భారత పోటీ ప్రోత్సాహక సంఘం
కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్‌ను, అదాని పోర్ట్సు,స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ సమీకరించేందుకు సిసిఐ అనుమతి
Posted On:
23 JUL 2020 10:06AM by PIB Hyderabad
కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ను అదాని పోర్ట్సు, స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్, సమీకరించేందుకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సిసిఐ) అనుమతిచ్చింది. ప్రతిపాదిత సమీకరణ , ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌తోపాటు కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కెపిసిఎల్)యాజమాన్య నియంత్రణను కూడా అదాని పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ ( అదాని పొర్ట్స్) పొందేందుకు వీలుకల్పిస్తుంది.
అదాని పోర్ట్సు కస్టమర్‌తోనేరుగా సంబంధాలు కలిగిన సమీకృత పోర్టు మౌలికసదుపాయాల సేవలు అందించే సంస్థ . ఇది ప్రస్తుతం గుజరాత్, గోవా, కేరళ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలలోని పది పోర్టులలో ఉంది. ప్రస్తుతం దీనిని సేకరిస్తున్న సంస్థ లాజిస్టిక్స్ చెయిన్ ( అంటే వెసల్ మేనేజ్ మెంట్ నుంచి యాంకరేజ్, పైలటేజ్, టగ్ పుల్లింగ్, బెర్తింగ్ సరకు లోడింగ్ అన్‌లోడింగ్, అంతర్గత రవాణా ,నిల్వ , ప్రాపసెసింగ్ చివరగా రోడ్డు లేదా రైలు మార్గంలో సరకు తరలింపు వరకు)ను నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం వద్ద డీప్‌సీ ఓడరేవు అభివృద్ధి , నిర్వహణదారు కార్యకలాపాలలో కెపిసిఎల్ నిమగ్నమై ఉంది. ఇది నిర్మించు-నిర్వహించు-భాగస్వామ్యం- బదలీ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి 30 సంవత్సరాల కాలానికి రాయితీ ఒప్పందానికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. ఇది మరో 20 సంవత్సరాలు అంటే రెండు విడతలుగా ఒక్కోసారి, పది సంవత్సరాలు పొడిగింపునకు వీలు కలిగిఉంది.
సవివరమైన సిసిఐ ఆదేశాలు తర్వాత విడుదల కానున్నాయి.
.
****
(Release ID: 1640584)
Visitor Counter : 200