రక్షణ మంత్రిత్వ శాఖ
అత్యవసర ఆకాశమార్గ వైద్య సాయం అందించిన దక్షిణ నావికాదళం
Posted On:
06 AUG 2020 11:57AM by PIB Hyderabad
కోచిలో ఓ వాణిజ్య నౌకలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిపై దక్షిణ నావికాదళం (ఎస్‌ఎన్‌సీ) తక్షణం స్పందించింది. హెలికాప్టర్ ద్వారా వైద్య సాయం అందించింది.
'ఎంవీ విశ్వప్రేరణ' వాణిజ్య నౌక కెప్టెన్ రాజ్‌పాల్ సింగ్ సంధు గాయపడ్డారని బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎస్‌ఎన్‌సీకి సమాచారం అందింది. ఆయన కాలికి బలమైన గాయమైంది. తక్షణం కోచికి తరలించాలి. నావికాదళానికి చెందిన 'సీ కింగ్' హెలికాప్టర్, 'ఐఎన్‌ఎస్ గరుడ' నుంచి వెంటనే బయలుదేరి వెళ్లింది. సముద్ర అలల అనిశ్చితి కారణంగా వాణిజ్య నౌక విపరీతంగా ఊగిపోతున్నా, నిపుణులైన నావికాదళ పైలెట్లు ఆ పరిస్థితిని అధిగమించి క్షతగాత్రుడిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.
రాజ్‌పాల్ సింగ్ సంధును తొలుత ఐఎన్‌ఎస్ గరుడకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం కోచిలోని మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు.
(Release ID: 1643887)
Visitor Counter : 188