ఉప రాష్ట్రపతి సచివాలయం
రామాయణంలో పేర్కొన్న విధంగా ధర్మానికి సంబంధించి సార్వజనిక సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి
నైతిక వర్తనకు సంబంధించి అపూర్వమైన భారతీయ దార్శనికతను రామాయణం ప్రతిబింబిస్తుందన్న ఉపరాష్ట్రపతి
అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణం పట్ల ఆనందం వ్యక్తంచేసిన ఉపరాష్ట్రపతి
ఇది సమాజ ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి దారితీస్తుందన్న ఉపరాష్ట్రపతి
భౌగోళిక, మతపరమైన హద్దులతో సంబంధం లేకుండా రామాయణం మానవాళికి సంబంధించినది
భగవాన్ రాముడి జీవితం , న్యాయమైన , బాధ్యతాయుతమైన సామాజిక జీవనాన్ని స్థాపించడానికి కీలకమైన విలువలకు ఉదాహరణగా నిలిచింది: ఉపరాష్ట్రపతి
రామాయణం ఇప్పటికీ ఒక మార్గదర్శి : ఉపరాష్ట్రపతి
రామరాజ్యం అనేది, ఇతరుల పట్ల సానుభూతి, సమిష్టితత్వం, శాంతియుత సహజీవనం, సుపరిపాలన వంటి విలువల పునాదిపై ఏర్పడిన ప్రజా కేంద్రిత ప్రజాస్వామిక పాలన అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు.
Posted On:
02 AUG 2020 12:07PM by PIB Hyderabad
రామాయణంలో ప్రస్తావించిన విధంగా ధర్మానికి సంబంధించిన సార్వజనిక సందేశాన్ని అర్థం చేసుకుని దానిని వ్యాప్తిచేయాలని అలాగే , ఈ గొప్ప విలువల ఆధారంగా తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఫేస్ బుక్‌లో రామ మందిర పునర్నిర్మాణం, విలువల పరిరక్షణ పేరుతో 17 భాషలలో ఉపరాష్ట్రపతి ఒక పోస్ట్ పెట్టారు. ఆగస్టు 5న అయోధ్యలో నిర్మించనున్న భగవాన్ రామమందిర నిర్మాణం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ పునర్నిర్మాణ సమయం ఒక ఉత్సవ సమయమని అంటూ ఉపరాష్ట్రపతి, రామాయణ సారాన్ని , రామాయణాన్ని మనం సరైన దృష్టితో అర్థం చేసుకోగలిగితే ఇది సమాజంలో ఆధ్యాత్మికత పుంజుకోవడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఇదిభారతీయ ప్రత్యేక దార్శనికత అయిన ధర్మం లేదా సత్ప్రవర్తనను పట్టి చూపిన కథ అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం మనకు సర్వకాలాలకూ వర్తించే మహోన్నత గ్రంథమైన, రామాయణాన్ని మనకు గుర్తు చేస్తున్నదని ఆయన అన్నారు. భగవాన్ శ్రీరాముడు గొప్ప ఆదర్శ పురుషుడని, ఆయన జీవితం విలువలు మూర్తీభవించినదని, న్యాయబద్ధమైన, బాధ్యతాయుతమైన సామాజిక జీవన క్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అది కీలకమైనదని ఆయన అన్నారు.
రెండు వేల సంవత్సరాల క్రితం నాటి రామాయణాన్ని, కీర్తిస్తూ ఉపరాష్ట్రపతి, రామాయణం ఒక దార్శనికతను ఆవిష్కరిస్తున్నదని, ఇది విశ్వజనీనమైనదని, ఆగ్నేయాసియా లోని పలు దేశాల సంస్కృతిపై ఇది గొప్ప ప్రభావాన్ని చూపిందని ఆయన అన్నారు.
వేద , సంస్కృత పండితుడు ఆర్థర్ ఆంథోని మెక్‌డొనెల్ మాటలు ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి, భారతీయ గ్రంథాలలో పేర్కొన్న రాముని ఆదర్శాలు లౌకిక మూలాలు కలిగినవని, వాటి ప్రభావం, ప్రజల జీవనం, ఆలోచనలపై గత రెండున్నర వేల ఏళ్లుగా ఎంతో ఉన్నదని ఆయన అన్నారు.
