రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ సీజన్ కోసం, ఏప్రిల్ 1వ తేదీ నుంచి జులై 16వ తేదీ వరకు మహారాష్ట్రకు 8.83 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే, 11.96 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచిన కేంద్రం
మహారాష్ట్రలో యూరియా కొరత లేదు
Posted On:
17 JUL 2020 4:59PM by PIB Hyderabad
సాగు సమయానికి ముందే అంచనా వేసిన ఎరువుల అవసరానికి తగినట్లుగా, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సకాలంలో సరిపడినంత సరఫరాకు కేంద్ర ఎరువుల విభాగం భరోసా కల్పిస్తోంది.
మొత్తం ఖరీఫ్ సీజన్ కోసం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) మహారాష్ట్రకు కావలసిన ఎరువుల అంచనా 15 లక్షల మెట్రిక్ టన్నులు. సరఫరా ప్రణాళిక ప్రకారం కచ్చితంగా ఎరువుల పంపిణీ జరిగేలా చూడాలని పంపిణీదారులకు కేంద్రం సూచించింది. ఈ మొత్తం ప్రక్రియను ఏరోజుకారోజు కేంద్ర ఎరువుల విభాగం పర్యవేక్షిస్తోంది. ఎరువుల అవసరం పెరిగితే, ఈ విభాగం తగిన విధంగా స్పందిస్తుంది.
ఖరీఫ్ సీజన్ కోసం, ఏప్రిల్ 1వ తేదీ నుంచి జులై 16వ తేదీ వరకు మహారాష్ట్రకు 8.83 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రారంభ నిల్వతో కలిపి 11.96 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం అందుబాటులో ఉంచింది.
ఈ కాలంలో, యూరియా డీబీటీ అమ్మకాలు 9.57 లక్షల మెట్రిక్ టన్నులు. గతేడాది ఇదే సమయంలో ఈ అమ్మకాలు 4.7 లక్షల మెట్రిక్ టన్నులు. అమ్మకాల్లో ఊహించని పెరుగుదల ఉన్నా, యూరియా లభ్యతలో కొరత రాలేదు.
ప్రస్తుత జులై నెలలో 3.15 లక్షల మెట్రిక్ టన్నులను అంచనా వేస్తే, ప్రారంభ నిల్వతో కలిపి 4.34 లక్షల మెట్రిక్ టన్నులను ఎరువుల విభాగం అందుబాటులో ఉంచింది. ఈ నెలలో మిగిలిన సమయానికి 1.52 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేస్తుండగా, ఈనెల 16వ తేదీకి ముగింపు నిల్వ అయిన 2.38 లక్షల మెట్రిక్ టన్నులు ఆ అవసరాన్ని తీరుస్తాయి. ఒప్పంద సరఫరా ప్రణాళిక ప్రకారం యూరియా పంపిణీ కొనసాగుతుంది.
***
(Release ID: 1639440)
Visitor Counter : 210