ఆర్థిక మంత్రిత్వ శాఖ
కొన్ని దేశాలనుంచి, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌పై ఆంక్షలు
Posted On:
23 JUL 2020 10:14PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం 2017 సాధారణ ఆర్థిక నిబంధనలను ఈరోజు సవరించింది. భారతదేశంతో సరిహద్దు భూ భాగం గల దేశాలనుంచి వివిధ ప్రొక్యూర్‌మెంట్లపై (వస్తువులు, సరకులు సేవలను పొందడం) ఆంక్షలు విధిస్తూ ఈ సవరణలు తెచ్చారు. భారతదేశ రక్షణ, లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా దేశభద్రతతో సహా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశరక్షణ, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు, వ్యయ విభాగం, ఈ నిబంధనల కింద పబ్లిక్ ప్రోక్యూర్‌మెంట్‌కు సంబంధించి సవివరమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాల ప్రకారం, అలాంటి దేశాలతో బిడ్డింగ్‌లో పాల్గొనేవారు ఎవరైనా తగిన అధికారం గల అథారిటీ వద్ద(కాంపిటెంట్ అథారిటి) తమ పేర్లు నమోదు చేసుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే భారత్‌తో సరిహద్దు భూభాగం గల దేశాలతో సరకులు, సేవలకు సంబంధించి (కన్సల్టెన్సీ లేదా నాన్ కన్సల్టెన్సీ సేవలతోసహా) ప్రొక్యూర్ మెంట్‌కు బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అర్హత కలిగి ఉంటారు. రిజిస్ట్రేషన్‌కు కాంపిటెంట్ అథారిటీ యే రిజిస్ట్రేషన్ కమిటీగా ఉంటుంది. దీనిని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డిపిఐఐటి) ఏర్పాటు చేస్తుంది.విదేశీ వ్యవహారాలు, హోం మంత్రిత్వశాఖ నుంచి తప్పనిసరిగా రాజకీయ, భద్రతాపరమైన అనుమతులు పొందవలసి ఉంటుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ ఎంటర్‌ప్రైజ్‌లు (సిపిఎస్ఇలు), ప్రభుత్వం నుంచి లేదా ప్రభుత్వ అండర్‌టేకింగ్ లనుంచి ఆర్థిక సహాయం అందుకునే పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు ఈ ఆదేశాల పరిధి కిందికి వస్తాయి.
భారతదేశ రక్షణ, జాతీయ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రప్రభుత్వాలు, రాష్ట్రప్రభుత్వ అండర్ టేకింగ్‌లు చేసే ప్రొక్యూర్‌మెంట్‌ల విషయంలో ఈ ఆదేశాలను అమలు చేసేలా భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 257(1) కింద రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖల రాసింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రొక్యూర్‌మెంట్లకు సంబంధించి రాష్ట్రాలు కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటుచేసుకుంటాయి. అయితే రాజకీయ ,భద్రతా పరమైన క్లియరెన్సులు మాత్రం అవసరం.
అయితే , పరిమిత కేసుల విషయంలో అంటే,కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు అవసరమైన మందులసేకరణ వంటి వాటికి 2020 డిసెంబర్ 31 వరకూ కొన్ని సడలింపులు ఇచ్చారు .విడిగా మరో ఆదేశం జారీచేస్తూ, భారత ప్రభుత్వం రుణ సహాయం లేదా అభివృద్ది సహాయం అందిస్తున్న దేశాల విషయంలో ముందస్తు రిజిస్ట్రేషన్‌నుంచి మినహాయింపు ఇచ్చారు.
తాజా నిబంధనలు, కొత్తవెండర్లు అందరికీ వర్తిస్తాయి. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన వాటి విషయంలో తొలి దశ అర్హతలకు సంబంధించి అర్హతల మూల్యాంకనం పూర్తి కాకపోతే, కొత్త ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకొనని బిడ్డర్లను అర్హత లేని వారిగా పరిగణిస్తారు. ఒక వేళ ఈ దశ దాటినట్లయితే, సాధారణంగా టెండర్లను రద్దు చేసి, ఈ ప్రక్రియను తిరిగి మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిఉంటుంది. ఈ ఆదేశాలు ఇతర రూపాలలో జరిగే పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్లకు కూడా వర్తిస్తాయి. అయితే ప్రైవేటు రంగ ప్రొక్యూర్‌మెంట్లకు ఇది వర్తించదు.
సంబంధిత ఆదేశాలను ఇక్కడ చూడవచ్చు:
అనుబంధం 1
అనుబంధం 2
(Release ID: 1641136)
Visitor Counter : 386