శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'పాపులర్ సైన్స్ రైటింగ్' భారత దేశం మరియు సరిహద్దుల అవతల అనే అంశంపై వెబ్‌నార్
Posted On:
25 JUL 2020 4:08PM by PIB Hyderabad
'నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్' (ఎన్‌సీఎస్‌టీసీ) మరియు 'సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం' (డీఎస్‌టీ) యొక్క స్వయంప్రతిపత్త సంస్థ 'విజ్ఞాన్ ప్రసార్' ఈ వారం ప్రారంభంలో “పాపులర్ సైన్స్ రైటింగ్” అనే అంశంపై రెండు వెబ్‌నార్లను నిర్వహించింది. సైన్స్ కమ్యూనికేషన్స్ యొక్క బ్రిగేడ్ను రూపొందించడానికి గాను చేపట్టిన “ఆగ్యుమెంటింగ్ రైటింగ్ స్కిల్స్ ఫర్
ఆర్టిక్యులేటింగ్ రీసెర్చ్ (ఏడబ్ల్యూఎస్ఏఆర్)” అనే కార్యక్రమంలో భాగంగా వీటిని నిర్వహించారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా అమెరికా, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్ మొదలైన 12 దేశాల నుండి విద్వాంసులు ఇందులో పాల్గొన్నారు. సైన్స్ కమ్యూనికేషన్ ప్రాముఖ్యత, పరిశోధన నుండి ప్రసిద్ధ కథనాలను రాయడం మరియు ప్రసిద్ధ సైన్స్ రచన యొక్క చిట్కాలు మరియు సాంకేతికతలను వెబ్‌నార్లలో పరిచయం చేశారు. డీఎస్‌టీ ఎన్‌సీఎస్‌టీసీ సంస్థ అధినేత డాక్టర్ మనోజ్ పటేరియా, విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త డాక్టర్ బీ కే త్యాగిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వీక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. సైన్స్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన పలు రకాల చిట్కాలను పంచుకున్నారు. ఈ వెబ్‌నార్లకు భారీ స్పందన లభించింది. భారత్ మరియు విదేశాల నుండి 1282 మంది రిజిస్టర్డ్ ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. “ఒకరి పరిశోధన ఆధారంగా ఒక ప్రసిద్ధ విజ్ఞాన కథ రాయడం నా జ్ఞానం యొక్క లోతైన మరియు ఇరుకైన విజ్ఞాన శాస్త్రం యొక్క విస్తృత ప్రశ్నలకు మరియు సమాజ అవసరాలకు ఎలా సంబంధం కలిగి ఉందనే దానిపై మన సొంత అవగాహనను పెంచుకోవడంలో అద్భుతాలు చేస్తుంది. నా పరిశోధన అన్ని వయస్కుల వారికి మరియు మేటి విద్యా నేపథ్యాలలో ఉన్నవారికి అవగాహనను కల్పించడం.. ప్రశంసలు మరియు కొంత ఉత్సాహాన్ని కలిగించే రీతిలో వివరించగలిగితే.. నేను సమస్యను అనేక కోణాలను బాగా అర్థం చేసుకున్నాను !” అని అర్థమని డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
(Release ID: 1641300)
Visitor Counter : 168