రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కొవిడ్‌పై పోరాటంలో కేరళ ప్రభుత్వానికి "ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్" (ఫ్యాక్ట్) మద్దతు
Posted On:
31 JUL 2020 3:48PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే "ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ లిమిటెడ్" (ఫ్యాక్ట్), కొవిడ్‌పై పోరాటంలో కేరళ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. ఎలోర్‌లోని తన ప్రధాన ఆడిటోరియం, ఎం.కె.కె. నాయర్ హాల్‌లో "కొవిడ్ ఫస్ట్- లైన్ ట్రీట్‌మెంట్ సెంటర్" (సీఎఫ్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేసేందుకు మునిసిపాలిటీకి కేటాయించింది. ఇక్కడ 100 పడకలు ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా మంచాలు, పరుపులు, దుప్పట్లను కూడా ఫ్యాక్ట్ అందించింది.
ఎం.కె.కె.నాయర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో, ఎలోర్ మునిసిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి సి.పి.ఉషకు ఈ సామగ్రిని ఫ్యాక్ట్ సీఎండీ కిషోర్ రుంగ్తా అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ, ఫ్యాక్ట్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1642585)
Visitor Counter : 204