వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ అందుబాటు , సరఫరా పై సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
దేశంలో సరిపడినంతగా అందుబాటు,తయారీ , సరఫరా, నిల్వసామర్ధ్యం ఉన్న మెడికల్ ఆక్సిజన్
Posted On:
17 JUL 2020 6:01PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈరోజు దేశంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా ,నిల్వసామర్ధ్యం పెంపు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ, అంతర్గత వాణిజ్యం (డిపిఐఐటి), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారులు, ఇందుకు సంబంధించి మంత్రికి సమాచారం తెలియజేస్తూ ,ప్రస్తుతానికి మెడికల్ ఆక్సిజన్ తయారీ, సరఫరా, నిల్వ, రవాణాకు సంబంధించి ప్రధానంగా ఎలాంటి సమస్య లేదని చెప్పారు. 2020 ఏప్రిల్‌లో సగటు నెలవారీ మెడికల్ ఆక్సిజన్ వాడకం రోజుకు 902 ఎం.టిలుగా ఉండగా, ఇది జూలై 15 నాటికి రోజుకు 1512 ఎంటిలకు పెరిగిందన్నారు. ప్రస్తుతానికిన 15 వేల ఎంటిల మేరకు సరిపడినంత నిల్వలు ఉన్నాయని వారు తెలిపారు.
మెడికల్ ఆక్సిజన్‌కు సంబంధించి మొత్తంమీద ప్రస్తుత ఉత్పత్తి, సరఫరా, అన్ని రాష్ట్రాలలోకూడా ఈ నెలాఖరుకు అవసరంకాగల అంచనాలతో పోల్చినపుడు తగినంతగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రాలలో మెట్రోలు, జిల్లాలలో పెద్ద సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉన్నచోట సరఫరా,నిల్వ తగినంతగా ఉందని వారు తెలిపారు. అలాగే, మారుమూల ప్రాంతాలలో మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా మొత్తం కోవిడ్ -19 కేసులలో ఐసియు తోపాటు ఆక్సిజన్ అవసరమున్న కేసులు నిన్న 4.58 శాతం తగ్గినట్టు వారు ప్రముఖంగా ప్రస్తావించారు. మెడికల్ ఆక్సిజన్ నిల్వ సామర్ధ్యం 2020 మార్చి 1న 5938 ఎం.టి ఉండగా దానిని 10శాతం పెంచడం జరుగుతోంది.
అన్ని ప్రధాన సిలిండర్ , క్రయోజనిక్ వెసల్స్ తయారీదారులు ప్రస్తుతం ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ఈ మార్కెట్ ప్లేస్ (జిఇఎం)లో రిజిస్టరై ఉన్నారు. మెడికల్ ఆక్సిజన్ జనరేటర్ల తయారీదారులను కూడా నమోదు చేసే పనిలో ఉన్నారు.
ఏదైనా ఊహించని పరిణామం సంభవించి, ఉన్నట్టుండి మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగితే అందుకు తగినట్టుగా ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనుసంధానత దెబ్బతినే ప్రాంతాలలో ఆక్సిజన్ సరఫరాను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవలసిందిగా పియూష్ గోయల్ ఆదేశించారు.
(Release ID: 1639507)
Visitor Counter : 184