రైల్వే మంత్రిత్వ శాఖ
రూపే ప్రాతిపదికగా కాంటాక్ట్.లెస్ క్రెడిట్ కార్డును ఉమ్మడిగా ప్రారంభించిన ఐ.ఆర్.సి.టి.సి., ఎస్.బి.ఐ. కార్డ్.
అన్ని రంగాల్లో రైల్వేలకు స్వావలంబన సాధించిపెట్టేందుకు కట్టబడి ఉన్నామన్న పీయూష్ గోయెల్
ప్రధానమంత్రి నిర్దేశించిన మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల సాధనకు ఉపక్రమిస్తామని రైల్వేమంత్రి ప్రకటన
Posted On:
28 JUL 2020 12:18PM by PIB Hyderabad
ఆత్మనిర్భర లక్ష్యాల సాధనకు, అన్నిరంగాల్లో రైల్వేలను స్వావలంబన సాధించేలా కృషి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, గౌరవ ప్రధానమంత్రి నిర్దేశించిన మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల సాధనకు శ్రమిస్తామని రైల్వేలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘ఆత్మనిర్భర భారత్’, ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇండియా’ లక్ష్యాల సాధనలో మరో ముందడుగు పడింది. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా సమక్షంలో ఐ.ఆర్.సి.టి.సి., భారతీయ స్టేట్ బ్యాంక్ కార్డ్ (ఎస్.బి.ఐ. కార్డ్) కలసి కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డును రూపే ప్లాట్ ఫాంపై ప్రారంభించారు. నూతనంగా రూపొందించిన ఈ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డును రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ రోజు జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ,.. ఆత్మనిర్భర లక్ష్యాల సాధనకు, అన్నిరంగాల్లో రైల్వేలు స్వావలంబన సాధించేలా కృషి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, గౌరవ ప్రధానమంత్రి నిర్దేశించిన మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల సాధనకు శ్రమిస్తామని చెప్పారు. రూపే ప్లాట్ ఫాంపై పనిచేసేలా ఐ.ఆర్.సి.టి.సి.-ఎస్.బి.ఐ. ఉమ్మడిగా రూపొందించిన క్రెడిట్ కార్డు ఈ కృషిలో భాగమేనని చెప్పారు. “మేక్ ఇండియా” పథకం కింద రైల్వేలు చేపట్టిన అనేక కార్యకలాపాల్లో ఈ క్రెడిట్ కార్డు కూడా ఒకటని మంత్రి చెప్పారు.
లావాదేవీలకు సంబంధించి వినియోగదారులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు, ఈ కొత్త కార్డుకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్.ఎఫ్.సి.) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారు. దీనితో వినియోగదారులు ఈ కార్డును ఆఫ్ సేల్ (పి.ఒ.ఎస్.) మెషీన్ల వద్ద సులభంగా వాడవచ్చు. స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా, ట్యాప్ చేయడం ద్వారా ఈ కార్డును వినియోగించే వీలుంటుంది.
తరచుగా రైలు ప్రయాణంచేసే వారికి సదుపాయంగా ఈ కొత్త క్రెడిట్ కార్డును రూపొందించారు. ఈ క్రెడిట్ కార్డు వాడకం వల్ల రైలు ప్రయాణికులకు గరిష్టస్థాయిలో ఖర్చు ఆదా అవుతుంది. అంతేకాక, రిటైల్ ఖర్చులు, భోజనం, వినోద ఖర్చుల్లో కూడా ఆదా , ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. లావాదేవీల ఫీజు కూడా రద్దవుతూ ఉంటుంది.
ఈ కార్డు కలిగిన వారు ఐ.ఆర్.సి.టి.సి. వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నపుడు,.. మొదటి, రెండవ, 3వ తరగతి ఎ.సి క్లాసుల్లో, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఎ.సి. చైర్ కార్ బుకింగ్.లలో 10శాతం వాల్యూ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒక శాతం లావాదేవీ చార్జీలనుంచి ఈ కార్డుదారులకు మినహాయింపు. ఒకశాతం ఇంధన సర్చార్జ్ మినహాయింపు, 3నెలలకోసారి చొప్పున సంవత్సరంలో నాలుగుసార్లు రైల్వేస్టేషన్లలోని ప్రీమియం లాంజ్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. కార్డు యాక్టివేట్ అయినపుడు వెంటనే చేసే కనీస వ్యయం ప్రాతిపదికగా 350 చొప్పున బోనస్ రివార్డు పాయింట్లు కార్డు వినియోగదారులకు లభిస్తాయి. ఇలా తమ ఖాతాలో పడిన రివార్డు పాయింట్లను ఐ.ఆర్.సి.టి.సి. వెబ్ సైట్ ద్వారా టికెట్ల కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. రైలు ప్రయాణ చార్జీల్లో ఆదాతో పాటుగా, ఐ.ఆర్.సి.టి.సి.-ఎస్.బి.ఐ. కార్డుతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కార్డును ఉపయోగించి ఆన్ లైన్ లో పోర్టల్స్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా కొనుగోలు చేసినపుడు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.
రూపేకి మార్కెట్ భాగస్వామ్యం పెరగడం, భారతీయ వినియోగదారుల్లో ఆదరణ పెరగడంతో ఈ కొత్త కార్డు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. రూపే ప్లాట్ ఫారంపై బహుళ ప్రయోజనకరమైన క్రెడిట్ కార్డును ఐ.ఆర్.సి.టి.సి.- ఎస్.బి.ఐ. బ్రాండ్లు ఉమ్మడిగా తీసుకురావడంతో రూపే వినియోగదారులకు సులభంగా షాపింగ్ చేయడానికి వీలు కలిగింది.
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ప్రోత్సాహంగా, సురక్షిత లావాదేవీలు లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ ఉమ్మడి బ్రాండ్ క్రెడిట్ కార్డు,..రైలు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వాలన్న సంకల్పాన్ని కూడా నెరవేర్చింది.
*****
(Release ID: 1641806)
Visitor Counter : 296