మంత్రిమండలి

సాంప్రదాయక చికిత్స పద్ధతి మరియు హోమియోపతి రంగం లో సహకారం అంశం పై  భారతదేశానికి మరియు జింబాబ్వే కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 29 JUL 2020 5:21PM by PIB Hyderabad

సాంప్రదాయక చికిత్స పద్ధతి మరియు హోమియోపతి రంగం లో సహకారం అంశం పై రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే కు మరియు  రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కు మధ్య సంతకాలు అయిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు పైన 2018వ సంవత్సరం లో నవంబర్ 3వ తేదీ నాడు సంతకాలు అయ్యాయి.

వివరాలు

ఇది సాంప్రదాయక చికిత్స పద్ధతి మరియు హోమియోపతి రంగం లో ఇరు దేశాల మధ్య సహకారానికి ఉద్దేశించిన ఒక ఫ్రేం వర్క్ ను సమకూర్చుతుంది.  ఇంకా, సాంప్రదాయక చికిత్స పద్ధతి రంగం లో రెండు దేశాల కు పరస్పర లబ్ధి ని చేకూర్చుతుంది.
 
ఉద్దేశం

వైద్య విద్య యొక్క సాంప్రదాయక విధానాల రంగం లో ఉభయ దేశాల మధ్యసహకారాన్ని సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం ప్రాతిపదికల పైన బలపరచడం, ప్రోత్సహించడం ఇంకా అభివృద్ధిపరచాలనేది ఈ ఎమ్ఒయు యొక్క ప్రధానోద్దేశం గా ఉంది.  సహకారానికి గాను ఈ దిగువన ప్రస్తావించిన రంగాల ను ఈ ఎమ్ఒయు గుర్తించింది:


     •  ఎమ్ఒయు పరిధి లో చేరే బోధన, అభ్యాసం, ఔషధాలు, ఇంకా ఔషధాలు అక్కరలేనటువంటి చికిత్స ల నియంత్రణ ను ప్రోత్సహించడం;

     •  ఎమ్ఒయు ఫ్రేంవర్క్ యొక్క పరిధి లో పేర్కొన్న నిర్దిష్ట లక్ష్యాల ను సాధించడం లో ప్రదర్శన మరియు సంప్రదింపు లకు అవసరమైన అన్ని విధాలైన వైద్య సామగ్రిని, ఇంకా దస్తావేజు పత్రాల ను సరఫరా చేయడం,

     •  చికిత్సకులు, చికిత్స లో సహాయపడే వారు, వైజ్ఞానికులు, బోధన వృత్తినిపుణులు మరియు విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు నిపుణుల ను ఒక దేశానికి మరొక దేశం అందించుకోవడం;

     •  పరిశోధన, విద్య మరియు శిక్షన కార్యక్రమాల కు మొగ్గు చూపే వైజ్ఞానికులు, అభ్యాసకులు, చికిత్సకులు మరియు విద్యార్థుల కు వసతి ని కల్పించడం;

     •  ఔషధకోశాల కు మరియు సూత్రీకరణల కు పరస్పరం గుర్తింపు ను ప్రదానం చేయడం;

     •  ఇరు దేశాల లో గుర్తింపు లభించినటువంటి వైద్య విధానాల ను పరస్పరం మాన్యత ను ప్రదానం చేయడం;

     •  రెండు దేశాల లో కేంద్రం/ రాష్ట్రాల లోని గుర్తింపు గల విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసిన విద్యార్హతల కుపరస్పరం మాన్యత ను అందజేయడం;

     •  గుర్తింపు గల విద్యాసంస్థల లో విద్యార్జన కై ఉపకార వేతనాల ను సమకూర్చడం;

     •  సంబంధిత దేశాల లో ప్రస్తుతం అమలవుతున్నటువంటి చట్టాలకు అనుగుణం గా యోగ్యులైన చికిత్సకుల ద్వారా పరస్పర ప్రాతిపదిక న సాంప్రదాయక సన్నాహాల కు మాన్యత ను ప్రదానం చేయడం;

     •  సంబంధిత దేశాల లో ప్రస్తుతం అమలవుతున్నటువంటి చట్టాలకు అనుగుణం గా యోగ్యులైన చికిత్సకుల ద్వారా పరస్పర ప్రాతిపదిక న అభ్యాసం సాగించేందుకు అనుమతి ని ఇవ్వడం; ఇంకా-

     •  రెండు దేశాల లోను అనంతర కాలం లో పరస్పరం అంగీకరించిన మేరకు మరే ఇతర రంగాల లో మరియు/ లేదా సహకారార్థ రూపాల పై సహకరించుకోవడం.


 

***
 



(Release ID: 1642132) Visitor Counter : 270