గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

పునర్వ్యవస్థీకరించిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద ఇళ్లకు సగటు పూర్తయ్యే సమయం 114 రోజులకు తగ్గింది; 1.10 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి, ఇందులో 1.46 లక్షల మంది భూమిలేని లబ్ధిదారులకు ఇళ్లు ఉన్నాయి

పిఎంఎవై-జి కింద 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యం మార్చి 2022 నాటికి సాధించవచ్చని భావిస్తున్నారు

2014 నుండి ఇందిరా ఆవాస్ యోజన కింద 182 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి

Posted On: 24 JUL 2020 7:26PM by PIB Hyderabad

“2022 నాటికి అందరికీ గ్రహాలు” అనే లక్ష్యాన్ని సాధించడానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పునర్వ్యవస్థీకరించిన గ్రామీణ గృహనిర్మాణ పథకాన్ని, అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పిఎంఎవై-జి) ను 20 నవంబర్, 2016 న ప్రారంభించారు. 

2022 నాటికి అన్ని ప్రాథమిక సదుపాయాలతో 2.95 కోట్ల ఇళ్ళు. మూడు దశల ధ్రువీకరణ (సామాజిక ఆర్థిక కుల గణన 2011, గ్రామసభ, జియో-ట్యాగింగ్) ద్వారా లబ్ధిదారుల ఎంపిక పిఎంఎవై-జి కింద నిరుపేదవారి ఎంపికను నిర్ధారిస్తుంది. లబ్ధిదారుల ఖాతాకు నిధుల సజావుగా చేరేలా ఐటి / డిబిటి, స్థానిక ప్రాంత నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత కొత్త హౌసింగ్ డిజైన్లను ఉపయోగించడం, నిర్మాణానికి ముందే నిర్ణయించిన అన్ని దశలలో తీసిన జియో-ట్యాగ్ చేసిన ఫోటోల ఆధారంగా పర్యవేక్షణ, లావాదేవీల ఆధారిత ఎంఐఎస్, నిధులను సమకూర్చడం, గ్రామీణ కట్టెలకు శిక్షణ ఇవ్వడం మొదలైన చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా 1.10 కోట్ల ఇళ్ళు పూర్తయ్యాయి, ఇందులో ప్రధాన్ మంత్రి  ఆవాస్ యోజన-గ్రామీణ్ ( పిఎంఎవై-జి ) కింద 1.46 లక్షల మంది భూమిలేని లబ్ధిదారులకు ఇళ్ళు ఉన్నాయి. 

పని వేగం ఎన్‌ఐపిఎఫ్‌పి అధ్యయనంలో ప్రతిబింబిస్తుంది, గతంలో ఉన్న సగటు 314 రోజులతో పోలిస్తే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పిఎమ్‌ఎవై-జి) కింద వాటి పూర్తి చేసే సగటు సమయం 114 రోజులు అని సూచించింది. ఇందిరా ఆవాస్ యోజన కింద సుమారు 72 లక్షల గృహాల నిర్మాణాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2014 నుండి పూర్తి చేసింది. 2014 నుండి మొత్తం 182 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో కలయిక ద్వారా గృహాల ప్రాథమిక అవసరాలను కూడా పిఎంఐ-జి పరిష్కరిస్తుంది.పేదలకు ఇళ్ళు  లభించడమే కాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) కింద 90-95 రోజుల పని కూడా లభిస్తుంది. వారి గృహాలకు ప్రస్తుత విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద విద్యుత్ కనెక్షన్, ప్రధాన్ మంత్రి ఉజ్జ్వాల పథకం కింద ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడంతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ / ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద గృహాల మరుగుదొడ్డి, జల్ జీవల్ మిషన్ కింద ట్యాప్ కనెక్షన్ కూడా ఉంటాయి. దీన దయాళ్ అంత్యోజన -జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డిఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద 1.82 కోట్ల గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అభివృద్ధి, వైవిధ్యమైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రాలతో భాగస్వామ్యంతో వివిధ దశలలోని గృహాల పూర్తయ్యే వేగం విషయంలో కానీ, 2022 మార్చి నాటికి పిఎమ్‌ఎవై-జి కింద 2.95 కోట్ల గృహాల నిర్మాణ లక్ష్యాన్ని సాధించడంలో కానీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విశ్వాసంతో ఉంది.

***



(Release ID: 1641056) Visitor Counter : 152