ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రజావసరాలకు ప్రతిస్పందిస్తూ పనిచేస్తున్న ఆదాయంపన్ను శాఖ ఆదాయంపన్ను శాఖకు కేంద్ర ఆర్థికమంత్రి ప్రశంస

జాతి నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకుంటూ
160వ ఆదాయం పన్ను దినోత్సవం జరుపుకున్న సి.బి.డి.టి.

Posted On: 24 JUL 2020 6:08PM by PIB Hyderabad

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సి.బి.డి.టి.), బోర్డుకు సంబంధించిన క్షేత్రస్థాయి కార్యాలయాలు రోజు దేశవ్యాప్తంగా 160 ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకున్నాయి. సందర్భందా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సందేశమిచ్చారుపన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకారిగా, పారదర్శకంగా, స్వచ్ఛంద పన్ను చెల్లింపునకు దోహదకారిగా పన్ను పరిపాలనా యంత్రాగాన్నితీర్చిదిద్దడంలో ఆదాయంపన్ను శాఖ  చేస్తున్న కృషిని మంత్రి తన సందేశంలో అభినందించారు. ఇటీవలి కాలంలో ఆదాయంపన్ను శాఖ పాత్ర గణనీయంగా మారిందని, కేవలం పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే సంస్థగానే కాక, పౌర ప్రయోజన సంస్థగా పరివర్తన చెందిందని కేంద్రమంత్రి అన్నారు. ఆదాయంపన్ను శాఖ చేపట్టిన వివిధ రకాలైన సంస్కరణ చర్యలను నిర్మలా సీతారామన్ ఉదహరించారు. కొత్త తరహా సరళీకృత పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టడం, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం, స్వదేశీ తయారీ సంస్థలు రాయితీ పద్ధతిలో పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించడం ఆదాయం పన్ను శాఖ తీసుకున్న సంస్కరణలని ఆమె చెప్పారు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకుఆత్మనిర్భర భారత్లక్ష్యాలను సాధించేందుకు చర్యలన్నీ దోహదపడతాయని కేంద్రమంత్రి చెప్పారు.

  కోవిడ్ వైరస్ వ్యాపించిన ప్రస్తుత సంక్షోభ సమయంలో పన్ను చెల్లింపుదారుల అవసరాలకు తగినట్టుగా ఆదాయంపన్ను శాఖ ప్రతిస్పందించిందని, పలు రకాల వెసులుబాట్లను కల్పించి, పన్ను చెల్లింపుదార్ల లిక్విడిటీ సమస్యలను పరిష్కరించిందని కేంద్రమంత్రి ప్రశంసించారు. దేశం ఆర్థిక వృద్ధిలో ఆదాయంపన్ను శాఖ కీలకపాత్ర పోషించడంతోపాటుగావృత్తిపరంగా పనితీరును మెరుగుపరుచు కోవడానికి, సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి కృషిచేయడం అభినందనీయమన్నారు.

  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా తన సందేశంలో ఆదాయం పన్ను శాఖ కృషిని ప్రశంసించారు. పన్ను చెల్లింపుదారులకు ఉపయోకరంగా సమర్థవంతమైన సేవలు అందించడంలో ఆదాయం పన్ను శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శాఖాపరమైన ప్రక్రియలన్నింటినీ మరింత సరళతరంగా, పన్ను చెల్లింపుదారులు సులభంగా అనుసరించేలా  తీర్చిదిద్దారని  అన్నారు. గవర్నెన్సును ప్రోత్సహించడం, వివాద్ సే విశ్వాస్ అన్న చట్టం తేవడం ద్వారా  వివాదాల పరిష్కారానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటివి ఆదాయం పన్ను శాఖ తీసుకున్న చర్యలని ఠాకూర్ చెప్పారు.

  కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లకు దీటుగా, ఎంతో వేగంగా ఆదాయంపన్ను శాఖ ప్రతిస్పందించిన తీరును కూడా అనురాగ్ ఠాకూర్ అభినందించారు. విధానపరమైన నిబంధనలను సడలించడం, ఆస్తులను నగదు చేసుకునే సానుకూలతను (లిక్విడిటీ)ని పెంపొందించడం వంటి చర్యలు అభినందనీయమన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పన్నుల చెల్లింపు దారులకు సహాయం అందించేందుకు అధికారుల స్థాయిలో, బృందాల స్థాయి జరిగిన కృషిని ఆయన ప్రశంసించారుపన్ను విధింపు విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు, పన్ను పరిపాలనా యంత్రాగాన్నిమరింత ప్రతిస్పందన శీలంగా తీర్చిదిద్దడంలో ఆదాయం పన్ను శాఖ తన కృషిని కొనసాగిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

     ఆదాయంపన్ను దినోత్సవం సందర్భంగా ఆదాయంపన్ను శాఖ సిబ్బందిని సి.బి.డి.టి. అధ్యక్షుడు పి.సి. మోడీ,.. తన సందేశం ద్వారా అభినందించారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్ళకు దీటుగా ప్రతిస్పందిస్తూ విధులు నిర్వర్తించడంలో అధికారుల తీరు ప్రశంసనీయమన్నారు. కోవిడ్ బాధితులకు వైద్యసేవలను, మానసిక స్థైర్యాన్ని అందించడానికి కోవిడ్ ప్రతిస్పందనా బృందాలను ఏర్పాటు చేయడంలో వారు వ్యవహరించిన తీరును ఆయన అభినందించారు. పన్ను చెల్లింపుదారులు నిబంధనలు పాటించేలా చేయడం, మార్గదర్శక సూత్రాల అమలులో పారదర్శకంగా వ్యవహరించడంలో ఆదాయం పన్ను శాఖ మరింత చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయకర్ పరివార్ అధిపతి హోదాలో ఆయన హామీ ఇచ్చారు.

****


(Release ID: 1641050) Visitor Counter : 251