పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భారత-అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం 2 వ సమావేశం ముగిసిన సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, స్టీలు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు
Posted On:
17 JUL 2020 9:33PM by PIB Hyderabad
“ ఈరోజు అమెరికా ఇంధన మంత్రి డాన్ బ్రౌలెట్టి నేను అమెరికా- ఇండియా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య 2వ మంత్రుల సమావేశానికి సహ అధ్యక్షులుగా ఉన్నాము. మా చర్చలు ఇంధనరంగానికి సంబంధించిన మొత్తం ద్వైపాక్షిక అంశాలపై సాగాయి .ఈ రోజు సమావేశానికి ముందస్తుగా అమెరికా ఇంధన మంత్రి, నేనూ జూలై 15న అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించాము. నేను విడిగా జూలై 14న అమెరికా- ఇండియా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం (యుఎస్ఐఎస్ పి ఎఫ్) ఏర్పాటు చేసిన పరిశ్రమ స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించాను.
వ్యూహాత్మకభాగస్వామ్యానికి చెందిన నాలుగు ప్రధాన స్థంభాల కింద జరిగిన ప్రగతి పట్ల , అలాగే పరిశుద్ధ ఇంధన పరిశోధనను(పిఎసిఇ) ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇండియా - అమెరికా భాగస్వామ్యం పైన నేను, అమెరికా మంత్రి బ్రౌలెట్టి సంతృప్తి చెందాము.
ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యం , పెట్టుబడులను ముందుకు తీసుకుపోవడంతోపాటు, ఇంధన సహకారాన్ని, ఇంధన భద్రత, ఇంధన విస్తృతి, వివిధ ఇంధన రంగాలతో నవకల్పనల అనుసంధానం, పరిశ్రమ, సంబంధిత వర్గాలు, ఇరు దేశాలకు చెందిన విశిష్ట సంస్థలమధ్య సంబందాలు పెంపొందాలని మేము కోరుకుంటున్నాము.
ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యం, 3 సంవత్సరాల స్వల్పకాలంలోనే చెప్పుకోదగిన స్థాయిలో పెరగడం పట్ల మేం సంతృప్తి చెందాము. హైడ్రో కార్బన్ల ద్వైపాక్షిక వాణిజ్యం ఒక్కటే 2019-20 ల మధ్య 9.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంలో పదిశాతం . ఇరు దేశాలమధ్య వాణిజ్య లోటు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గడం మేం చూశాం. అమెరికా క్రూడ్ ఆయిల్‌కు ఇండియా నాలుగవ పెద్ద ఎగుమతి గమ్యస్థానం, అలాగే అమెరికాఎల్.ఎన్.జికి ఇండియా 5 వ పెద్ద గమ్యస్థానంగా ఉంది. భారతీయ కంపెనీలు ఈ ఏడాదినుంచి మరిన్ని దీర్ఘకాలిక కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నందున ఈ పరిస్థితి ముందు ముందు కూడా కొనసాగనున్నది.
వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై సహకారాన్ని ప్రారంభించేందుకు మేం ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాం. భారతదేశ వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచేందుకు, అమెరికా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలలో, క్రూడ్ ఆయిల్ నిల్వకు సంబంధించిన చర్చల విషయంలోనూ పురోగతిలోఉన్నాం.
అమెరికా- ఇండియా సహజవాయు టాస్కుఫొర్సు ద్వారా, భారతదేశ, అమెరికా పరిశ్రమలు వినూత్న ప్రాజెక్టుల పై కొత్త వాణిజ్య భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఇండియా సూచిస్తూ వచ్చిన గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన దార్శనికతకు మద్దతుగా పలు విధానపరమైన, రెగ్యులేటరీ సిఫార్సులను అవి అభివృద్ధి చేశాయి. దీనిప్రకారం ఇండియా, అమెరికా కంపెనీల మధ్య పలు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఇవి ఫలప్రదమైన దశకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు సంయుక్త ప్రకటనలో ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన(ఆర్ ఇ) రంగానికి సంబంధించి పలు చర్యలు తీసుకోవడం జరిగింది. సౌత్ ఏసియాగ్రూప్ ఫర్ ఎనర్జీ (ఎస్.ఎ.జి.ఇ), హైడ్రోజన్ టాస్క్‌ఫొర్సు లను ప్రారంభించడం జరిగింది.
నీతి ఆయోగ్, యుఎస్ఎఐడి లు కూడా ఇండియన్ ఎనర్జీ మోడలింగ్ ఫోరం ను ప్రారంభించాయి. ఇంధన డాటా మేనేజ్‌మెంట్ ద్వారా దీర్ఘకాలిక ఇంధన అభివృద్ధి,ప్రణాళికలు, వ్యూహాలకు దీనిని ప్రారంభించారు. అలాగే తక్కువ కార్బన్ సాంకేతిక పరిజ్ఞానాన్నిప్రోత్సహించడానికి సంబంధించి వివిధ కార్యక్రమాలను ప్రారంభమయ్యాయి.
జీవ ఇంధనం, వ్యవసాయం, ఎస్.ఎం.ఇలలో పునరుత్పాదక ఇంధన వినియోగం, సిసియుఎస్ ల ద్వారా అత్యున్నత సామర్ధ్యంతో కూడిన బొగ్గు సాంకేతిక పరిజ్ఞానాలతో తక్కువ లేదా అసలు ఉద్గారాలు లేని స్థితి వంటి వినూత్న అంశాలలో పరస్పరం సహకరించుకునేందుకు మేం అంగీకరించాం.
ఎస్.ఇ.పిలోని నాలుగు ముఖ్యాంశాలలో భాగంగా ఇంధన రంగంలో మహిళలు అనే అంశాన్ని కూడా చేర్చేందుకు మేం అంగీకరించాం. మహిళలు ఇంధన నిర్వహణ వ్యవస్థలలో పాల్గొనేందుకు,. ఇండియా చేపట్టిన ఉజ్వల కార్యక్రమంలో ప్రతిఫలించినట్టు అంతిమ వినియోగదారులుగా ప్రయొజనం పొందేందుకు ఇది వారిని ప్రొత్సహిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం, స్వల్ప వ్యవధిలోనే ,ఉభయ పక్షాలకూ ప్రయొజనకరంగా రూపుదిద్దుకుంది.అలాగే మొత్తం భారతదేశం-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం లోని కీలక స్థంభాలలో ఇది ఒకటిగా ఉంది.
ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌లో చేరాల్సిందిగా నేను అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా కంపెనీలను కోరాను. ఇది ఇండియాను 21 వ శతాబ్దపు అంతర్జాతీయ తయారీ హబ్‌గా, ప్రత్యేకించి ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్దిలో పరివర్తన చెందించనుంది.
ఇండియాకు మార్కెట్ ఉండగా, అమెరికాకు చమురు, గ్యాస్ నిక్షేపాలు, పెట్టుబడి సామర్ధ్యం, సంబంధిత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. మనతొ సంబంధం అందరికీ ప్రయోజనకరమేనని నేను విశ్వసిస్తున్నాను.
ఈ సమావేశానికి సంబంధించి సంయుక్త ప్రకటనను విడుదల చేయడం జరిగింది ఇది మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ఉంది.
ఇండియా- అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిరంతర మద్దతు నిస్తున్న మంత్రి బ్రౌలెట్టికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.”
***
(Release ID: 1639589)