ఆర్థిక మంత్రిత్వ శాఖ

జులై, 2020 నెల‌లో జీఎస్టీ ఆదాయపు వ‌సూళ్లు

గ‌త జులై నెల‌లో వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.87,422 కోట్లు

Posted On: 01 AUG 2020 4:51PM by PIB Hyderabad

జులై, 2020 నెలలో మొత్తంగా రూ.87,422 కోట్ల మేర స్థూల జీఎస్టీ ఆదాయం వసూలు అయింది. ఇందులో సీజీఎస్‌టీ వ‌సూళ్లు రూ.16,147 కోట్లు గాను, ఎస్‌జీఎస్‌టీ రూ.21,418 కోట్లు గాను, ఐజీఎస్‌టీ రూ.42,592 కోట్లు గాను (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.20,324 కోట్లతో సహా..) మరియు సెస్ రూ.7,265 కోట్లు గాను (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.807 కోట్లతో క‌లుపుకొని) నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే ఈ నెల ఆదాయం 86 శాతానికి స‌మానం. ఈ నెలలో, వస్తువుల దిగుమతి ద్వారా వచ్చే ఆదాయం 84% మరియు దేశీయ లావాదేవీల ద్వారా వ‌చ్చిన‌ ఆదాయం (సేవల దిగుమతితో సహా) గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంలో 96 శాతానికి స‌మానం. గత నెల ఆదాయాలు ప్రస్తుత నెల ఆదాయాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా, మునుపటి నెలలో, పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు కోవిడ్‌-19 కారణంగా అందించిన ఉపశమనం కారణంగా ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్ 2020 లకు సంబంధించిన పన్నులను కూడా చెల్లించారు. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రిటర్న్స్ దాఖలు చేయడానికి గాను ప్ర‌భుత్వం సడలింపు క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయ పోకడలను ఈ కింది చార్ట్ చూపిస్తుంది. జులై, 2019 తో పోలిస్తే మరియు పూర్తి 2020 సంవత్సరానికి జులై నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన జీఎస్టీ గణాంకాలను పట్టిక ప్ర‌తిబింబిస్తుంది. 

 

***

 


(Release ID: 1642944) Visitor Counter : 227