రామాయణం ఎందరో కవులు, నాటకరచయితలు, నృత్య కళాకారులు, సంగీతకారులు, జానపద కళాకారులు ఇలా ఎందరి ఊహలనో ఒక్క భారతదేశంలోనే కాక ఎన్నోదేశాలను ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు. జావా, బాలి, మలయా, బర్మా, థాయిలాండ్, కాంబోడియా, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో భగవాన్ రాముడి కథ సాంస్కృతికంగా గొప్ప ప్రాధాన్యత కలిగినదని ఆయన తెలిపారు.ఇది సార్వజనిక మైనదని అంటూ,దక్షిణాసియా నుంచి తూర్పు ఆసియా వరకు వివిధ దేశాలలో పేరెన్నికగన్న రకరకాల రామాయణాల జాబితాను ఆయన వివరించారు.
“ రామాయణ మహా కావ్యాన్ని రష్యాలోకి అలెక్జాండర్ బరనికోవ్ అనువదించారని, థియేటర్ వర్షన్‌ను పేరెన్నిక గన్న రష్యన్ కళాకారుడు గెన్నడి పెచ్నికోవ్ రూపొందించార”ని ఆయన పేర్కొన్నారు.
అంగకోర్ వాట్ కుడ్యాలపై రామాయణంలోని కొన్ని దృశ్యాలు ,ఇండోనేసియాలోని పద్మనాభ ఆలయంలోరామాయణ బాలెట్ వంటివి గమనించినపుడు వివిధ భౌగోళిక ప్రాంతాలు, మతపరమైన హద్దులతో సంబంధం లేకుండా రామాయణం ప్రభావం ప్రపంచ సంస్కృతులపై ఎంతగా ఉందో తెలుస్తున్నదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
బౌద్ధం, జైనం, సిక్కుమతం రామాయణాన్ని ఏదో ఒక రూపంలో స్వీకరించడం ఆసక్తి కలిగిస్తుందని ఆయన తెలిపారు.
రామాయణాన్ని వివిధ భాషలలో వివిధ రకాలుగా చెప్పారని అంటూ, ఈ మహాకావ్యంలోని ఏదో, అంశం. చెప్పేతీరు భిన్న వర్గాల వారిని కట్టిపడేసేది ఉందని ఆయన అన్నారు.
మానవాళిలో అత్యుత్తమ గుణగణాలు మూర్తీభవించిన వ్యక్తిగా శ్రీరాముడిని కీర్తిస్తూ , అలాంటి లక్షణాలను అలవరచుకోవాలని అన్నారు. రామాయణ గాథలో ఈ లక్షణాలకు సంబంధించి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రాముడు భారతదేశమంతటా ప్రయాణిస్తూ సాగే రామాయణకథలో, మనకు ఆయన కట్టుబడిన విలువలైన సత్యం, శాంతి, సహకారం, ఇతరులను అర్థం చేసుకోవడం, న్యాయం, సమష్టితత్వం, భక్తి, త్యాగం, సానుభూతి వంటివాటిని మనం గమనించగలమన్నారు. ఈ విలువలు భారతీయ ప్రపంచ దృక్ఫథానికి అత్యంత కీలకమైనవని ఆయన తెలిపారు.
ఈ విలువలు సార్వజనీనమైనవని, ఎల్లకాలాలకూ వర్తించేవని, శ్రీ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇవి రామాయణాన్ని ఇప్పటికీ మార్గదర్శగ్రంథంగా నిలబెడుతున్నాయని ఆయన తెలిపారు.
మహాత్మా గాంధీ రామరాజ్య భావనను ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి, రామరాజ్యం అనేది ప్రజా కేంద్రిత ప్రజాస్వామిక పరిపాలన అని, అది ఇతరులను అర్థం చేసుకోవడం, సమష్టితత్వం, శాంతియుత సహజీవనం, ప్రజల మెరుగైన జీవనానికి నిరంతర అన్వేషణ ఒక ప్రమాణంగా, ఒక మార్గసూచిగా, ఒక ప్రేరణాత్మక స్ప్రింగ్ బోర్డుగా మన జాతీయ కృషిలో ఉంటూ, అది మన ప్రజాస్వామిక మూలాలను మరింత పటిష్టం చేసేదని అన్నారు.
ఇది మన రాజకీయ, న్యాయ, పాలనా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగిపోయేందుకు సహాయపడుతుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1643145)
Visitor Counter : 296