ఆర్థిక మంత్రిత్వ శాఖ

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను సెస్ క‌లెక్ష‌న్ రూ.95,444 కోట్లు కాగా కేంద్రం రాష్ట్రాలు/యుటీలకు రూ.1,65,302 కోట్ల జీఎస్టీ ప‌రిహారాన్ని చెల్లించింది

Posted On: 27 JUL 2020 5:37PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం మార్చి 2020కి సంబంధించి ఇటీవల రూ.13,806 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని
రాష్ట్రాలకు చెల్లించింది. ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2019-20 వరకు రాష్ట్రాలకు మొత్తం పరిహారం విడుదల చేసిన‌ట్ట‌యింది. 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన పరిహారం మొత్తం రూ.1,65,302 కోట్ల‌కు చేరింది. 2019-20 సంవత్సరంలో సేకరించిన సెస్ మొత్తం రూ.95,444 కోట్లుగా నిలిచింది. 2019-20 పరిహారాన్ని విడుదల చేయడానికి గాను 2017-18 మరియు 2018-19 మధ్య వసూలు చేసిన సెస్‌ను కూడా ఉపయోగించుకున్నారు.


అదనంగా, కేంద్రం 2017-18కి సంబంధించిన ఐజీఎస్‌టీ బ్యాలెన్స్‌ను విభజించే త‌న క‌స‌ర‌త్తులో
భాగంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాంపెన్సేషన్ ఫండ్‌కు రూ.33,412 కోట్ల సొమ్మును బ‌దిలీ చేసింది. 

ఈ క్రింది పట్టిక 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జీఎస్టీ పరిహారాన్ని సూచిస్తోంది: -

క్ర‌మ సంఖ్య‌

రాష్ట్రం పేరు/ ‌యూటీ

2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు / యూటీల‌కు విడుదల చేసిన జీఎస్టీ పరిహారం 

 

(రూ. కోట్ల‌లో)

1

ఆంధ్ర ప్ర‌దేశ్‌

3028

2


అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌

0

3

అస్సాం

1284

4

బీహార్‌

5464

5

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

4521

6

ఢిల్లీ

8424

7

గోవా

1093

8

గుజ‌రాత్‌

14801

9

హ‌ర్యాణా

6617

10

హిమాచ‌ల్ ప్రదేశ్‌

2477

11

జే అండ్ కే

3281

12

ఝార్ఖండ్‌

2219

13

క‌ర్ణాట‌క‌

18628

14

కేర‌ళా

8111

15

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌

6538

16

మ‌హారాష్ట్ర

19233

17

మ‌ణిపూర్

0

18

మేఘాల‌యా

157

19

మిజోరాం

0

20

నాగాలాండ్‌

0

21

ఒడిషా

5122

22

పుదిచ్చేరి

1057

23

పంజాబ్‌

12187

24

రాజ‌స్థాన్‌

6710

25

సిక్కిం

0

26

త‌మిళ‌నాడు

12305

27

తెలంగాణ‌

3054

28

త్రిపు‌ర‌

293

29

ఉత్త‌ర్ ప్రదేశ్‌

9123

30

ఉత్త‌రాఖండ్‌

3375

31

ప‌శ్చిమ బెంగాల్‌

6200

 

మొత్తం

165302

 

***

 


(Release ID: 1641688) Visitor Counter : 338