విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అసాధారణమైన కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శించిన - సింగ్రౌలి ఎన్.టి.పి.సి.
Posted On:
11 JUL 2020 2:29PM by PIB Hyderabad
ఎన్.టి.పి.సి. లిమిటెడ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, కేంద్ర విద్యుత్ సంస్థ (సి.ఈ.ఏ) విడుదల చేసిన సమాచారం, ప్రకారం భారతదేశపు అతి పెద్ద విద్యుత్తు ఉత్పత్తి సంస్థ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, ఎన్.టి.పి.సి. సింగ్రౌలి యూనిట్-1, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన యూనిట్ గా అవతరించింది. ఎన్.టి.పి.సి., సింగ్రౌలి యూనిట్ - ఎన్.టి.పి.సి. కి చెందిన అతి పురాతనమైన, ప్రధాన విద్యుత్ కేంద్రం.
ఈ కేంద్రానికి చెందిన మొదటి యూనిట్ 1982 ఫిబ్రవరి 13వ తేదీన విద్యుత్తు ఉత్పత్తి చేయడం ప్రారంభించి, అసాధారణమైన పని తీరుతో దేశానికి తన సేవలను కొనసాగిస్తోంది.
ఎన్.టి.పి.సి. సింగ్రౌలీ కేంద్రానికి 2,000 మెగావాట్ల సామర్థ్యం ఉంది. ఈ కేంద్రంలో 200 మెగావాట్ల చొప్పున ఐదు యూనిట్లు, 500 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లు ఉన్నాయి. 200 మెగావాట్ల యూనిట్లలో మూడు (1, 4 & 5) యూనిట్లు ఈ ఆర్ధిక సంవత్సరం 2020-21 మొదటి త్రై మాసికంలో, దేశంలో బొగ్గు ఆధారిత ఇతర విద్యుత్ యూనిట్లతో పోలిస్తే, వరుసగా 101.96 శాతం, 101.85 శాతం, 100.35 శాతం చొప్పున అత్యధిక పి.ఎల్.ఎఫ్. సాధించాయి.
మొత్తం 62,110 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యంతో, ఎన్.టి.పి.సి. గ్రూప్‌లో 70 విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 24 బొగ్గు ఆధారిత కేంద్రాలు, 7 గ్యాస్ మరియు ద్రవ ఇంధనంతో కలిసినవి, ఒకటి జల విద్యుత్తు, 13 పునరుత్పాదక కేంద్రాలతో పాటు 25 అనుబంధ, భాగస్వామ్య విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి.
*****
(Release ID: 1637991)
Visitor Counter : 246