రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ ఉత్పత్తులు మరియు ఎగుమతి ప్రోత్సాహక విధానం ముసాయిదా 2020ని విడుదల చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
03 AUG 2020 6:16PM by PIB Hyderabad
రక్షణ ఉత్పత్తిలో స్వావలంభనను ప్రోత్సహించేందుకు "ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ" కింద పలు ప్రకటనలు చేయడం జరిగింది. ఆ చట్రం అమలుతో పాటు రక్షణ మరియు అంతరిక్ష రంగాలలో ప్రపంచంలో అగ్రభాగాన ఉన్న దేశాల సరసన ఇండియాను నిలిపేందుకు
రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తులు మరియు ఎగుమతి ప్రోత్సాహక విధానం ముసాయిదా 2020ను (డిపిఇపిపి 2020) రూపొందించింది దేశంలో రక్షణ ఉత్పత్తుల సమర్ధత పెంపు ద్వారా స్వావలంబన మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికి ఈ ముసాయిదా మార్గదర్శకంగా ఉంటుంది.
ఈ దిగువ పొందుపరచిన లక్ష్యాలను మరియు ఉద్దేశాలను ఈ విధానం రూపొందించింది.
2025 నాటికి అంతరిక్ష మరియు రక్షణ ఉత్పత్తులు మరియు సేవలలో రూ. 35,000 కోట్ల ఎగుమతులతో సహా రూ. 1,75,000 కోట్ల టర్నోవర్ సాధించడం
సాయుధ దళాల అవసరాలకు సరిపడే నాణ్యమైన ఉత్పత్తులతో పోటీపడగల దృఢమైన చైతన్యవంతమైన రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయడం
దేశీయంగా రక్షణ సామాగ్రికి రూపకల్పన చేసి అభివృద్ధి చేసే ప్రయత్నాలను 'మేక్ ఇన్ ఇండియా'తో ముందుకు తీసుకెళ్ళి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం
ప్రపంచ రక్షణ శృంఖలలో భాగంగా మారడానికి వీలుగా రక్షణ ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సహించడం
పరిశోధనాభివృద్ధి, వినూత్న కల్పనలను ప్రోది చేసే దృఢమైన చైతన్యవంతమైన, స్వయం సమృద్ధ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం
ఈ దిగువ పేర్కొన్న అంశాలపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా కొత్త విధానం బహుళ వ్యూహాలను తేనున్నది:
సేకరణలో సంస్కరణలు
దేశీయీకరణ మరియు ఎంఎస్ఎంఇలు / అంకుర సంస్థలకు మద్దతు
వనరుల కేటాయింపులో అనుకూలత
పెట్టుబడులకు ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు వ్యాపార సౌలభ్యం
వినూత్న కల్పనలు మరియు పరిశోధనాభివృద్ధి
రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు మరియు యుద్ధ సామగ్రి ఫ్యాక్టరీ బోర్డు
నాణ్యతకు హామీ మరియు పరీక్షల మౌలిక సదుపాయాలు
ఎగుమతి ప్రోత్సాహం
ప్రజల సూచనలు / వ్యాఖ్యలు తెలుసుకునేందుకు, సంప్రదింపుల కోసం ముసాయిదా డిపిఇపిపి 2020ని https://ddpmod.gov.in/dpepp మరియు https://www.makeinindiadefence.gov.in/admin/webroot/writereaddata/upload/recentactivity/Draft_DPEPP_03.08.2020.pdf లో చూడవచ్చు. భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను / వ్యాఖ్యలను కోరుతున్నారు. వివిధ వర్గాల నుంచి అండ్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని రక్షణ మంత్రిత్వ శాఖ విధానాన్ని జారీచేస్తుంది.
ముసాయిదా డిపిఇపిపి 2020పై సూచనలు/వ్యాఖ్యలను ఆగస్టు 17వ తేదీ లోపల dirpnc-ddp[at]nic[dot]in మెయిల్ కు పంపవచ్చు.
*****
(Release ID: 1643249)