వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈ ఖరీఫ్ లో నిరుటి కంటే 13.92% పెరిగిన విత్తిన విస్తీర్ణం జనపనార తప్ప అన్ని పంటల విస్తీర్ణం పెరుగుదల

Posted On: 31 JUL 2020 5:57PM by PIB Hyderabad

 

కోవిడ్ సంక్షోభ సమయంలోనూ వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కార్యకలాపాలు  చురుగ్గా సాగుతున్నాయి.


1. ఖరీఫ్ పంటలలో విత్తిన విస్తీర్ణం సంతృప్తికరమైన పురోగతి చూపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

 ఖరీఫ్ పంటల విత్తిన విస్తీర్ణం: 31.07.2020 నాటికి 882.18 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు పడ్దాయి. నిరుడు ఇదే కాలంలో విత్తిన విస్తీర్ణం 774.38 లక్షల హెక్టార్లు. ఆ విధంగా నిరుటి కంటే దేశంలో 13.92 % విస్తీర్ణం ఎక్కువగా ఈ ఏడాది విత్తనాలు, నాట్లు పడ్దాయి. పంటల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి: 


 వరి:  నిరుడు ఇదే కాలంలో 223.96 లక్షల హెక్టార్లలో నాట్లు పడగా ఈ ఏడాది 266.60 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు.


పప్పు ధాన్యాలు: నిరుడు ఇదే కాలంలో 93.84 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 111.91 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. 


తృణ ధాన్యాలు: నిరుడు ఇదే కాలంలో 139.26 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 148.34 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు.

 
నూనె గింజలు: నిరుడు ఇదే కాలంలో 150.12 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 175.34 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు.

 
చెరకు: నిరుడు ఇదే కాలంలో 51.20 లక్షల హెక్టార్లలో నాట్లు పడగా ఈ ఏడాది 51.78 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు


జనపనార: నిరుడు ఇదే కాలంలో 7.05 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 6.95 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. 


ప్రత్తి: నిరుడు ఇదే కాలంలో 108.95 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 121.25 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు.

 కాబట్టి మొత్తంగా చూస్తే ఈరోజు వరకూ  కోవిడ్-19 ప్రభావం ఖరీఫ్ పంటల ఆరంభం మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు.

 
2. 30.07.2020 నాటికి దేశంలో  నమోదైన వర్షపాతం 447.1 మిల్లీమీటర్లు కాగా సాధారణ వర్షపాతం 443.3 మిల్లీమీటర్లు. అంటే, 01.06.2020 నుంచి 30.07.2020 మధ్య కాలంలో తేడా (+)1% గా నమోదైనట్టు లెక్క. కేంద్ర జలసంఘం ( సి డబ్ల్యు సి) అందించిన  సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 123  రిజర్వాయర్లలో నీటి నిల్వ నిరుడు ఇదే సమయంలో ఉన్న నీటి నిల్వ కంటే 141% శాతం అధికం

 మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



(Release ID: 1642693) Visitor Counter : 214