రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత సైన్యంలో మహిళ అధికారులకు శాశ్వత కమిషన్: దరఖాస్తులను దాఖలు చేయడానికి వివరణాత్మక సూచనలతో నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్మీ ప్రధాన కార్యాలయం

Posted On: 04 AUG 2020 3:54PM by PIB Hyderabad

భారత ఆర్మీ లో మహిళ అధికారులకు శాశ్వత కమిషన్ (పీసీ) ఇవ్వడానికి ప్రభుత్వం మంజూరు లేఖను జారీ చేయడంతో ఆర్మీ ప్రధాన కార్యాలయం తదుపరి ప్రక్రియను ప్రారంభించింది. పీసీ ఇవ్వడానికి మహిళా అధికారులను ఎంపిక చేసేందుకు స్పెషల్ నెంబర్ సెలక్షన్ బోర్డు ను సమావేశపరచడానికి సన్నాహాలు చేస్తోంది. సంబంధిత మహిళా అధికారుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఉమెన్ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (డబ్ల్యుఎస్ఇఎస్)షార్ట్ సర్వీస్ కమిషన్ ఉమెన్ (ఎస్ఎస్సిడబ్ల్యు) ద్వారా భారత సైన్యంలో చేరిన మహిళా అధికారుల అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారువారందరూ తమ దరఖాస్తు పత్రాలుఆప్షన్ సర్టిఫికేట్ఇతర సంబంధిత పత్రాలను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి   2020 ఆగష్టు 31 లోపు సమర్పించాలని ఆదేశించారు. సరైన డాక్యుమెంటేషన్‌ను సులభతరం చేయడానికి నమూనా ఫార్మాట్‌లువివరణాత్మక చెక్‌లిస్ట్‌లు పాలనాపరమైన సూచనలలో చేర్చారు.    

కోవిడ్ వల్ల ఆంక్షల కారణంగాఈ పత్రాలు సంబంధిత మహిళా అధికారులందరికీ ప్రాధాన్యతనిచ్చేలా చేరవేయడానికి వివిధ మార్గాలు అవలింబిస్తున్నారు. దరఖాస్తుల అందుకున్నాక ధృవీకరణ అయిన తర్వాత వెంటనే ఎంపిక బోర్డు షెడ్యూల్ చేస్తుంది. 

 

                                                                                                ********

 



(Release ID: 1643365) Visitor Counter : 277