భారత ఎన్నికల సంఘం

ఉప ఎన్నికలకు సంబంధించి స్పష్టీకరణ

Posted On: 23 JUL 2020 2:23PM by PIB Hyderabad

శ్రీ సుమిత్ ముఖర్జీ, సీనియర్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ, క‌మిష‌న్‌, జారీ చేసిన 22.7.2020 నాటి లేఖ నెం.99/ఉప ఎన్నిక/2020/ ఈపీఎస్‌కు సంబంధించి స‌ర్కారు వివ‌ర‌ణనిచ్చింది. ఈ లేఖ‌కు సంబంధించిన విష‌య‌మై మీడియాలోని కొన్ని విభాగాలు గందరగోళానికి లోన‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు వివ‌ర‌ణ‌నిస్తూ పైన పేర్కొన్న కమ్యూనికేషన్ కేవ‌లం ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించింది మాత్రమే అని స్పష్టం చేయబడింది. కొన్ని అసాధారణ పరిస్థితుల కారణంగా లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ 03.7.2020 నాటి వీడియో లెటర్ నెంబర్ 99 / ఉప ఎన్నికలు / 2020 / ఈపీఎస్ జారీ చేయ‌బడింది. మొత్తంగా ఉప ఎన్నిక జ‌ర‌గాల్సింది 56 అసెంబ్లీ నియోజకవర్గాల‌కు (అంతకుముందు సూచించిన ఎనిమిదితో సహా..) ఒక పార్లమెంటరీ నియోజకవర్గం మాత్ర‌మే ఉంది. ఈ మొత్తం 57 ఉప ఎన్నికలలో, ఆర్.పి.చట్టం, 1951 లోని సెక్షన్ 151 ఏ, నిబంధనల ప్రకారం అన్ని ఉప ఎన్నికలను నిర్వహించడానికి కమిషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేయబడింది. పైన పేర్కొన్న విధంగా ఎనిమిది ఉపఎన్నికల‌ను సెప్టెంబర్ 7, 2020 వ‌ర‌కు మాత్ర‌మే వాయిదా వేయడం జ‌రిగింది. రేపు (24.07.2020న‌) జరగబోయే ఎన్నికల కమిషన్ సమావేశంలోనూ ఉపఎన్నికల తేదీల‌ అంశం కూడా చ‌ర్చ‌కు రానుంది.  

***
 



(Release ID: 1640754) Visitor Counter : 138