రైల్వే మంత్రిత్వ శాఖ

యూఐసీ భద్రతా వేదిక (యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ కెమిన్స్ / ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వే) వైస్ ఛైర్మన్‌గా నామినేట్ అయిన డీజీ / ఆర్‌పీఎఫ్ శ్రీ అరుణ్ కుమార్

Posted On: 22 JUL 2020 7:14PM by PIB Hyderabad

యూఐసీ భద్రతా వేదిక (యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ కెమిన్స్ / ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వే) వైస్ ఛైర్మన్‌గా డీజీ / ఆర్‌పీఎఫ్ శ్రీ అరుణ్ కుమార్ నామినేట్ అయ్యారు. 96వ యూఐసీ జనరల్ అసెంబ్లీ నిర్ణయం ప్రకారం శ్రీ అరుణ్ కుమార్ భద్రతా వేదిక యొక్క ఉపాధ్యక్షుడిగా నామినేట్ అ‌య్యార‌ని యూఐసీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఫ్రాంకోయిస్ డావెన్నే రైల్వే బోర్డు ఛైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్‌కు తెలియ‌జేశారు. జులై 2020 నుండి జులై 2022 మ‌ధ్య కాలానికి గాను శ్రీ అరుణ్ కుమార్ ఈప‌‌ద‌వికి నామినేట్ అయిన‌ట్లుగా తెలిపారు. డీజీ / ఆర్‌పీఎఫ్ శ్రీ అరుణ్ కుమార్ జులై, 2022 నుంచి జులై 2024 వ‌ర‌కు భ‌ద్ర‌తా వేదిక ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.
యూఐసీ (యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ కెమిన్స్) అనేది ఒక ఫ్రెంచ్ పదం, దీని అర్ధం ఇంగ్లీషులో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వే. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది.
మేటి ఫ‌లితాలిచ్చిన కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ ..
వ్యక్తుల భద్రత, ఆస్తి మరియు సంస్థాపనలకు సంబంధించిన విషయాలలో రైల్వే రంగం తరపున విశ్లేషణ జ‌ర‌ప‌డంతో పాటు విధాన స్థానాలను అభివృద్ధి చేయడానికి, రూపొందించడానికి యూఐసీ భ‌ద్ర‌తా వేదికకు అధికారం ఉంది. యూఐసీ సభ్యుల భద్రతా సంస్థలలో సమాచారం మరియు అనుభవ మార్పిడిని ప్రోత్సహిస్తుంది. రైల్వేల‌లో భద్రతా రంగంలో సాధారణ ఆసక్తి ప్రాజెక్టులు మరియు కార్యకలాపాలను సభ్యుల అవసరం లేదా బాహ్య సంఘటనల ప్రకారం నిర్దేశిస్తుంది. యూఐసీ భ‌ద్ర‌తా వేదిక ఏర్పాటు చేసిన కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆలోచనల మార్పిడి, తీసుకోవలసిన జాగ్రత్తలు, పునరుద్ధరణ ప్రయత్నాలు మరియు ప్రస్తుత మహమ్మారి సమయంలో త‌మ‌త‌మ అనుభవాల్ని పంచుకోవడంలో చాలా ఉపయోగకరంగా నిలిచింద‌ని నిరూపించబడింది. భారతీయ రైల్వే తరపున ఆర్‌పీఎఫ్ ఎల్లప్పుడూ యూఐసీ  భద్రతా వేదికలో చురుకైన సభ్యుడిగా ఉంది మరియు చాలా కాలం నుండి చర్చలు, ఆలోచనల మార్పిడి మరియు ఉత్తమ పద్ధతులకు దోహదపడింది. ఇది న్యూఢిల్లీలో 2006 మరియు 2015 లో యూఐసీ  భద్రతా సమావేశాలను కూడా నిర్వహించింది. ఆర్‌పీఎఫ్ సంస్థ వివిధ వర్కింగ్ గ్రూపులు, ఫోరమ్‌లు మరియు సమావేశాలలో పాల్గొంటుంది. యూఐసీ సెక్యూరిటీ ప్లాట్‌ఫాం పనిలో ఆర్‌పీఎఫ్ సహకారాన్ని యూఐసీ నాయకత్వం గ‌త చాలా కాలం నుండి ప్రశంసించ‌బ‌డింది.


 

*****



(Release ID: 1640510) Visitor Counter : 133