెడిసిన్ సదుపాయాలు వంటివి మరణాలకు మూల కారణాన్ని గుర్తించి పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకు దోహదపడడంతో కోవిడ్ మరణాల రేటు 18జూన్ న 3.33 శాతం ఉండగా ఆగస్టు 3 నాటికి 2.11 శాతానికి పడిపోయినట్టు తెలిపారు.
2020 మార్చి 25న ప్రచురించిన టెలిమెడిసిన్ మార్గదర్శకాల గురించి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడారు. కోవిడ్ -19 సందర్భంగా అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఇండియా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలావాడుకున్నదో ఆయన ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచంలోనే తొలి వెబ్ ఆధారిత జాతీయ టెలి కన్సల్టేషన్ సర్వీస్ ఆన్‌లైన్ ఒపిడి సర్వీసు ( పేషెంట్ టు డాక్టర్) ఇప్పటి వరకు 71 వేలా 865 కన్సల్టేషన్లను పూర్తి చేసిందన్నారు. టెలి మెడిసిన్ సర్వీసు ( ప్రాక్టీషనర్ టు ప్రాక్టీషనర్ కన్సల్టేషన్) ,1,50,000 హెల్త్, వెల్‌నెస్ సెంటర్లు , మెడికల్ ప్రాక్టీషనర్లకు ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్‌ఫాం ఐజిఒటి, అన్ని స్థాయిలలోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆరొగ్య సేతు, ఇతిహాస్ వంటి మొబైల్ యాప్‌లు, వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఉపకరించాయని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
ఇండియా తన సదుపాయాలను కోవిడ్, నాన్ కోవిడ్ సదుపాయాలుగా విభజించినట్టు డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. దీనివల్ల తీవ్ర, ఒక మాదిరి, స్వల్ప స్థాయి కేసులను గుర్తించి వైరస్ ను మరింత మెరుగుగా ఎదుర్కోవడానికి వీలు కలిగిందన్నారు. ఆ రకంగా ఆస్పత్రి సదుపాయాలపై భారం పడకుండా చూడగలిగామన్నారు. ఇది ఆస్పత్రిలో చేరినవారికి మెరుగైన సేవలు అందుబాటులోకి రావడానికి ఉపకరించిందన్నారు. ఈ చర్యలన్నీ అంతర్జాతీయ సగటుకన్న భారతదేశంలో మరణాల రేటు తక్కువగా ఉండడానికి దోహదపడ్డాయన్నారు.ఇవాళ మరణాల రేటు 2.07 గా ఉందని ఆయన తెలిపారు.
ఇండియా తీసుకున్న ఇతర చర్యలను కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను నేషనల్ ఇన్నొవేషన్ పోర్టల్ లో అప్ లోడ్ చేయడం వల్ల పరస్పరం నేర్చుకోవడానికి వీలు కలిగిందన్నారు. ఛత్తీస్‌ఘడ్ కంటైన్‌మెంట్, బఫర్ జోన్లలో కూడా ఇమ్యునైజేషన్ సేవలు అందించిందని, హైపర్‌టెన్సివ్, డయాబిటిస్ పేషెంట్లకు ఇళ్ల వద్దకే అత్యావశ్యక మందులు సరఫరా చేసిందన్నారు. తెలంగాణా ప్రతి గర్భిణిని ఒక అంబులెన్సు సదుపాయంతో అనుసంధానం చేసి సురక్షిత డెలివరీకి సంస్థాగతంగా చర్యలు తీసుకుందని తెలిపారు. తలసేమియా, డయాలసిస్ పేషెంట్లను కూడా అంబులెన్సు ద్వారా ఆస్పత్రులకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నారని, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కోవిడ్, నాన్ కొవిడ్ ఆరోగ్య సేవలకు మౌలికసదుపాయాలు , మానవ వనరులను వేరు వేరు చేసిందని చెప్పారు. దీనివల్ల మెరుగైన సేవలు అందించడానికి వీలు కలిగిందన్నారు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రజారోగ్య సేవల రంగంలో కీలక మానవ వనరుల ఖాళీలన్నింటినీ కోవిడ్ మహమ్మారి సమయంలో భర్తీ చేశాయని. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు అత్యావశ్యకం కాని ఆరోగ్య సేవలను ఈ సంజీవని ఒపిడి సదుపాయాన్ని ఉపయోగించుకుని టెలి కన్సల్టేషన్ ను అందించాయని చెప్పారు..
****
(Release ID: 1643901)
Visitor Counter : 243