రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

హైదరాబాద్ లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. 8వ స్నాతకోత్సవం ఈ రోజు జరిగింది.

గత రెండు విద్యా సంవత్సరాలకు (2017-2019 మరియు 2018-2020) చెందిన 270 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు

Posted On: 24 JUL 2020 6:57PM by PIB Hyderabad
హైదరాబాద్ లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. 8వ స్నాతకోత్సవం ఈ రోజు ఆన్ లైన్ ద్వారా జరిగింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, హైదరాబాదు లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. సమాజానికి  ఇది ఒక ఉత్సాహభరితమైన, విజయవంతమైన సంబరాలు జరుపుకున్న సమయం.  
 
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణా ప్రభుత్వ ఐ.టి., ఈ & సి. శాఖల మంత్రి శ్రీ కే.టి.రామారావు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగ పరిశ్రమల్లో ప్రకాశవంతమైన ఔషధ రంగ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పేర్కొన్నారు.   
 
భారత ప్రభుత్వ ఫార్మా స్యూటికల్స్ శాఖ కార్యదర్శి మరియు ఎన్.ఐ.పి.ఈ.ఆర్.ల అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి.డి.వాఘేలా ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకటైన ఈ సంస్థ నుండి విజయవంతంగా పట్టభద్రులైన అభ్యర్ధులందరినీ అభినందించారు.

ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకింగ్ లో స్థిరమైన పనితీరు కనబరిచినందుకు హైదరాబాద్ లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. డైరెక్టర్ డాక్టర్ శశి బాలా సింగ్ మరియు హైదరాబాద్ లోని  ఎన్.ఐ.పి.ఈ.ఆర్. గవర్నర్ల మండలి చైర్మన్ శ్రీ కే.సతీష్ రెడ్డి లను కూడా ఆయన అభినందించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశానికి మరియు ప్రపంచానికి ప్రాణాలను రక్షించే ఔషధాలను అందించడంలో భారతీయ ఔషధ రంగ పరిశ్రమ పోషించిన కీలక పాత్ర గురించి ఆయన వివరించారు.  ఎల్లప్పుడూ శక్తివంతమైన భారతీయ ఔషధ రంగ పరిశ్రమలో విద్యార్థులకు ప్రకాశవంతమైన అవకాశాలు లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. 

ఈ మహమ్మారి పరిస్థితిలో ఔషధ రంగ పరిశ్రమలో సంభవిస్తున్న అనేక పరివర్తన మార్పుల గురించి శ్రీ కె. సతీష్ రెడ్డి వివరించారు. ఈ విధంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు లభించే అనేక సవాళ్లతో కూడిన అవకాశాల గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  హైదరాబాద్ లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. లో విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు,  వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

హైదరాబాద్ లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. తన 12 సంవత్సరాల స్వల్ప ప్రయాణంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఔషధ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ రజనీష్ తింగళ్ వివరిస్తూ, ఎన్.ఐ.ఆర్.ఎఫ్. లో మంచి ర్యాంకులను సాధించడం ద్వారా ఔషధ రంగ సంస్థలన్నింటిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు. 

హైదరాబాద్ లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. డైరెక్టర్ డాక్టర్ శశి బాలా సింగ్ సభ నుద్దేశించి మాట్లాడుతూ, తమ సంస్థ గత 12 సంవత్సరాలలో సాధించిన ప్రగతి యాత్రను వివరించారు.   

ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ స్నాతకోత్సవంలో గత రెండు విద్యా సంవత్సరాలకు (2017-2019 మరియు 2018-2020) చెందిన ఎమ్.ఎస్. ఫార్మా (189); ఎమ్.బి.ఏ. ఫార్మా (57) మరియు పి.హెచ్.డి.(24) తో సహా మొత్తం 270 విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.  

*****



(Release ID: 1641066) Visitor Counter : 129