యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

అట్టడుగు స్థాయి క్రీడా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సులను ప్రారంభించిన ఎన్ఎస్ఎన్ఐఎస్ పాటియాలా, సిఎస్ఎస్-శ్రీహెర్

Posted On: 03 AUG 2020 3:34PM by PIB Hyderabad

అథ్లెట్లకు శిక్షణ ఇవ్వడానికి స్పోర్ట్స్ సైన్స్ పరిజ్ఞానం అట్టడుగు స్థాయిలో వర్తింపజేసే ప్రయత్నంతో, స్పోర్ట్స్ సైన్స్ సబ్జెక్టులలో  ఆరునెలల సర్టిఫికేట్ కోర్సులు సంయుక్తంగా నిర్వహించడానికి ఎన్ఎస్ఎన్ఐఎస్ పాటియాలా, సిఎస్ఎస్-శ్రీహెర్, చెన్నై (డీమ్డ్ టుబి యూనివర్సిటీ) తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. స్పోర్ట్స్ సైన్స్ రంగంలో పనిచేస్తున్న యువ అర్హతగల నిపుణులకు వారి నైపుణ్యం విషయంలో మరింత ప్రత్యేకత ఇవ్వడానికి ఈ కోర్సు అవకాశం కల్పిస్తుంది. మొదటి దశలో, స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సులు ఆన్‌లైన్‌లో ప్రారంభం అవుతాయి. కోర్సు ప్రవేశాలు 2020 ఆగస్టు 3 నుండి ప్రారంభం అవుతున్నాయి. కమ్యూనిటీ కోచ్‌లు, అభివృద్ధి స్థాయి కోచ్‌లతో పాటు స్పోర్ట్స్ సైన్స్ ఉపయోగించటానికి అట్టడుగు స్థాయి నుండి  శిక్షణ ఇవ్వగల నిపుణులకు కోచింగ్ ఈ కోర్సుల లక్ష్యం.  

స్పోర్ట్స్ ఫిజియోథెరపీ కోర్సు కోసం రాత ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి అర్హత ప్రమాణాలు: మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ (ఆర్థో / స్పోర్ట్). స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్, స్పోర్ట్స్ టీం లేదా క్లబ్‌లో మూడేళ్ల పని అనుభవం ఉన్న ఫిజియోథెరపీలో బ్యాచిలర్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సు కోసం, ప్రవేశ పరీక్షకు అర్హత- ఆహారం పోషణ, అప్లైడ్ న్యూట్రిషన్, ప్రజారోగ్య పోషణ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్, ఫుడ్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్ లేదా స్పోర్ట్స్ న్యూట్రిషన్ సహా ఏదైనా స్ట్రీమ్స్‌లో మాస్టర్స్ ఉండాలి. పైన పేర్కొన్న ఏదైనా స్ట్రీమ్స్‌లో కేవలం బ్యాచిలర్ డిగ్రీ ఉండి, గుర్తింపు పొందిన స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్, క్లబ్ లేదా రాష్ట్ర లేదా జాతీయ స్థాయి జట్టులో మూడు సంవత్సరాల సంబంధిత అనుభవం ఉంటె వారు కూడా ప్రవేశ పరీక్ష రాయవచ్చు.

ఆన్‌లైన్‌లో బోధించబోయే ఆరు నెలల కోర్సు, దాని పాఠ్యాంశాల్లో స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కి చెందిన అన్ని ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది. కోర్సులో భాగంగా రెండు వారాల భౌతిక వర్క్‌షాప్ కూడా జరుగుతుంది, దానిని కోవిడ్ తదనంతరం నిర్వహిస్తారు. తుది ధృవీకరణ కోసం హాజరైనవారిని ఆన్‌లైన్ క్విజ్‌లు, రాత పరీక్షల ఆధారంగా అంచనా వేస్తారు.

అట్టడుగు స్థాయి కోచ్‌ల క్రీడా విద్యలో స్పోర్ట్స్ సైన్స్‌ను చేర్చడం ప్రాముఖ్యత గురించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అకాడెమిక్స్) కల్నల్ ఆర్ఎస్ బిష్నోమాట్లాడుతూ, "స్పోర్ట్స్ సైన్స్లో కొత్త కోర్సులు అట్టడుగు స్థాయి క్రీడా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం,మరింత శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం లక్ష్యం. ఈ కోర్సులు పూర్తయిన తరువాత, ఈ నిపుణులు కమ్యూనిటీ కోచ్‌లు, అభివృద్ధి కోచ్‌లతో కలిసి అట్టడుగు స్థాయిలో పనిచేయడానికి, జూనియర్ అథ్లెట్లకు మెరుగైన శిక్షణను అందించడానికి సన్నద్ధమవుతారు. రెండవ దశలో ఎస్ఎఐ కూడా ఎక్సరసైజ్ ఫిజియోలజీస్పోర్ట్స్ బయోమెకానిక్స్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, స్పోర్ట్స్ సైకాలజీ కోర్సులను ప్రవేశపెడుతుంది" అని వెల్లడించారు. 

కోర్సు పాఠ్యాంశాల గురించి సిఎస్ఎస్-శ్రీహెర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అరుణ్ముగం మాట్లాడుతూ, “ఈ కోర్సులు స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ రంగంలో తాజా అంతర్జాతీయ పద్ధతులను చేర్చడానికి రూపొందించాము. స్పోర్ట్స్ సైన్స్ చేర్చడం, అట్టడుగు స్థాయిలో కూడా, ఈ రంగంలో పనిచేసే నిపుణులకు అథ్లెట్ అవసరాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ కోర్సులో ఉత్తమ భారతీయ అధ్యాపకులు మరియు విదేశీ నిపుణులు బోధించనున్నారు. ” అని తెలిపారు. 

కోర్సులకు దరఖాస్తు ఫారాలు ఆగస్టు 3 నుండి ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్‌లో లభిస్తాయి, అర్హతగల అభ్యర్థులకు  2020 ఆగస్టు 16 న రాత ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. కోర్సు 2020 ఆగస్టు 24, నుండి ప్రారంభమవుతుంది.

*******



(Release ID: 1643220) Visitor Counter : 119